For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో జెఫ్, బిల్‌గేట్స్: మరెంతో కాలం అదృష్టం లేకపోవచ్చు.. కారణాలివే?

|

వాషింగ్టన్: బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం 2,800 బిలియనీర్లు ఉన్నారు. ఇందులో 145 మందికి 10 బిలియన్ డాలర్లు కలిగిన సంపన్నులు ఉన్నారు. అయితే ప్రపంచంలో 100 బిలియన్ డాలర్లు కలిగిన వారు మాత్రం ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు అమెజాన్ డాట్ కామ్ ఐఎన్‌సీకు చెందిన జెఫ్ బిజోస్. రెండోవారు మైక్రోసాఫ్ట్ కార్ప్ కో ఫౌండర్ బిల్ గేట్స్.

 బిలియనీర్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడే లీక్ చేశాడు, కాపురంలో చిచ్చు బిలియనీర్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడే లీక్ చేశాడు, కాపురంలో చిచ్చు

ఈ ఏడాది బిల్ గేట్స్‌ సంపాదన 100 బిలియన్‌ డాలర్లు దాటిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. జెఫ్‌ బెజోస్‌ సంపద 145.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ ఒక్క ఏడాదే బెజోస్‌ సంపద 20.7 బిలియన్‌ డాలర్లు పెరిగింది. బిల్ గేట్స్‌ ఆస్తులు 9.5 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. బిల్‌గేట్స్‌ 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటడం ఇది మొదటిసారేం కాదు. 1999లో బిల్ గేట్స్‌ ఆస్తులు 100 బిలియన్‌ డాలర్లు చేరుకున్నాయి. కానీ ఆయన తన సంపదలో కొంత గేట్స్‌ ఫౌండేషన్‌కు ఇవ్వడంతో ఆయన నెట్ వర్త్‌ తగ్గింది.

Bill Gates joins Jeff Bezos as the only two members of the $100 billion club

బిల్ గేట్స్ తర్వాత వంద మిలియిన్ డాలర్ల క్లబ్‌లో చేరిన వ్యక్తి జెఫ్ బెజోస్‌. అమెజాన్‌ అమ్మకాలతో బెజోస్‌ అతితక్కువ సమయంలో అత్యంత అరుదైన ఈ క్లబ్‌లో చేరారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అయితే గేట్స్‌ ఫౌండేషన్‌ కోసం ఇప్పటికే బిల్‌గేట్స్ 35 బిలియన్‌ డాలర్లకు పైగా విరాళమిచ్చారు. తన సంపదలో సగాన్ని ఈ ఫౌండేషన్‌కు ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన ఆస్తులు తగ్గే అవకాశముంది.

మరోవైపు, జెఫ్ బెజోస్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నారు. భరణం కింద ఆయన ఆస్తుల్లో కొంత భార్యకు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈయన ఆస్తులు కూడా తగ్గే అవకాశముందని పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన బిలియనీర్ అర్నాల్ట్ 86.2 బిలియన్లు కలిగి ఉన్నాడు. ఆ దేశ ఎకానమీతో పోల్చుకుంటే 3 శాతానికి ఎక్కువ సంపాదన అతని వద్దే ఉంది. స్పెయిన్‌కు చెందిన అమాన్సియో ఓర్టేగా వద్ద ఆ దేశ జీడీపీతో పోల్చుకుంటే 5 శాతం ఉంది. జార్జియా దేశానికి చెందిన బిడ్జినా ఇవానిష్‌విలి వద్ద ఆ దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో మూడోవంతు.

English summary

100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో జెఫ్, బిల్‌గేట్స్: మరెంతో కాలం అదృష్టం లేకపోవచ్చు.. కారణాలివే? | Bill Gates joins Jeff Bezos as the only two members of the $100 billion club

Bloomberg tracks the fortunes of some 2,800 billionaires. Of those, 145 are worth at least $10 billion, making them decabillionaires. Now, the world contains two centibillionaires simultaneously.
Story first published: Wednesday, March 20, 2019, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X