For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ 1 తేదీలోగా ఇవి మారిపోతున్నాయి, మరిచిపోకండి!

|

న్యూఢిల్లీ: ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని అంశాలను గుర్తుకు ఉంచుకోవాల్సి ఉంది. ఆదాయపన్ను రిటర్న్స్‌ కోసం ఆధార్, పాన్ లింకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం మారితే ఈపీఎఫ్‌ను కూడా సులభతరం చేసింది. ఏప్రిల్ 1వ తేదీలోపు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు...

మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుపడిందా?మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుపడిందా?

ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు

ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు

పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాలంటే తమ ఆధార్, పాన్‌కార్డులను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సిందేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది. మార్చి 31వ తేదీలోగా ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పేర్కొంది. ఆధార్, పాన్‌కార్డ్ అనుసంధానం తప్పనిసరి అని సుప్రీం కోర్టు కూడా చెప్పింది. ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధాయపన్ను రిటర్నులకు ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి అని ఫిబ్రవరి 6వ తేదీన తీర్పు ఇచ్చింది. మార్చి 31, 2019లోపు దీనిని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు మీ ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ పని చేయదు. అయితే బ్యాంక్ ఖాతాలకు, మొబైల్ ఫోన్లకు, పాఠశాల దరఖాస్తులకు ఆధార్ అవసరం లేదని తెలిపింది. కేంద్రం జారీ చేసిన పాన్ కార్డుల్లో నకిలీవి కూడా ఉన్నాయి. ఒకరికి రెండు మూడు పాన్ కార్డులు కూడా ఉన్నాయి. అందుకే పాన్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే నకిలీ కార్డులు బయటపడతాయి.

మ్యుచువల్ ఫండ్స్, డీమ్యాట్

మ్యుచువల్ ఫండ్స్, డీమ్యాట్

మ్యుచువల్ ఫండ్స్‌లో టీఈఆర్ (టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో) ఛార్జ్‌ను 2020 ఆర్థిక సంవత్సరం నుంచి మార్చనున్నారు. ఈక్విటీ పథకాలు కాకుండా, ఇతర స్కీంలకు 1% టీఈఆర్ ఉండనుంది. సమీపంలో ముగిసే స్కీంలకు 2.25 శాతం ఉండనుంది. అలాగే, భౌతికరూపంలోని షేర్లు ఏప్రిల్ 1వ తేదీలోగా డీమెటిరియలైజ్ చేయాలి. డీమ్యాట్ షేర్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

హౌసింగ్, జీఎస్టీ

హౌసింగ్, జీఎస్టీ

ఏప్రిల్ 1వ తేదీ నుంచి హౌసింగ్ రంగంలో వడ్డీ రేటు 1 శాతానికి తగ్గనుంది. కొన్ని కేటగిరీలకు 5 శాతం వరకు ఉంది. ప్రస్తుతం ఈ కేటగిరీలు 8 శాతం, 12 శాతంగా ఉన్నాయి. కానీ ఇటీవల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది.

ఉద్యోగం మారితే ఈపీఎఫ్ అప్లికేషన్ అవసరం లేదుఈపీఎఫ్ విషయంలోను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక నుంచి ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ట్రాన్సుఫర్ కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరైనా ఉద్యోగం మారితే వారికి సులువు కానుంది. వారు ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు.

ఉద్యోగం మారితే ఈపీఎఫ్ అప్లికేషన్ అవసరం లేదుఈపీఎఫ్ విషయంలోను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక నుంచి ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ట్రాన్సుఫర్ కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరైనా ఉద్యోగం మారితే వారికి సులువు కానుంది. వారు ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు.

ఈపీఎఫ్ విషయంలోను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక నుంచి ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ట్రాన్సుఫర్ కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరైనా ఉద్యోగం మారితే వారికి సులువు కానుంది. వారు ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు.

English summary

ఏప్రిల్ 1 తేదీలోగా ఇవి మారిపోతున్నాయి, మరిచిపోకండి! | What Changes From April 1. 2019? Here's List

From the new financial year that starts on April 1, 2019, there are a host of changes that will come into effect. Here is a complete list to prepare yourself for such changes in advance.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X