For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయ్ మాల్యాకు షాక్: బెంగళూరు ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు

|

ఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, ఢిల్లీ కోర్టు శనివారం నాడు బెంగళూరు ఆస్తులపై మాల్యాకు గట్టి షాకిచ్చింది. మాల్యాకు బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఎస్‌బీఐ హాలీడే సేవింగ్స్ అకౌంట్‌తో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చుఎస్‌బీఐ హాలీడే సేవింగ్స్ అకౌంట్‌తో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు

ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసుకు సంబంధించి చీఫ్‌ మెట్రోపొలిటన్‌ మేజిస్ట్రేట్‌ దీపక్‌ షెరావత్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. జులై 10వ (2019) తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు కోర్టుకు తెలియజేశారు.

Attach Vijay Mallyas Bengaluru properties in 3 months, Delhi court

విజయ్ మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా కోర్టు పేర్కొంది. ఫెరా చట్టం కింద జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నది. మాల్యాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉంది.

English summary

విజయ్ మాల్యాకు షాక్: బెంగళూరు ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు | Attach Vijay Mallya's Bengaluru properties in 3 months, Delhi court

Properties in Bengaluru belonging to Vijay Mallya have been ordered to be attached. A court in Delhi ordered the Bengaluru Police to attach the properties in connection with a case pertaining to violation of FERA rules. FERA stands for Foreign Exchange Regulation Act.
Story first published: Sunday, March 24, 2019, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X