For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాక్స్ బెనిఫిట్స్, లోన్ అమౌంట్..: ప్రాపర్టీ మీద లోన్ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి

|

ప్రాపర్టీపై కూడా పెద్ద మొత్తంలో మీరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవచ్చు. వ్యాపార సంబంధ అంశాలు, మెడికల్ ఎమర్జెన్సీ, పిల్ల చదువులు, పెళ్లి, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ప్రాపర్టీ లోన్ (లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ - LAP) తీసుకోవచ్చు. వివిధ బ్యాంకులు ప్రాపర్టీ పైన లోన్లు ఇస్తాయి. ప్రాపర్టీ పైన ఎక్కువ మొత్తంలో లోన్ వస్తుంది. అయితే ప్రతి నెల మీరు పొందే మొత్తంలో అరవై శాతం ఈఎంఐ చెల్లించేలా మాత్రమే ఈలోన్ ఇస్తారు.

గుడ్ న్యూస్: రిటైరింగ్ ప్రైవేటు ఉద్యోగులకు ఊరట, పెరగనున్న పెన్షన్గుడ్ న్యూస్: రిటైరింగ్ ప్రైవేటు ఉద్యోగులకు ఊరట, పెరగనున్న పెన్షన్

మీ బ్యాంక్ రికార్డ్స్ చెక్ చేస్తాయి

మీ బ్యాంక్ రికార్డ్స్ చెక్ చేస్తాయి

బ్యాంకులు మీకు లోన్ ఇచ్చేముందు మీబ్యాంక్ రికార్డ్సును చెక్ చేస్తుంది. పేమెంట్ ట్రాక్ రికార్డ్స్ చూస్తుంది. రీపేమెంట్ సామర్థ్యం కూడా తెలుసుకుంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే మీకు వచ్చే లోన్ అమౌంట్ తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు మీ ఆదాయం పైన ఎంతమంది మీ కుటుంబ సభ్యులు ఆధారపడి (డిపెండెంట్స్) ఉన్నారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాయి. ఎంత ఎక్కువ మంది మీపై ఆధారపడి ఉంటే అంత లోన్ అమౌంట్ తగ్గుతుంది.

లోన్ తీసుకునే సమయంలో వడ్డీ రేటు ఒక్కటే చూడకంటి

లోన్ తీసుకునే సమయంలో వడ్డీ రేటు ఒక్కటే చూడకంటి

పెద్ద మొత్తంలో తీసుకునే మీ రుణం కాలపరిమితిని ఎక్కువగా ఎంచుకోండి. ఇందుకోసం మీరు వివిధ బ్యాంకులను పరిశీలించి, ఆ తర్వాత ఏది బెట్టర్ అనిపిస్తే అందులో తీసుకోవడం మంచిది. కేవలం వడ్డీ రేట్లు మాత్రమే పోల్చి ముందుకు వెళ్లడం కంటే, మిగతా అంశాలను కూడా పరిశీలించడం మంచిదని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ప్రీపేమెంట్ ఛార్జీలు, ఫోర్‌క్లోజర్ ఛార్జీలు (జఫ్తు ఛార్జీ), ప్రాసెసింగ్ ఫీ, లేట్ పేమెంట్ పెనాల్టీ, లోన్ వ్యాల్యూ రేషియో వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి.

వివాదాస్పదమైతే తిరస్కరణ

వివాదాస్పదమైతే తిరస్కరణ

మీరు ఏ ప్రాపర్టీ పైన అయితే రుణం తీసుకుంటున్నారో.. ఆ ప్రాపర్టీ వివాదాస్పదమైనది అయితే మీ లోన్ రిక్వెస్ట్ తిరస్కరిస్తారు. ప్రాపర్టీ వివాదంలో ఉన్నా లేదా పత్రాలు సరిగా లేకపోయినా బ్యాంకులు లోన్ రిక్వెస్ట్‌ను అంగీకరించవు. ప్రాపర్టీ పైన ఇచ్చే రుణాలకు సంబంధించిన ప్రాసెస్ వేగంగా ఉంటుంది. అలాగే, కనీసం పదిహేనేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ రీపెమెంట్ ఆప్షన్స్, కనీస పదిహేనేళ్ల టెన్యూర్ ఉంటాయి. ప్రాపర్టీ ద్వారా ఇచ్చే రుణాల డాక్యుమెంటేషన్ చాలా సులభంగా ఉంటుంది.

ఎంత ప్రాపర్టీకి ఎంత లోన్ ఇస్తారంటే?

ఎంత ప్రాపర్టీకి ఎంత లోన్ ఇస్తారంటే?

లోన్ టు వ్యాల్యూ (ఎల్‌టీవీ).. అంటే ప్రాపర్టీ విలువను బట్టి ఆయా బ్యాంకులు లోన్ ఇస్తాయి. సాధారణంగా ఈ రేషియో మార్కెట్ వ్యాల్యూలో 50 నుంచి 60 శాతం ఉంటుంది. ఈ లోన్ రూ.5 లక్షల నుంచి రూ.500 కోట్ల వరకు ఇస్తారు. కాలపరిమితి 20 సంవత్సరాలు కూడా ఎంచుకోవచ్చు.

ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు

ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రాపర్టీ మీద ఇచ్చే లోన్‌కు ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. హోం లోన్‌కు రూ.2,00,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ప్రాపర్టీ పైన అలాంటి బెనిఫిట్స్ లేవు.

Read more about: loan property లోన్
English summary

ట్యాక్స్ బెనిఫిట్స్, లోన్ అమౌంట్..: ప్రాపర్టీ మీద లోన్ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి | 5 things to know before taking a loan against property

Various banks offer loan against properties, under which a relatively larger sum of money is offered when a property is used as collateral, than in other types of loans.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X