For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ప్రధాని మోడీ గారూ! 20,000 ఉద్యోగాలు కాపాడండి, రూ.1500 కోట్లు ఇవ్వండి'

|

జెట్ ఎయిర్వేస్‌ను కాపాడాలని, అందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1500 కోట్లు తక్షణ సాయంగా ఇవ్వాలని, ప్రధాని నరేంద్ర మోడీ తమ ఉద్యోగాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని జెట్ పైలట్స్ బాడీ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) సోమవారం నాడు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ ఆరేడు విమానాలు మాత్రమే నడుపుతోంది. పైలట్లకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. విమానాల రెంట్ ఇవ్వలేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

ఈ నేపథ్యంలో ఎన్ఏజీ వైస్ ప్రెసిడెంట్ ఆదిమ్ వళినేని మాట్లాడుతూ... తాము ఎస్బీఐకి, ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నామని, ఎస్బీఐ రూ.1500 కోట్లు ఫండ్ విడుదల చేయాలని, ప్రధానమంత్రి జోక్యం చేసుకొని, 20వేల మంది ఉద్యోగాలు కాపాడాలని కోరారు.

జెట్ ఎయిర్‌వేస్‌కు దెబ్బ మీద దెబ్బ: 1,100 పైలట్లు ధర్నా!జెట్ ఎయిర్‌వేస్‌కు దెబ్బ మీద దెబ్బ: 1,100 పైలట్లు ధర్నా!

Jet pilots appeal to SBI to release Rs 1500 cr, ask PM to save 20,000 jobs

యూఎస్, యూకే కంపెనీలతో నరేష్ గోయల్ చేతులు కలిపే ఛాన్స్

జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ ఇటీవల బోర్డు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన మరోసారి జెట్ ఎయిర్వేస్‌ను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆయన అమెరికా, యూకేలకు చెందిన కంపెనీలతో చేతులు కలపనున్నారని తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్‌కు ఎవరైనా బిడ్ వేయవచ్చు. యూఎస్, యూకే కంపెనీలతో కలిసి నరేష్ గోయల్ కూడా బిడ్ వేసే అవకాశాలు ఉన్నాయి.

English summary

'ప్రధాని మోడీ గారూ! 20,000 ఉద్యోగాలు కాపాడండి, రూ.1500 కోట్లు ఇవ్వండి' | Jet pilots appeal to SBI to release Rs 1500 cr, ask PM to save 20,000 jobs

Jet Airways pilots body, the National Aviator's Guild, Monday appealed the State Bank of India (SBI) to release Rs 1,500 crore, which was proposed to be infused in the ailing carrier as part of a debt-restructuring plan last month.
Story first published: Monday, April 15, 2019, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X