For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీదేశాల్లో సైతం మా ఇంటి రుచులే కావాలి

|

విదేశీ టూర్లకు వెళుతున్న భారతీయులు ఎక్కువగా టాయిలెట్ పేపరుతో ఇబ్బందిపడుతున్నామంటూ దాదాపు 50 శాతం మంది ఆన్ లైన్ సర్వేలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు..ఇక 60 శాతం మంది ఎక్కువగా ఇష్టపడేది మాత్రం స్వదేశీ ఫూడ్ అంటూ ఓ ఆన్ లైన్ సర్వేలో వెల్లడైంది...కాగా భారతీయులు అభిప్రాయాలు ,అభిరుచులను తెలుసుకునేందుకు ఈ సర్వే ప్రయత్నాలు చేసింది..

మేక్ మైట్రిప్ ఆన్ లైన్ లో సర్వే

మేక్ మైట్రిప్ ఆన్ లైన్ లో సర్వే

ప్రస్థుత రోజుల్లో విదేశీటూర్లు వెళ్లడం పెరిగిపోతుంది. దీంతో టూరిైస్టులపై పలు అంశాలను వెలువరించింది ఓ ఆన్ లైన్ సర్వే సంస్థ. ప్రధానంగా విదేశాలకు వెళుతున్న భారతీయులు ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నారు..వాళ్లు ఇష్టపడని వస్తువులు ఎమైన ఉన్నాయా, వారు ఏఏ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారనే అంశాలపై మేక్ మెట్రీస్ అనే సంస్థ ఆన్ లైన్ లో సర్వే జరిపింది..ఈ సర్వేలో భారతీయ టూరిస్టులకు సంబంధించిన పలు అంశాలను వెల్లడించింది..

టాయిలెట్ పేపరు పై అసంతృప్తి

టాయిలెట్ పేపరు పై అసంతృప్తి

మేక్ మైట్రిప్ జరిపిన ఆన్ లైన్ సర్వేలో ప్రధానంగా భారతీయులు ఎక్కువగా విదేశాల్లో నీళ్లకు బదులుగా టాయిలెట్ పేపరును వాడడంపై చాలమంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపింది..సర్వేలో పాల్గోన్న వారిలో దాదాపు 52 శాతం మంది ఈ విధానంపై అయిష్టంగా ఉన్నారని తెలిపింది.అనంతరం భారతీయ భోజనం లభ్యం కాకపోవడంపై కూడ వీరు ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్టు తెలిపారు...

భారత్ వస్తువులే విదేశాల్లో కొన్నట్టు బిల్డప్

భారత్ వస్తువులే విదేశాల్లో కొన్నట్టు బిల్డప్

విదేశాలకు వెళ్లినవారు తమ బంధువులకు లేదా, ఇతర మిత్రులకు పలు బహుమానాలు తెస్తుంటారు..అయితే వీటీని భారత్ లోనే కొనుగోలు చేసి, విదేశాల్లో కొంటున్నట్టు చెబుతున్నారని తేల్చింది..ఇక విదేశాలనుండి తీసుకువస్తున్న వాటిలో 49 శాతం మంది చాక్లెట్లను కొనుగోలు చేస్తుండగా , సుమారు 18 శాతం మంది టూరిస్టులు బట్టలు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నారని తెలిపింది.

మేం పోతున్నం...సోషల్ మీడియాలో పోస్టులు..

మేం పోతున్నం...సోషల్ మీడియాలో పోస్టులు..

అసలే విదేశీ ప్రయాణం ఆపైన స్టేటస్ కు సంబంధించిన అంశం కావడంతో విదేశాలకు పోయో వారు ఎయిర్ పోర్టుల్లోను విదేశాల్లోనే తీసుకున్న పిక్ లు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు..దీంతో పాటు ఈ అంశం అందరికి తెలిసేలా పలు అంశాలు పంచుకుంటున్నారు...

భారతీయ బోజనానికి డిమాండ్

భారతీయ బోజనానికి డిమాండ్

ప్రధానంగా విదేశాలకు పోయో భారతీయులు అక్కడ సైతం 60 శాతం మంది స్వదేశీ భోజనాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారంటూ సర్వే నివేదిక వెళ్లడించింది..ఇక ఖర్చులు కూడ విపరీతంగానే పెడుతున్నారని తెలిపింది. .టూరిజం అంటేనే ఖర్చు తో కూడుకున్న ప్రయాణం దీంతో భారతీయులు ఖర్చుకు వెనకాడకుండా మూడోవంతు స్టార్ హోటల్స్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరికొంతమంది మాత్రం సిటి మధ్యలోనే ఉండడానికి తమ ఓటు వేశారు...దీంతో ప్రతి రోజుల పదివేల నుండి 50 వేల వరకు ఖర్చు పెడుతున్నరని సర్వే పేర్కోంది.

English summary

వీదేశాల్లో సైతం మా ఇంటి రుచులే కావాలి | 60 percent travellers more comfortable with Indian food on international trip

With rise in the number of outbound travellers, a survey has revealed that 60 percent are more comfortable with Indian food during their international trip. Toilet paper instead of water in the toilets (52 percent) is the most irritating thing for Indians travelling abroad
Story first published: Sunday, March 17, 2019, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X