For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని దేశాల కంటే ఇండియాలోనే ఇంటర్ సేవల ధరలు తక్కువ...

|

ఇంటర్నెట్ అతి తక్కువ ధరకు లభిస్తుందని ఎక్కువగా వాడేస్తున్నారా..ఇప్పుడైతే ఓకే రానున్న రోజుల్లో వాడకం రేట్లు అనుహ్యంగా పెరిగే అవకాశం ఉంది..ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒక్క జీబీ వాడకానికి సుమారు 600 రుపాయలు చెల్లిస్తున్నారట ఇండియా మాత్రం వన్ జీబీ నామామాత్రపు రేట్లలోనే లభిస్తుంది.సో ఇక్కడ కూడ విదేశాల రేట్లు వస్తే మాత్రం ఇప్పుడు అతి ఎక్కువగా వాడుతున్న వినియోదారులు మాత్రం ఇబ్బంది పడాల్సిందే ..

ప్రపంచంలో అందించే ఇంటర్ నెట్ ధరలపై సర్వే

ప్రపంచంలో అందించే ఇంటర్ నెట్ ధరలపై సర్వే

ఇంటర్ సేవలు ప్రపంచ దేశాలకంటే ఇండియాలోనే అతి తక్కువ ధరకు లభిస్తున్నాయని యూకే కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది..ఈ కేబుల్ బెప్రపంచవ్యాప్తంగా 230 దేశాల్లో అమలవుతున్నఅంతర్జాల సేవల ధరలను పోల్చింది..ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు అందిస్తున్న 6,313 డేటా ప్లాన్లను పరిశీలించిన తర్వాత కేబుల్‌ వెబ్‌సైట్‌ ఈ నివేదికను విడుదల చేసింది. దీంతో ఇతర దేశాల్లో సగటుగా 1 జీబీకి 600 రుపాయాలుగా వసూలు చేస్తున్నారు. కాని ఇండియాలో మాత్రం 1 జీబీ ధర 18 -19 రుపాయల మధ్య సర్వీసు ప్రోవైడర్లు వినియోగదారులకు అందిస్తున్నారు..

జింబాబ్వేలో 1జీబీకి 75 డాలర్లు..

జింబాబ్వేలో 1జీబీకి 75 డాలర్లు..

కాగా యూకే లో 6.66 ,అమేరికాలో 12.37 డాలర్లు వెచ్చాల్సించాల్సి వస్తుండంగా, చైనాలో 9.89 డాలర్లు, శ్రీలంకలో 0.87 డాలర్లు, బంగ్లాదేశ్ లో 0.99 డాలర్లు, పాకిస్థాన్ లో , 1.85 డాలర్లుకు వన్ జీబీ అందిస్తుండగా , జింబాబ్వేలో అత్యధికంగా 75.20 డాలర్లు , ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలో ఒక్క డాలరు కాగా మరికొన్ని ప్రాంతాల్లో 50 డాలర్ల వరకు ఖర్చు చేస్తున్నారు.

భారత్ లోనే ఎందుకు తక్కువ

భారత్ లోనే ఎందుకు తక్కువ

ఇండియాలో ముఖ్యంగా ఎక్కువగా మార్కేట్ ఉండడం, ఇంటర్ నెట్ సర్వీస్ ప్రోవైడర్స్ ఎక్కువ సంఖ్యలో ఉండడం దీనికి ప్రధాన కారణం కాగా ఇండియాలో దాదాపు 430 మిలియన్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉన్నారు.వీరికి సేవలు అందించేందుకు అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. దీంతో పాటు గతంలో ఉన్న సర్వీస్ ప్రోవైడర్స్ కంటే బిన్నంగా రిలయన్స్ కమ్యూనికేషన్ జీయో సేవలతొ ఇంటర్ నెట్ వాడకంలో పూర్తిగా విప్లవాత్మక మార్పులు వచ్చాయి..సామాన్యుల్లో సైతం ఇంటర్ నెట్ వాడకం పెరిగిపోయింది.జియో ప్లాన్స్ లో భాగంగా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం పాటు అత్యధిక వేగాన్ని వినియోగదారులకు అందించారు..దీంతో రిలయన్స్ అతి తక్కువ కాలంలోనే కోట్లాదీ మంది వినియోగదారులను తమవైపుకు తిప్పుకుంది.దీంతో మిగతా సంస్థలు సైతం వినియోగాదారుల వద్దకు దిగి రాక తప్పలేదు..

భవిష్యత్ ఎలా ఉండబోతుంది...

భవిష్యత్ ఎలా ఉండబోతుంది...

ప్రపంచ దేశాల్లో అందించే ఇంటర్ నేట్ సేవల ధరలు చూస్తే ఇక్కడ కూడ కోంత పెరిగే అవకాశం కనిపిస్తుంది..ఇప్పటికే చాల కంపనీలు కోంత నష్టాల్లో కొనసాగుతున్న నేపథ్యంలోనే పూర్తిగా ఇంటర్ నెట్ సేవలకు ప్రజలు అలవాటు పడిన తర్వాత రేట్లలో పెరుగుదల కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు..సో భవిష్యత్ లో ఇంటర్ నెట్ వాడుకం కోసం ఎంత ఖర్యు చేయాల్సి ఉంటుందో మన అవసరాలను బట్టి ధరలు నిర్ణయించే అవకాశం ఉంది..

English summary

అన్ని దేశాల కంటే ఇండియాలోనే ఇంటర్ సేవల ధరలు తక్కువ... | Internet services are the cheapest in India than the world

internet services are the cheapest in India than the world.The uk based cable website released this report, after examining the 6,313 data plans offered by various companies across the world,an Average in the world 1 GB of 600 is charged. But in India, 1 GB is offered to between rs 18 -19
Story first published: Thursday, March 7, 2019, 17:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X