For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్ పే వాడుతున్నారా, మీకో షాకింగ్ న్యూస్: ఆర్బీఐ అనుమతి లేదా?

|

న్యూఢిల్లీ: నగదు లావాదేవీల కోసం మీరు పేమెంట్ యాప్ గూగుల్ పే ఉపయోగిస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అధికారిక ధృవీకరణ లేకుండానే ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోందట. తాజా పరిణామాలు చూస్తుంటే ఆర్బీఐ అనుమతి లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.

కొత్త ఐటీ రిటర్న్స్ ఫారమ్స్ ఇవే: ఈ వివరాలు తెలుసుకోండికొత్త ఐటీ రిటర్న్స్ ఫారమ్స్ ఇవే: ఈ వివరాలు తెలుసుకోండి

గూగుల్ పే అథంటికేషన్

గూగుల్ పే అథంటికేషన్

గూగుల్ పే అనే యాప్‌కు ఆర్బీఐ అథంటికేషన్ లేదని పిటిషన్ దాఖలైంది. ఈ యాప్‌ను ఆర్బీఐ ధృవీకరించలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీ హైకోర్టు.. ఆర్బీఐకి ప్రశ్నలు సంధించింది. గూగుల్ మొబైల్ పేమెంట్ యాప్ గూగుల్ పే ఎలాంటి అధికారిక లైసెన్స్ లేకుండానే సేవలు అందిస్తోందా? అనుమతు లేకుండానే ఆపరేట్ చేస్తోందా? అని ఆర్బీఐని ప్రశ్నించింది.

గూగుల్ పే యాప్ పైన పిటిషన్

గూగుల్ పే యాప్ పైన పిటిషన్

గూగుల్‌ పే యాప్‌పై అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గూగుల్ పే యాప్‌ పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. నగదు బదలీలు చేసేందుకు ఈ యాప్‌కు కేంద్ర బ్యాంక్ నుంచి సరైన ధృవీకరణ లేదన్నారు. ఈ ఏడాది మార్చి 20వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టం ఆపరేటర్స్ లిస్ట్‌లోను ఈ పేరు లేదని తెలిపారు. గూగుల్ పేకు అనుమతి లేకపోవడం వల్ల పర్యవేక్షణ లేకుండా, ఎలాంటి అథంటికేషన్ లేకుండా ఆధార్, పాన్ కార్డ్, ట్రాన్సాక్షన్స్‌ వంటి పర్సనల్ సమాచారం ఉంటుందని పేర్కొన్నారు.

గూగుల్, ఆర్బీఐకి నోటీసులు

గూగుల్, ఆర్బీఐకి నోటీసులు

ఈ పిటిషన్ పైన విచారణ జరుపుతున్న కోర్టు.. ఆర్బీఐకి ప్రశ్నలు వేసింది. ఈ పిటిషన్ పైన స్పందన తెలియజేయాలని ఆర్బీఐతో పాటు గూగుల్ ఇండియాకు కూడా నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులు రాజేంద్ర మీనన్, జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీ నేతృత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీల కోసం పలు డిజిటల్ పేమెంట్ యాప్‌లు వచ్చాయి. ఇందులో గూగుల్ పే ఒకటి.

English summary

గూగుల్ పే వాడుతున్నారా, మీకో షాకింగ్ న్యూస్: ఆర్బీఐ అనుమతి లేదా? | Is Google Pay operating without licence: Delhi HC asks RBI

In a shocking revelation by the Delhi High Court, the authenticity of Google Pay has been challenged as the UPI-powered payment app is alleged to facilitate financial transactions without the requisite authorisation.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X