For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇకపై మీరు కూడా రూ.3 వడ్డీకి లోన్ ఇవ్వొచ్చు!

By Chanakya
|

రుణాలు పొందడం ఈ రోజుల్లో పెద్ద కష్టమైన పని కాదు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు లోన్లు ఇచ్చేందుకు క్యూకడ్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో పీర్2పీర్ లెండింగ్ అనే కొత్త కాన్సెప్ట్ మార్కెట్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్యాంకులే కాదు.. ఇకపై మీరు కూడా చిన్నా చితకా మొత్తాలను అప్పుగా ఇచ్చి వడ్డీ తీసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి వివిధ సంస్థలు.

<strong><br>పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి</strong>
పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి

లైసెన్స్ అక్కర్లేదు

లైసెన్స్ అక్కర్లేదు

తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా ఈ పీ2పీ లెండింగ్‌పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇది మరింతగా విస్తరించవచ్చని, మరిన్ని ఎక్కువ రుణాలు దీని ద్వారా పొందేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థలతో పాటు ఇండివిడ్యుయల్స్‌కు కూడా రుణాలు పొందడం సులువు కాబోతోందనేది ఆయన మాటల సారాంశం. ప్రస్తుతం పీ2పీ రుణాలిచ్చేందుకు 11 సంస్థలకు ఆర్బీఐ అనుమతులను ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దీనికి ఎన్.బి.ఎఫ్.సి లైసెన్స్ అవసరం లేదు కాబట్టి రుణాలు ఇచ్చేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చు. హైదరాబాద్‌లో కూర్చున్న మీరు బెంగళూరో, పూణెలో ఉన్న వ్యక్తికి రూ.20-30 వేలు కూడా రుణమిచ్చి వడ్డీని పొందొచ్చు. ప్రస్తుతం పీర్‌లెండ్, ఫెయిర్‌సెంట్, ఐ2ఐ ఫండింగ్, ఫింజీ, ఐలెండ్, మొనెక్సో, క్యాష్ కుమార్ వంటి సంస్థలు దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఎలా పనిచేస్తాయి

ఎలా పనిచేస్తాయి

ఇందులో రుణం పొందడానికి లేదా రుణం ఇవ్వడానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీరు మొదట భారతీయులై ఉండాలి. మీ పేరు, పుట్టిన తేదీ, ఊరు, ప్యాన్ కార్డ్, ఉద్యోగం సహా మరికొన్ని వివరాలను ఇచ్చి వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎంత మొత్తం లోన్ కావాలి, ఎందుకు కావాలి అనే సమాచారాన్ని అందులో ఉంచాలి. అంతేకాకుండా ఎంత వడ్డీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, ఎంత కాలంలోపు తీరుస్తారు అనే సమాచారాన్ని కూడా ఇవ్వాలి. మీ ఆఫర్‌ను ఎవరైనా ఓకే చేస్తే వాళ్లతో మీరు నేరుగా సంప్రదించి రుణాన్ని పొందొచ్చు.

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు

షార్ట్ టర్మ్ బిజినెస్ లోన్స్ నుంచి వ్యక్తిగత రుణాల వరకూ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అందుకే మన మన అవసరాలను బట్టి వడ్డీ రేట్లు మారతాయి. 9 నుంచి 36 శాతం వరకూ కొంత మంది వడ్డీని వసూలు చేస్తారు. రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకూ రుణాలను ఈ వేదిక ద్వారా పొందేందుకు అవకాశం ఉంది.

బ్యాంకులతో పోలిస్తే...

బ్యాంకులతో పోలిస్తే...

వాస్తవానికి అదో కొత్త కాన్సెప్ట్. రెగ్యులర్ ఎన్.బి.ఎఫ్.సిలతో పోలిస్తే ఇందులో వడ్డీ రేట్లు అధికంగానే ఉంటాయి. అయితే అవసరాన్ని ఇందులో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రుణం దొరకడం సులువుగా కావొచ్చేమో కానీ వడ్డీని మోయగలమా లేదా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వాయిదాలను సదరు వెబ్ సైట్ ద్వారానే చెల్లించాలి. నేరుగా రుణమిచ్చిన వారితో మాట్లాడే అవకాశం ఉండదు. ఒక వేళ డిఫాల్ట్ అయితే వెంటనే సదరు సమాచారాం సిబిల్‌కు చేరుతుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.

English summary

ఇకపై మీరు కూడా రూ.3 వడ్డీకి లోన్ ఇవ్వొచ్చు! | P2P lending concept is spreading in India

Now P2P lending concept is spreading in India, as RBI also plans to give more licences in the coming future. This concept is still new to us, but its growing very fast when compared with NBFCs.
Story first published: Sunday, April 7, 2019, 15:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X