For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

50 శాతం జీతాలకే స్పైస్‌జెట్‌లో చేరుతున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు: కారణాలివే

|

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన పైలట్లు ఇతర విమనయాన రంగాల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం పది కంటే తక్కువ జెట్ విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. మరోవైపు పైలట్లకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. ఇంకోవైపు పలువురు పైలట్లు ఇతర సంస్థల్లో చేరుతున్నారు. స్పైస్ జెట్... జెట్ పైలట్లను చేర్చుకుంటోంది. అయితే ప్రస్తుతం వారికి ఉన్న వేతనాల కంటే చాలా తక్కువగా చేరే పరిస్థితి ఏర్పడింది. పైలట్లతో పాటు ఇంజినీర్లు కూడా స్పైస్ జెట్‌లో చేరుతున్నారు.

<strong>జెట్ ఎయిర్‌వేస్‌కు రేపు రూ.1000 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్!</strong>జెట్ ఎయిర్‌వేస్‌కు రేపు రూ.1000 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్!

50 శాతం కంటే తక్కువ వేతనాలు

50 శాతం కంటే తక్కువ వేతనాలు

ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు పైలట్లకు జెట్ ఎయిర్‌వేస్‌లో ఉన్న వేతనాల కంటే 25 నుంచి 30 శాతం తక్కువగా ఇచ్చి తీసుకుంటున్నారు. ఇంజినీర్లకు 50 శాతం వరకు తక్కువ మొత్తం ఇచ్చి తీసుకుంటున్నారు. అంటే వీరి వేతనం సగానికి సగం తగ్గించి ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. జెట్ సంక్షోభం నేపథ్యంలో చాలామంది పైలట్లు, ఇంజినీర్లు ప్రధానంగా స్పైస్ జెట్ వైపు చూస్తున్నారు. దీంతో ఇదే అదనుగా తక్కువ మొత్తం ఆఫర్ చేసి తీసుకుంటున్నారు.

తక్కువ వేతానికి వెళ్లడానికి కారణాలివే

తక్కువ వేతానికి వెళ్లడానికి కారణాలివే

ఇటీవలి వరకు జెట్ ఎయిర్వేస్ నుంచి వచ్చిన పైలట్లు, ఇంజినీర్లకు వస్తున్న వేతనాలకు తోడు బోనస్‌లు ఇచ్చి మరీ స్పైస్ జెట్‌ తీసుకుంది. ఇప్పుడు జెట్ ఆర్థిక స్థితి మరింత క్లిష్టంగా మారడం వల్ల తక్కువ వేతనాలకు తీసుకుంటున్నారని చెబుతున్నారు. జెట్‌లో నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనం పొందుతున్నానని, బోయింగ్ విమానాలనే నడుపుతున్న స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లలో దరఖాస్తు చేసుకుంటే రూ.1.50-2.0 లక్షల ఆఫర్‌ వచ్చిందని ఓ సీనియర్ ఇంజినీర్ తెలిపారు. మరీ తక్కువ వేతనాలు వస్తుండటంతో జెట్ ఎయిర్వేస్‌లోకి కొత్తగా వచ్చే పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. నాలుగైదేళ్ల అనుభవం కలిగిన పైలట్లు మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇతర సంస్థల్లో చేరుతున్నారని తెలిపారు. సీనియర్ పైలట్లు మాత్రం ఇలా వెళ్లడానికి మూడు నుంచి అయిదేళ్ల బాండ్ రాయాలని, కాబట్టి వారు ఇష్టపడటం లేదని చెప్పారు. దాదాపు రూ.3 లక్షలు వచ్చే కో-పైలట్లు మాత్రం రూ.2 లక్షలు వస్తున్నా వెళ్లిపోతున్నారని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఫైనాన్షియల్ కమిట్‌మెంట్స్ వల్ల చాలామంది తక్కువ వేతనం వచ్చినా వెళ్తున్నారని చెప్పారు.

 స్పైస్ జెట్ స్పందన

స్పైస్ జెట్ స్పందన

జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజనీర్లను తక్కువ వేతనాలకు తీసుకుంటుందని వార్తలు రావడంపై స్పైస్ జెట్ ఎగ్జిక్యూటివ్ స్పందించారు. తమ సంస్థ శాలరీ స్ట్రక్చర్ ప్రకారమే ఇస్తున్నామని, జెట్ ఎయిర్వేస్ శాలరీ స్ట్రక్చర్‌ను తాము ఫాలో కావడం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా, బోయింగ్ విమానాలు నడిపే పైలట్లను ఎయిర్ బస్ విమానాలకు తీసుకోవాలంటే 6 నెలల శిక్షణ అవసరమని చెబుతున్నారు. ఇంజినీర్లకు కూడా మూడు నుంచి నాలుగు నెలల శిక్షణ అవసరమని చెబుతున్నారు. ఖర్చు కూడా అధికంగా ఉంటుందట. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం తాత్కాలికమేనని, త్వరలో ఇది సమసిపోతుందని కొందరు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సమ్మె నిర్ణయం వాయిదా

సమ్మె నిర్ణయం వాయిదా

సోమవారం ఉదయం నుంచి 1100 మంది పైలట్లు విమానాలను నడపరని జెట్ ఎయిర్వేస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ తొలుత నిర్ణయించింది. కానీ ఆ తర్వాత దీనిని వాయిదా వేసింది. యాజమాన్యం, బ్యాంకర్ల మధ్య సోమవారం చర్చలు జరగనున్నందున, సంస్థ పునరుద్ధరణకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

English summary

50 శాతం జీతాలకే స్పైస్‌జెట్‌లో చేరుతున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు: కారణాలివే | Jet Airways pilots, engineers joining SpiceJet with pay cuts of up to 50%: report

Low cost carrier and top rival SpiceJet appears to be making the most of the crisis at Jet Airways. Spicejet is now hiring engineers and pilots at much lower pay than their current salaries at the financially troubled Jet.
Story first published: Monday, April 15, 2019, 10:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X