For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్: నేటి నుంచి లోన్ రేట్లు తగ్గాయి, పూర్తి వివరాలు తెలుసుకోండి

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు శుభవార్త. ఈ బ్యాంక్ లోన్ ఇంటరెస్ట్ రేట్‌ను తగ్గించింది. ఇది నేటి నుంచి (ఏప్రిల్ 10వ తేదీ) అమలులోకి వస్తుంది. అన్ని కాలపరిమితి రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. ఇదివరకు సంవత్సర కాలానికి ఎంసీఎల్ఆర్ 8.55 ఉండగా, ఇప్పుడు ఇది 8.5 శాతానికి పరిమితం అయింది. ఈ మేరకు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. రూ.30 లక్షల వరకు హోం లోన్‌పై వడ్డీ రేట్లను కూడా పది బేసిక్ పాయింట్లు తగ్గించింది. అంటే 0.10 శాతం వడ్డీ తగ్గనుంది. దీంతో రూ.30 లక్షల లోపు రుణాల వడ్డీ రేట్లు గతంలో 8.7 శాతం నుంచి 9 శాతం వరకు ఉండగా, ఇప్పుడు 0.10 శాతం తగ్గి 8.6 శాతం నుంచి 8.9 శాతంగా ఉంటాయి.

పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా?పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా?

ఇంటరెస్ట్ రేట్ తగ్గించిన ఎస్బీఐ

ఇంటరెస్ట్ రేట్ తగ్గించిన ఎస్బీఐ

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ 4వ తేదీన రెపో రేటును పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఏప్రిల్ 7వ తేదీ నుంచి తగ్గించింది. ఎస్‌బీఐ కూడా తగ్గించింది. నవంబర్ 2017 తర్వాత వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. పదిహేడు నెలల క్రితం కూడా బ్యాంక్ ఇంతేస్థాయిలో వడ్డీ రేట్లను తగ్గించింది.

దేనిపై ఎంత వడ్డీ రేటు తగ్గుతుందంటే?

దేనిపై ఎంత వడ్డీ రేటు తగ్గుతుందంటే?

అంతేకాదు, మే 1, 2019వ తేదీ నుంచి సేవింగ్ బ్యాంక్ ఇంటరెస్ట్, స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేట్లను కూడా ఎంసీఎల్ఆర్‌తో లింక్ చేయనుంది. అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ.1 లక్ష వరకు ఉంటే దీనిపై 3.50 శాతం వార్షిక వడ్డీని, రూ.1 లక్ష కంటే ఎక్కువ మొత్తం ఉన్న బ్యాలెన్స్ పైన 3.25 శాతం వడ్డీని చెల్లించనుంది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వడ్డీ రేట్లు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వడ్డీ రేట్లు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు కూడా లోన్ ఇంటరెస్ట్ రేటును (ఎంసీఎల్ఆర్) 5 బేసిక్ పాయింట్లు తగ్గించింది. ఇది కూడా నేటి నుంచి (ఏప్రిల్ 10) నుంచి అమలులోకి వస్తుంది. ఏడాది, అంతకంటే ఎక్కువ కాలపరిమతి కలిగిన రుణాలపై ఈ వడ్డీరేటును తగ్గించింది. దీంతో రుణ రేటు 8.65 శాతానికి చేరుకుంది. వీటితోపాటు రెండేళ్ల రుణాలపై వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గనుంది. మూడేళ్ల 8.85 శాతానికి తగ్గనుందని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ

రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ

ఆర్బీఐ వారం క్రితం రెపో రేటు తగ్గించడంతో పాటు, గత ఏడాది ఫిబ్రవరిలోను ఓ పావు శాతం తగ్గించింది. దీంతో రెండు నెలల్లో రెపో రేటు 6.5 శాతం నుంచి 6 శాతానికి దిగి వచ్చింది. అంతేకాదు, పాలసీ నిర్ణయాలను బ్యాంకులు అమలు చేయడంలేదని, ముఖ్యంగా వడ్డీరేట్లను తగ్గించడానికి ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు.

English summary

ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్: నేటి నుంచి లోన్ రేట్లు తగ్గాయి, పూర్తి వివరాలు తెలుసుకోండి | SBI's Home Loan Interest Rates To Come Down From April 10

SBI on Tuesday reduced its interest rate by 10 basis points on housing loans of up to Rs. 30 lakh, according to a press release issued by the bank.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X