For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EMI, వడ్డీ: మీ లోన్ బర్డెన్ తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు!

|

పర్సనల్ లోన్, హోం లోన్, కారు లోన్, బైక్ లోన్.. ఇలా ఓ రుణం తీసుకున్నా వడ్డీతో సహా చెల్లించవలసి ఉంటుంది. ఈఎంఐ ఎంత త్వరగా పూర్తి అవుతుందా అని చాలామంది ఎదురు చూస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మీ లోన్ బర్డెన్‌ను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్లాన్‌గా వెళ్తే ఈ బరువు నుంచి ఉపశమనం లభించవచ్చు.

హోంలోన్ వంటివి లాంగ్ టర్మ్ ఉంటాయి. పర్సనల్ లోన్, కారు లోన్లు అయితే మూడు నుంచి ఏడేళ్ల కాల పరిమితితో ఉంటాయి. మన నెల వేతనంలో చాలామొత్తం ఈఎంఐలకే సరిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మన ఈఎంఐ బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. కొన్ని మెథడ్స్ చూడండి.

<strong>ఈ బ్యాంకులో 1998లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 34 రెట్లు పెరుగుతుంది</strong>ఈ బ్యాంకులో 1998లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 34 రెట్లు పెరుగుతుంది

హోంలోన్ ముందస్తు చెల్లింపులు

హోంలోన్ ముందస్తు చెల్లింపులు

హోంలోన్ కాలపరిమితి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ఏదైనా బ్యాంక్ నుంచి 20 ఏళ్ల టెన్యూర్‌తో 9 శాతం వడ్డీకి రూ.50 లక్షల హోంలోన్ తీసుకున్నారనుకుంటే.. ఈ ఇరవై ఏళ్లలో అసలుకు తోడు మరో రూ.57.96 లక్షల మొత్తాన్ని మీరు చెల్లించవలసి ఉంటుంది. ప్రతి నెల ఈఎంఐ రూపంలో రూ.44,986 చెల్లిస్తారు. మొత్తంగా 20 ఏళ్లకు గాను మీరు చెల్లించే డబ్బు 107 లక్షలకు పైగా అవుతుంది. అంటే మీరు తీసుకున్న మొత్తానికి రెండింతలుగా మీరు చెల్లించాల్సిన సొమ్ము అవుతుంది. పైగా ఇచ్చిన వడ్డీ రేట్లలో హెచ్చతగ్గులు ఉండవచ్చు. అయిదేళ్ల తర్వాత మీ లోన్ మొత్తంలో 5 శాతం చెల్లించేందుకు సిద్ధమయితే మీకు దాదాపు ఐదు ఈఎంఐలు తగ్గుతాయి. ఈ మొత్తం చెల్లింపుతో మీ లోన్ టెన్యూర్ 18 ఈఎంఐల వరకు తగ్గుతుంది. అంతేకాదు, మీ లోన్ ఇంట్రెస్ట్ కూడా 52.26 లక్షలకు తగ్గుతుంది. మీ లోన్ అమౌంట్‌ను కొంత మొత్తం ముందే చెల్లించుకుంటూ వెళ్తే మీ ఈఎంఐలు త్వరగా పూర్తి కావడంతో పాటు ఇంట్రెస్ట్ రేటు తగ్గుతుంది. ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు మీరు చెల్లించడం మంచిది.

మీ లోన్‌ను ముందుగానే క్లోజ్ చేయడం

మీ లోన్‌ను ముందుగానే క్లోజ్ చేయడం

మీ చేతిలో డబ్బులు ఉంటే మీ హోంలోన్‌ను ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. హోం లోన్‌కు సంబంధించి ప్రీపే విషయంలో ఎలాంటి క్లోజర్ ఛార్జీలు ఉండవు. అలాగే, ఈఎంఐలు టైమ్ ప్రకారం చెల్లిస్తే రివార్డ్ ద్వారా టాపప్స్ ఇస్తామని చెబుతారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ రెగ్యులర్ లోన్ కంటే వీటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు శాలరైడ్ అయితే, మీ వేతనం ప్రతి ఏటా పెరిగే అవకాశముంటుంది. కాబట్టి మీ వేతనం పెరుగుతున్నట్లుగానే మీ ఈఎంఐ కూడా ప్రతి ఏటా పెంచుకోవడం మేలు. అలా చేస్తే ఈఎంఐ త్వరగా క్లోజ్ అవుతుంది. ప్రతి ఏటా ఐదు నుంచి 10 శాతం వరకు తన ఈఎంఐ పెంచాలని బ్యాంకులను కోరవచ్చు.

బేసిక్ పాయింట్లు.. వడ్డీ రేట్లు

బేసిక్ పాయింట్లు.. వడ్డీ రేట్లు

ఆర్బీఐ రేట్ ఛార్జీలు తగ్గించినా, బ్యాంకులు కొన్ని సందర్భాలలో ఇంట్రెస్ట్ రేటు తగ్గించవు. ఉదాహరణకు ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్స్ తగ్గిస్తే, బ్యాంకులు కేవలం 20 బేసిక్ పాయింట్స్ మాత్రమే తగ్గిస్తాయి. ఎప్పుడు కూడా బ్యాంకులతో టచ్‌లో ఉండాలి. మీ రుణ రేట్లను ఎప్పటికి అప్పుడు తెలుసుకోవాలి. ఒకవేళ మీ లోన్ ఇంట్రెస్ట్.. మార్కెట్ రియాలిటీస్‌తో సింక్ కాకపోయి ఉంటే, మీరు మరో బ్యాంకుకు మారవచ్చు. లోన్ ట్రాన్సుఫర్ కోసం దాదాపు 1 శాతం ప్రాసెసింగ్ ఫీ ఉండవచ్చు.

English summary

EMI, వడ్డీ: మీ లోన్ బర్డెన్ తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు! | smart ways to lower your loan burden

Repaying home loans especially can go on for decades. Even car and personal loans can drag on for 5-7 years. EMIs can take out a big chunk of our monthly income. Surely there has to be a way to reduce your EMI burden over time.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X