బోయింగ్ విమానల ప్రమాదంతో ఆ సంస్థకు లక్షల కోట్ల నష్టం రానుంది..మరోవైపు పలు విమానాల రద్దుతో ఆ సంస్థ ఆర్ధిక కష్టాల్లో నెట్టివేయబడనుంది..దీంతోపాటు విమానరంగంలో కోంత సంక్షోభం కూడ రానుంది..దీంతో విమాన ప్రయాణ చార్జీలు సైతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇథియోపియా ఎఫెక్ట్,
బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలకు దెబ్బమీద దెబ్బ పడుతోంది..ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ తోపాటు ఇండోనేషియాకు చెందిన రెండు విమాన ప్రమాదాల తర్వాత పలు దేశాలు వీటి వాడకం పై ఆలోచనలో పడ్డాయి..కోద్ది రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరగడంతో వెంటనే అప్రమత్తమైన ఆమేరికా,ఇండియా, చైనా తో సహ పలు దేశాల్లో ఉన్న బోయింగ్ విమానాలను రద్దు చేశాయి..ప్రపంచ వ్యాప్తంగా 350 బోయింగ్ విమానాలు సర్వీసును అందిస్తుండంగా దాదాపు అన్ని విమానాలు నేలకు దిగుతున్నాయి..దీంతో వ్యాపారపరంగా దెబ్బతింది..దీనికి తోడు ఈ విమానాలకై అర్డర్లు పెట్టిన పలు దేశాలు వాటిని వెనక్కి తీసుకుంటున్నాయి..తాజాగా ఇండోనేషియా ,రష్యా తోపాటు సౌదీ అరేబియా దేశాలు తమ ఆర్డర్లను రద్దు చేసుకున్నాయి..అయితే బోయింగ్ సంస్థ 2018 లొ నే సుమారు800 ఎయిర్ క్రాఫ్ట్ లకోసం 60 బిలియన్ డాలర్ల సుమారు వివిధ దేశాల ఆర్డలు ఉన్నాయి.. అయితే ఇవన్ని కూడ రద్దయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి..మొత్తం మీద అత్యాధునికమైన ఎయిర్ క్రాఫ్ట్ లు నేల కూలడంతో బోయింగ్ కు 50 లక్షల కోట్లకు పైగా వ్యాపారం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని విశ్లేశకులు చెబుతున్నారు..

దిద్దుబాటు చర్యల్లో బోయింగ్
తన వ్యాపారం కదిలిపోతుండటంతో బోయింగ్ కూడా యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పదిరోజుల్లో 737మాక్స్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మరికొన్ని వారాల్లో అప్‌గ్రేడ్‌చేసిన సాఫ్ట్‌వేర్‌తో బోయింగ్ 737మాక్స్‌లు గాల్లోకి ఎగురుతాయని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ సిద్ధమైతే వేగంగా అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో కూడ ఉంది.

పెరగనున్న విమాన ప్రయాణ చార్జీలు
ప్రపంచవ్వాప్తంగా బోయింగ్ విమానాలు దిగుతుండడంతో పాటు జెట్ సంక్షోభం ,పైలట్ల కొరత తోపాటు , సమ్మర్ హలిడెస్ కావడంతో ఇతర దేశాలకు తమ పిల్లలతో కలిసి వెళతారు.. మరియు టూరిజం లో భాగంగా ప్రయాణాలు కూడ అధికం కావడం లాంటి పరిణామాలు విమాన ప్రయాణ టికెట్ల రేట్లు కనీసం 20 శాతం పెరిగేందుకు అవకాశం ఉన్నాయని చెబుతున్నారు..
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications