For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్, ఐసిఐసిఐ సపోర్ట్‌తో భారీ లాభాలు! నష్టాలన్నీ రికవరీ

By Chanakya
|

ముంబై: మూడు రోజుల నష్టాలు.. గంట సేపట్లో రికవర్ అయిపోయాయి. అదీ స్టాక్ మార్కెట్ అంటే. ఎవరి అంచనాలకూ అందకుండా దలాల్ స్ట్రీట్ సూచీలు ఈ రోజు ఎగిరి గంతేశాయి. సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్లు లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మద్దతు మార్కెట్లకు బాగా కలిసొచ్చింది. ఒక్క ఐటి మినహా అన్ని రంగాల షేర్లూ లాభాల్లో ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కూడా అదే ఉత్సాహం నమోదైంది. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడి.. ఆ నష్టాలన్నీ దాదాపుగా రికవర్ కావడం ఈ రోజు ప్రధానాంశం. చివరకు సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 38233 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 11483 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 601 పాయింట్లు పెరిగి 29882 దగ్గర స్థిరపడింది.

రిలయన్స్ ఈజ్ కింగ్

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ దుమ్ముదులిపేసింది. హెవీ వెయిట్ స్టాక్ అయిన రిలయన్స్ ఈ రోజు వాల్యూమ్స్‌తో సహా 3.23 శాతం పెరిగి రూ.1367 దగ్గర క్లోజైంది. హెవీ వెయిట్ స్టాక్ కావడంతో ఒంటి చేత్తో ఇదే మార్కెట్ రన్‌ను లీడ్ చేసింది.

ఎన్టీపీసీ, రిలయన్స్, ఎస్బీఐ, వేదాంత, బజాజ్ ఫైనాన్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. టెక్ మహీంద్రా, ఇండియన్ ఆయిల్ కార్ప్, యూపీఎల్, ఇన్ఫోసిస్, విప్రో స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

బ్యాంక్స్ సపోర్ట్

బ్యాంకింగ్ స్టాక్స్ జోరు కొనసాగుతూనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఏకంగా 600 పాయింట్లు పెరిగి గరిష్ట స్థాయిల దగ్గర క్లోజైంది. ఇండెక్స్‌లో ఉన్న మొత్తం 12 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. దీంతో పాటు ఎస్బీఐ 3.7 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.3 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ - యెస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 3 శాతం వరకూ పెరిగాయి. ఐసిఐసిఐ బ్యాంక్... కూడా నిఫ్టీలో హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్ కావడం కలిసొచ్చింది.

లాభాల్లో మార్కెట్లు, పుంజుకుంటున్న రూపాయిలాభాల్లో మార్కెట్లు, పుంజుకుంటున్న రూపాయి

 Closing bell: Sensex jumps 424 pts, Nifty ends tad below 11,500; RIL, banks lead

జీఎంఆర్..జూమ్..

జీఎంఆర్ ఇన్ఫ్రా చాలా ఏళ్ల తర్వాత ఒకే రోజు భారీగా పెరిగింది. ఇంతకాలం ఒక టైట్ రేంజ్ అయిన రూ.16-17 మధ్య ఇరుక్కుపోయిన స్టాక్‌లో ప్రైస్ - వాల్యూమ్ బ్రేకవుట్ లాంటింది వచ్చింది. స్టాక్ ఏకంగా 16 శాతం వరకూ పెరిగింది. చివరకు 14 శాతం లాభంతో రూ.19.45 దగ్గర క్లోజైంది.

అనిల్ గ్రూప్ స్టాక్స్ పరుగు

అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్‌లో కూడా కొద్దిగా పాజిటివ్ యాక్టివిటీ నమోదైంది. ముఖ్యంగా రిలయన్స్ క్యాపిటల్ 8 శాతం లాభపడింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ 3 శాతం, రిలయన్స్ పవర్, రిలయన్స్ నావెల్ కూడా 2 శాతం వరకూ పెరిగాయి.

జెట్ స్పీడ్‌తో షేర్

జెట్ ఎయిర్‌వేస్‌ నుంచి ప్రమోటర్లు అయిన నరేష్ గోయల్, అనితా గోయల్ తప్పుకోవడం కొద్దిగా రుణదాతలకు ఊరటనిచ్చింది. తాజాగా రూ.1500 కోట్ల నిధులు సమకూరడంతో స్టాక్ జూమ్ అంటూ దూసుకుపోతోంది. ఈ రోజు కూడా 7 శాతం వరకూ పెరిగిన స్టాక్ రూ.271 దగ్గర క్లోజైంది.

ఐటీ స్టాక్స్ దిగాలు

రూపాయి నీరసించడంతో పాటు ఐటీ స్టాక్స్ ఈ రోజు దిగాలుపడ్డాయి. సెక్టోరల్ ఇండిసెస్‌లో ఇదొక్కటే నష్టపోయింది. టెక్ మహీంద్రా 2.5 శాతం వరకూ నష్టపోతే, ఇన్ఫోసిస్, విప్రో వంటి స్టాక్స్ 1 శాతం కోల్పోయాయి.

కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్

ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన కొన్ని స్టాక్స్‌లో లాభాల స్వీకరణ నమోదైంది. వాటిల్లో స్పైస్ జెట్ 3.5 శాతం, అవంతీ ఫీడ్స్ 2 శాతం కోల్పోయాయి. స్మాల్ క్యాప్ స్పేస్‌లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5 శాతం, థైరోకేర్, సాగర్ సిమెంట్స్ 3 శాతం వరకూ నష్టపోయాయి.

English summary

రిలయన్స్, ఐసిఐసిఐ సపోర్ట్‌తో భారీ లాభాలు! నష్టాలన్నీ రికవరీ | Closing bell: Sensex jumps 424 pts, Nifty ends tad below 11,500; RIL, banks lead

Late hour buying and support from heavy weight stocks like reliance and icici boosted market gains. Three days of losses are recovered with one day gains. Especially bank nifty closed with record gains after moving 600 points up.
Story first published: Tuesday, March 26, 2019, 16:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X