For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్, స్వల్ప నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్

By Chanakya
|

స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలతో ఈ వారాంతం కాస్త బలహీనపడింది. ఉదయం స్థిరంగానే మొదలైన సూచీలు ఆ తర్వాత ఆద్యంతం లాభనష్టాల మధ్య దోబూచులాడాయి. చివరకు 11 వేల పాయింట్లపైనే నిఫ్టీ ముగియడం పాజిటివ్ సెంటిమెంట్‌ను నిలిపే ఉంచింది. చివరకు 23 పాయింట్ల నష్టంతో 11035 దగ్గర నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ 54 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ కేవలం 3 పాయింట్లు నష్టపోయాయి.

ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, గెయిల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. టాాట మోటార్స్, విప్రో, టాటా స్టీల్, హిందాల్కో, హెచ్ ఎల్ టెక్ షేర్లు లూజర్స్ జాబితాలో ఉన్నాయి.

అన్ని రంగాలూ నష్టాల్లోనే

అన్ని రంగాలూ నష్టాల్లోనే

ఐటీ, మీడియా, మెటల్ రంగ షేర్లన్నీ నష్టాల బాట పట్టాయి. రియాల్టీ, ఫిన్ సర్వ్, ఎఫ్ఎంసిజి రంగాల్లో కొన్ని స్టాక్స్ మాత్రమే లాభాల్లో ట్రేడయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా ఈ రోజు నీరసంగానే ఉన్నాయి.

మొత్తానికి ఈ వారంతం నష్టాల్లో ముగిసినా వారం పరంగా చూస్తే లాభాలనే ఇచ్చాయి సూచీలు. గతేడాది నవంబర్ తర్వాత మళ్లీ ఇప్పుడే మార్కెట్లు వీక్లీ గెయిన్స్‌ను నమోదు చేశాయి.

అడ్వాన్స్ ఎంజైమ్ - 3 నెలల తర్వాత

అడ్వాన్స్ ఎంజైమ్ - 3 నెలల తర్వాత

అడ్వాన్స్డ్ ఎంజైమ్ స్టాక్ లైమ్‌లైట్‌లో ఉండి సుమారు 3 నెలలు దాటిపోయింది. తరచూ 52 వారాల కనిష్టానికి పడిపోతూ ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షించిన షేర్ ఈ రోజు అనూహ్యంగా బ్రేకవుట్ ఇచ్చింది. స్టాక్ ఏకంగా 19 శాతం వరకూ పెరిగి రూ. 196 దాకా వెళ్లింది. చివరకు 17 శాతం లాభాలతో రూ. 191 వద్ద క్లోజైంది. 20 రోజుల యావరేజ్ వాల్యూమ్స్‌తో పోలిస్తే ఏకంగా 250 రెట్లు అధికంగా ఇందులో వాల్యూమ్స్ బిల్డ్ అయ్యాయి. ఈక్విటీలో సుమారు 9 శాతం షేర్లు ఈ ఒక్క రోజే చేతులు మారాయి. కారణం ఇంకా తెలియకపోయినప్పటికీ ఈ స్టాక్‌లో యాక్టివిటీ కొనసాగుతోంది.

విప్రో 5 శాతం పడింది

విప్రో 5 శాతం పడింది

అజీం ప్రేమ్‌జీ ట్రస్ట్ సుమారు 1.78 కోట్ల షేర్లను ఈ రోజు బ్లాక్ డీల్ ద్వారా అమ్మింది. నిన్నటి సిఎంపితో పోలిస్తే 4 శాతం తక్కువకు బ్లాక్ డీల్ పూర్తి కావడంతో విప్రో స్టాక్ ఈ రోజు కూడా పడింది. ప్రమోటర్ దగ్గర ఉన్న 74.3 శాతం వాటాలో ఇప్పుడు ట్రస్ట్ కింద అమ్ముతోంది కేవలం 0.29 శాతం మాత్రమే.

దీంతో ఈ స్టాక్ 4.58 శాతం పతనమై రూ.256.50 దగ్గర క్లోజైంది.

అర్వింద్ ఫ్యాషన్స్ లిస్టింగ్

అర్వింద్ ఫ్యాషన్స్ లిస్టింగ్

అర్వింద్ లిమిటెడ్ డీమెర్జర్‌లో భాగంగా ఈ రోజు అర్వింద్ ఫ్యాషన్స్ లిస్ట్ అయింది. యూఎస్ పోలో, యారో, టామీ హిల్ ఫిగర్, సీకె వంటి వివిధ బ్రాండ్లకు లైసెన్సింగ్ అగ్రిమెంట్లను కుదుర్చుకున్న ఈ మధ్య కొద్దిగా అగ్రెసివ్‌గా ఉంది. రూ. 590 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ రూ.621 దగ్గర క్లోజైంది.

7 నెలల గరిష్టానికి కెఎన్ఆర్

7 నెలల గరిష్టానికి కెఎన్ఆర్

హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ సంస్థ కెఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ స్టాక్ వరుస లాభాలతో పరుగులు తీస్తోంది. తాజాగా కర్నాటక నుంచి రూ. 135 కోట్లతో పాటు రు.920 కోట్ల విలువైన హ్యామ్ ప్రాజెక్టులను చేజిక్కించుకుంది. దీంతో ఈ స్టాక్ 2.5 శాతం పెరిగి రూ.240 దగ్గర క్లోజైంది.

టాటా మోటార్స్‌కు జెఎల్ఆర్ దెబ్బ

టాటా మోటార్స్‌కు జెఎల్ఆర్ దెబ్బ

టాటా మోటార్స్‌కు జెఎల్ఆర్ రూపంలో మరో కష్టం వచ్చిపడింది. ఫిబ్రవరి నెలలో ఈ కంపెనీ సేల్స్ 4.1 శాతం పడిపోయింది. చైనాలో అమ్మకాలు ఏకంగా 48 శాతం పతనం కావడం కూడా ప్రధానంగా మారింది. దీంతో ఈ స్టాక్ 4 శాతం పడిపియో రూ.181.65 దగ్గర క్లోజైంది.

English summary

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్, స్వల్ప నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ | Indian shares fell on Friday,

Indian shares fell on Friday, snapping four straight sessions of gains, as recent global data and forecasts deepened concerns about the world economy.The benchmark BSE Sensex settled 0.15 percent lower at 36,671.43, but posted a weekly gain of 1.7 percent. The broader NSE Nifty lost 0.21 percent at 11,035.40 but added 1.6 percent for the week.
Story first published: Friday, March 8, 2019, 21:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X