ట్విస్ట్: టెక్నాలజీ వల్ల 4.5 కోట్ల ఉద్యోగాలు పోతాయి, 6.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయి

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా రానున్న ఆరేళ్లలో 4.5 ఉద్యోగాలు ఊడిపోనున్నాయని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ రిపోర్ట్ విడుదల చేసింది. అదే సమయంలో 6 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకు వస్తాయని చెప్పింది. డిజిటల్ టెక్నాలజీల ప్రభావంతో కోల్పోయే ఉద్యోగాల కంటే కొత్తగా పుట్టుకు వచ్చేవే అధికమని ఈ రిపోర్టు పేర్కొంది.

కొత్త టెక్నాలజీ కారణంగా 2025నాటికి ప్రపంచంలో నాలుగున్నర కోట్ల వరకు ఉద్యోగాలు స్థానభ్రంశం లేదా రూపాంతరం చెందనున్నాయని ఈ రిపోర్ట్ తెలిపింది. టెక్నాలజీ వల్ల ఇదే కాలానికి 6.5 కోట్ల కొత్త కొలువులు సృష్టించేందుకు దోహదపడనున్నాయని అంచనా వేసింది. ఉద్యోగాలు సమూల మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో 1-4.5 కోట్ల మంది సిబ్బందికి భవిష్యత్‌ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి, కొత్త విధులు అప్పగించడం ఎంతో అవసరమని ఈ రిపోర్టు పేర్కొంది.

Technology can kill 45 million jobs globally in the next 6 years: Report

వచ్చే ఆరేళ్లలో అంటే 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో ఐటీ, సాఫ్టువేర్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం), డిజిటల్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి కీలక డిజిటల్‌ రంగాల వాటా రెట్టింపు స్థాయి 435 బిలియన్ డాలర్లకు పెరగనుందని ఈ రిపోర్టు పేర్కొంది.

ముఖ్యంగా, ఇండియన్ టెక్కీల సామర్థ్యంపై దిగ్గజ ఐటీ కంపెనీల కోసం ఈ రిపోర్టు తయారు చేసినట్లు తెలిపింది. తద్వారా ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ అధ్యయనం తోడ్పడనుందని పేర్కొంది. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని ఎప్పటికి అప్పుడు అప్ డేట్ చేసుకోవాలని, లేదంటే ఉద్యోగాలు డేంజర్ జోన్‌లో పడినట్లేనని ఈ రిపోర్ట్ చెబుతోంది. ఇదిలా ఉండగా, గ్లోబల్ స్థాయిలో జీడీపీలో ఐటీ సాఫ్టువేర్ ఎగుమతుల విలువ 2025 నాటికి రూ.30 లక్షల కోట్లకు చేరనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+