For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ లేబుల్ ఏటీఎంలలో డబ్బులు తీసుకుంటే ఎంత ఛార్జ్?

By Chanakya
|

వైట్ లేబుల్ ఏటీఎం. జనాల్లో చాలా తక్కువ మందికి మాత్రమే వీటి గురించి తెలుసు. ఇవి ఏంటంటే.. ప్రైవేట్ ఏటీఎం అని అర్థం. బ్యాంకులతో సంబంధం లేకుండా వీటిని ఏర్పాటు చేస్తారు. చాలా నగరాల్లో ఇప్పుడు ఇవి విరివిగా కనిపిస్తున్నాయి. ఏటీఎం అని మాత్రమే వాటిపై స్పష్టంగా రాసి ఉంటుంది.. ఇవి తెలియకుండా లోపలికి వెళ్తే కొద్దిగా అధికంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలు పూర్తిగా తెలుసుకోండి. మార్చి 7న ఆర్బీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనల నేపధ్యంలో వీటిపై ఓ సారి దృష్టి సారించండి.

ఆసియాలో వరస్ట్ నుంచి బెస్ట్ కరెన్సీ: రూపాయి బలపడటానికి కారణమఆసియాలో వరస్ట్ నుంచి బెస్ట్ కరెన్సీ: రూపాయి బలపడటానికి కారణమ

వైట్ లేబుల్ ఏటీఎం

వైట్ లేబుల్ ఏటీఎం

ఆర్బీఐకి చెందిన పేమెంట్ అంట్ సెటిల్మెంట్ యాక్ట్ 2007ని ఆధారం చేసుకుని ఈ ప్రైవేట్ లేబుల్ ఏటీఎమ్స్ పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం 8 సంస్థలు వీటిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. సాధారణంగా కొన్ని బ్యాంకులకు కొన్ని ప్రాంతాల్లో పెద్దగా ప్రాతినిధ్యం ఉండదు. ఇంకొన్ని చోట్ల పెద్దగా జనావాసం లేకపోయినా ఏటీఎంలు ఏర్పాటు చేస్తే ఖర్చు ఎక్కువవుతుంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం బ్యాంకులు తమ శాఖలకు తగ్గట్టు నిర్దిష్ట సంఖ్యలో ఇన్ని ఏటీఎంలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని గ్రామీణ ప్రాంతాల్లోనూ లేకపోతే పెద్దగా అవసరం లేని చోట్లో పెడితే ప్రయోజనం పెద్దగా ఉండదు. అందుకే ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ప్లేయర్స్‌కు ఏటీఎం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఆర్బీఐ.

వీటిల్లో ఛార్జీలు ఉంటాయా?

వీటిల్లో ఛార్జీలు ఉంటాయా?

మనకు బ్యాంకులు సాధారణంగా సిటీ ప్రాంతాల్లో మూడు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ట్రాన్సాక్షన్స్ వరకూ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయవు. ఈ ప్రైవేట్ ఏటీఎంలలో కూడా అదే వర్తిస్తుంది. ఒక వేళ మన ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌లో భాగంగా ఇక్కడ నగదు తీసుకుంటే మనకు ఎలాంటి ఛార్జీలూ పడవు. ఆ పరిధి దాటితే బ్యాంకులు మన తరపున వీళ్లకు రూ.20 చెల్లించాలి. దాన్ని మన నుంచి వసూలు చేసే ప్రమాదం ఉంటుంది కాబ్టటి ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత వైట్ లేబుల్ ఏటీఎంల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఒక వేళ ఫ్రీ అవకాశం ఉంటే మాత్రం వీటికీ.. సాధారణ ఏటీఎంలకు పెద్దగా తేడా ఉండదు. మీరు నిరభ్యంతరంగా వీటిని ఉపయోగించుకోవచ్చు.

ఆర్బీఐ కొత్త నిబంధనలు

ఆర్బీఐ కొత్త నిబంధనలు

ఆర్బీఐ తాజాగా మార్చి మొదటి వారంలో వైట్ లేబుల్ ఏటీఎంల నిర్వాహణా నిబంధనలు మార్చింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాటి మనుగడ కష్టసాధ్యమైంది. ఉచితంగా వీటిని జనాలు వాడుకోవడం వల్ల ఆదాయం రాకపోగా, నష్టాలను చవిచూస్తున్నాయి. అందుకే క్యాష్ డిపాజిట్లను స్వీకరించడంతో పాటు బిల్ పేమెంట్లకు కూడా ఏటీఎంలను వినియోగించుకోవచ్చని ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. దీంతో ఇకపై ఈ ప్రైవేట్ ఏటీఎంలలో జనాలు డిపాజిట్ సౌకర్యాన్నీ వినియోగించుకోవచ్చు. వీటికి అదనంగా థర్జ్ పార్టీ యాడ్స్‌ను కూడా ఏటీఎంలలో పెట్టుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతులిచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే వైట్ లేబుల్ ఏటీఎంలను నిరభ్యంతరంగా ఫ్రీ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకోవచ్చు. అదనపు లావాదేవీ జరిపితే మాత్రం రెగ్యులర్‌గా బ్యాంక్ ఛార్జ్ చేసే దానికంటే కొద్ది అధికంగానే మీకు డబ్బులు కట్ కావొచ్చు. ఎందుకంటే ఏటీఎం ఇంటర్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ కింద బ్యాంకులు ఒక్కో లావాదేవీకి వీళ్లకు రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. మీరు క్యాష్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా దానికి రూ.5 చెల్లించాలి. అందుకే సాధ్యమైనంత వరకూ ఫ్రీ ట్రాన్సాక్షన్‌లో భాగంగా క్యాష్ తీసుకోవడానికి మాత్రమే వీటిని ఉపయోగించుకోండి.

Read more about: transactions atm ఏటీఎం
English summary

వైట్ లేబుల్ ఏటీఎంలలో డబ్బులు తీసుకుంటే ఎంత ఛార్జ్? | Things to keep in mind when carrying out transactions through white label ATMs

White Label ATM is series of ATMS established under Payments & Settlements Act of 2007. These White Label ATMs do not come directly under Banking regulation.
Story first published: Thursday, March 21, 2019, 12:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X