For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?: నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

|

కోటీశ్వరుడిని కావాలని ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు? సరైన అంచనాతో పెట్టుబడులుపెడితే మంచి మొత్తం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే ఆ స్థాయిలో సంపాదించుకోవచ్చు. అలాగే, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టలేనివారు నెలసరి సేవింగ్స్ ద్వారా తమ కలను నెరవేర్చుకోవచ్చు. ఎక్కువ మొత్తం సంపాదించేందుకు మీరు ధనవంతులే కావాల్సిన అవసరం లేదు. కానీ రెగ్యులర్, సిస్టమేటిక్ పెట్టుబడుల ద్వారా లాంగ్ పీరియడ్‌లో మంచి లాభాలు పొందవచ్చు.

ప్రముఖ స్కీముల్లో నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఉదాహరణకు రికరింగ్ డిపాజిట్స్ (ఆర్డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్ (యూఎల్ఐపీ), మ్యుచువల్ ఫండ్స్(ఎంఫ్)లలో పెట్టుబడుల ద్వారా మంచి రిటర్న్స్‌కు అవకాశం ఉంటుంది.

రికరింగ్ డిపాజిట్స్

రికరింగ్ డిపాజిట్స్

ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (ఎఫ్‌డీ) లాగే రికరింగ్ డిపాజిట్స్ (ఆర్డీ) కూడా రిటైల్ ఇన్వెస్టర్లకు పాపులర్ స్కీం. ఎఫ్‌డీ, ఆర్డీలకు మధ్య తేడా ఏమంటే... ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం ఎఫ్‌డీ. నెలకు కొంత మొత్తం చెల్లించడం ద్వారా.. అంటే తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లవచ్చు. ఆర్డీని ఎంచుకునే చాలామంది నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు. మీరు బ్యాంకుల్లో లేదా పోస్ట్ ఆఫీసుల్లో ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఆర్డీ పైన వడ్డీ ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటుంది. ప్రస్తుతం అయిదేళ్లకు దాదాపు 7 శాతం ఉంది. మీరు నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 28 ఏళ్లకు కోటి రూపాయలు సంపాదించవచ్చు.

ఈ యాప్‌ను వాడుతున్నారా, జాగ్రత్త... మీ ఫోన్ వాళ్లే ఆపరేట్ చేస్తారు: హెచ్‌డీఎఫ్‌సి వార్నింగ్ఈ యాప్‌ను వాడుతున్నారా, జాగ్రత్త... మీ ఫోన్ వాళ్లే ఆపరేట్ చేస్తారు: హెచ్‌డీఎఫ్‌సి వార్నింగ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

ట్యాక్స్ సేవింగ్ కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చాలా పాపులర్. ఇది గ్యారెంటీ, భద్రతతో పాటు ఇది పూర్తి ట్యాక్స్ సేవింగ్ స్కీం. ఈ పీపీఎఫ్ అకౌంట్‌ను బ్యాంకులో లేదా పోస్టాఫీస్‌లో కానీ ఓపెన్ చేయవచ్చు. ఆర్డీ (రికరింగ్ డిపాజిట్స్) వలె కాకుండా పీపీఎఫ్ స్కీం వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఒకే వడ్డీ రేటు ఉంటుంది. క్వార్టర్లీ ఆధారంగా మన వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు 26 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది.

మ్యుచువల్ ఫండ్

మ్యుచువల్ ఫండ్

మ్యుచువల్ ఫండ్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌ను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఎఎంసీ కంపెనీలు వీటిని ఆఫర్ చేస్తాయి. మార్కెట్‌కు అనుగుణంగా ఇవి ఉంటాయి. షార్ట్ టర్మ్ మ్యుచువల్ ఫండ్స్ అయితే రిస్క్. లాంగ్ టర్మ్ అయితే మాత్రం మంచిదని భావిస్తారు. ఇందులో లాంగ్ టర్మ్ అయితే 12 శాతం వరకు వడ్డీ ఉంటుంది. నెలకు రూ.10వేలు చెల్లించడం ద్వారా 21 ఏళ్లలో రూ.కోటి రిటర్న్స్‌గా పొందవచ్చు.

 యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్

యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్

యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్‌లో కూడా నెలకు 10వేలు ఇన్వెస్ట్ చేస్తూ 23 ఏళ్లలో కోటి రూపాయలు కూడబెట్టవచ్చు. ఇక్కడ ఓ విషయం. మీ సంపాదన ఆధారంగా, లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టాలి. ఇవి లాంగ్ టర్మ్ ప్రక్రియలు.

English summary

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?: నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన! | PPF Vs RD Vs ULIP Vs MF: How long will it take you to become a crorepati by investing Rs 10,000 per month?

Who doesn’t want to be a crorepati in this world? In fact, everybody would like to accumulate a crore of rupees as soon as possible by investing as much as one can. However, for retail investors, who don’t have a big amount for lump sum investments, becoming a crorepati by monthly savings is always like a big dream.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X