For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంధువుల లోన్‌కు గ్యారెంటర్ సంతకం పెడ్తున్నారా ? ఇవి చెక్ చేస్తేనే ఇద్దరూ సేఫ్

By Chanakya
|

హైదరాబాద్ : ప్రతీ ఒక్కరికీ ఆర్థిక అవసరాలు ఉంటాయి. కొంత మంది తమ దగ్గర ఉన్న నిధులతో సర్దుకుంటే అధిక శాతం మందికి మాత్రం రుణాలు తీసుకునే అవసరం తప్పకపోవచ్చు. అయితే ఒక్కోసారి మన ఆర్థిక స్థోమతకు మనకు కావాలనుకున్న అప్పుకు తేడా ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని గ్యారెంటర్‌గా సంతకం పెట్టమని బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు కోరతాయి. మీ బంధువుల్లో కూడా ఇలాంటివి మీరు చూసి ఉండొచ్చు. ఒక వేళ మిమ్మల్ని ఎవరైనా ఫైనాన్షియల్ గ్యారెంటర్‌గా ఉండమని కోరితే మీరు ఏం చేస్తారు ? మీ సొంత అన్నయ్యో, తమ్ముడో, చెల్లెలో అడిగితే కాదంటారా ? వెనుకా ముందూ చూసుకోకుండా సంతకం పెడ్తారా.. లేక కాదుపొమ్మని రిజెక్ట్ చేస్తారా.. ? ఇలా చేస్తే మీ ఇద్దరికీ బాగుంటుంది. ఎవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. మొహమాటానికి పోయి ఇబ్బంది పడే స్థితి తప్పుతుంది. మరోవైపు కాదని చెప్పి బంధుత్వాలను కాదనుకునే టెన్షన్‌ కూడా తీరుతుంది.

మీపై ఉండే భారమెంత

మీపై ఉండే భారమెంత

గ్యారెంటర్‌లో రెండు రకాలున్నాయి. ఒకటి నాన్ ఫైనాన్షియల్ గ్యారెంటర్ మరొకటి ఫైనాన్షియల్ గ్యారెంటర్. నాన్ ఫైనాన్స్‌లో రుణాలు తీసుకున్న వ్యక్తికి - బ్యాంక్‌కు మధ్య మీరు మధ్యవర్తిగా ఉంటారు. ఒక వేళ రుణం పొందిన వ్యక్తి కనపడకుండా పారిపోయినా లేక మరో కారణం చేతో అందుబాటులోకి రాకపోయినా బ్యాంక్ మిమ్మల్ని సంప్రదిస్తుంది. మీరు వాళ్లిద్దరి మధ్య అనుసంధానకర్తగా ఉండాలి. అయితే ఇక్కడ డబ్బు కట్టాల్సిన బాధ్యత మాత్రం మీపై ఉండదు. అదే ఫైనాన్షియల్ గ్యారెంటర్ అయితే మాత్రం ఆ అప్పు అంతటికీ మీదే బాధ్యత. ఒక వేళ రుణం తీసుకున్న వ్యక్తి దాన్ని చెల్లించకపోతే మొత్తం రుణాన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ చూశారా

క్రెడిట్ స్కోర్ చూశారా

మిమ్మల్ని గ్యారెంటర్‌గా ఉండమని కోరిన మీ బంధువుల క్రెడిట్ స్కోర్ ఎప్పుడైనా చూశారా ? వాళ్ల ఆర్థిక స్థితిగతులు, అప్పులు, ఆస్తుల సంగతిపై మీకు అవగాహన ఉందా.. మొదట దీన్ని మీరు చూడండి. తీసుకున్న అప్పును తీర్చగలిగే సామర్ధ్యం ఉందో లేదో పరిశీలించండి. ఒక వేళ మంచి క్రెడిట్ స్కోర్ ఉండి అంతా బాగుంటే ఆల్ హ్యాపీస్... లేకపోతే ఆ అప్పుకత్తి మీ నెత్తినే వేలాడుతూ ఉంటుంది అనే సంగతి మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు.

మీ క్రెడిట్ స్కోర్‌కు ఎసరు

మీ క్రెడిట్ స్కోర్‌కు ఎసరు

ఒక వేళ మీరు ఫైనాన్షియల్ గ్యారెంటర్‌గా ఉన్న కేస్‌లో అప్పు తీసుకున్న వ్యక్తి దాన్ని కట్టలేదని అనుకుందాం. దీని వల్ల రుణం పొందిన క్రెడిట్ స్కోర్‌తో పాటు మీ స్కోర్ కూడా పడిపోతుంది. వాళ్ల ఈఎంఐలు లేట్ అయినా, రుణాలు చెల్లించేందుకు ఎక్కువ రోజులు సమయం తీసుకున్నా ఆ బాధ్యత మీపైనే ఉంటుంది. ఒక వేళ మీ ఖర్మ కాలి గ్యారెంటర్ సంతకం పెట్టిన తర్వాత మీకు కొత్తగా అప్పు కావాల్సి వస్తే మీరు మరింత కష్టపడక తప్పదు.

ఇక్కడో చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు మీ బంధువుల్లో ఒకరికి రూ.20 లక్షలకు గ్యారెంటర్ సంతకం పెట్టారని అనకుందాం. కొద్దికాలం తర్వాత వాళ్లు దాన్ని కట్టడం మానేశారు. మీకు కొత్తగా రూ.50 లక్షల హౌసింగ్ లోన్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే మీ ఆర్థిక స్థోమతను పరిగణలోకి తీసుకుని అంతా బావుంటే మీకు రూ.30 లక్షల రుణాన్ని మాత్రమే ఇస్తాయి. ఎందుకంటే రూ.20 లక్షలకు మీరు గ్యారెంటర్‌గా ఉన్న సంగతిని మర్చిపోవద్దు. ఇలాంటి సందర్భాల్లో మీ కుటుంబాల మధ్య పొరపచ్చాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

అందుకే బంధువులకు, రక్త సంబంధీకులకు, ఫ్రెండ్స్‌కు మీరు ఫైనాన్షియల్ గ్యారెంటర్‌గా సంతకం పెట్టే ముందు పై అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే హౌసింగ్ లోన్ వంటి వాటికి 15-20 ఏళ్ల సమయం ఉంటుంది. ఏ దశలో వాళ్లు డిఫాల్ట్ అయినా ఆ భారాన్ని మీరు మోయక తప్పదు. బంధుత్వాలు ముఖ్యమే కానీ.. మీ స్థోమత, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితులనూ అర్థం చేసుకునే ముందుకు సాగాలి.

Read more about: bajaj loan లోన్
English summary

బంధువుల లోన్‌కు గ్యారెంటర్ సంతకం పెడ్తున్నారా ? ఇవి చెక్ చేస్తేనే ఇద్దరూ సేఫ్ | Consequences of being a financial guarantor to friends and relatives. Keep this points in your mind before becoming a guarantor

Each one has financial needs. Some people may have to pay their funds, but most of the people may not need to borrow. However, banks and financial institutions sometimes ask someone to sign up as a guarantor if one of us is different for our financial contribution. You may have seen this in your relatives too. What will you do if someone asks you to be a financial guarantor? Do not ask your own brother, sister or relatives Do you have to sign up without checking the petatara .. or can not you decide to do it ..? This is good for both of you. No one needs to get into trouble. Getting rid of the problem is getting worse. The tension, which refers to the relatives, is not the other side.
Story first published: Monday, March 4, 2019, 13:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X