For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సు 27, స్టార్టప్ విలువ రూ.7000 కోట్లు

ఆలోచన, పట్టుదల ఉంటే.. మార్గం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. రూట్ పట్టుకున్నాక.. అది ఎంత కఠినమైనా అడుగులు ముందుకేస్తేనే విజయం వరిస్తుంది.

By bharath
|

ఆలోచన, పట్టుదల ఉంటే.. మార్గం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. రూట్ పట్టుకున్నాక.. అది ఎంత కఠినమైనా అడుగులు ముందుకేస్తేనే విజయం వరిస్తుంది. అలా సక్సెస్ సాధించి ఎంతో మంది యంగ్ జనరేషన్‌కు రోల్ మోడల్‌గా నిలుస్తోంది జిలింగో స్టార్టప్ ఫౌండర్ అంకితి బోస్. పాతికేళ్లలోపే స్టార్టప్ స్థాపించి దాన్ని ఏకంగా బిలియన్ డాలర్ల (సుమారు రూ.7000 కోట్లు) స్థాయికి తీసుకెళ్లి ఫ్యాషన్ వాల్డ్‌లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఏంటీ స్టార్టప్ స్పెషాలిటీ

ఏంటీ స్టార్టప్ స్పెషాలిటీ

చిన్న, మధ్య తరహా సంస్థలు ఒక స్థాయికి మాత్రమే పరిమితమవుతాయి. మరింత విస్తరణకు అవకాశమున్నా నిధులు,మార్కెటింగ్ సామర్ధ్యం లేక ఎదుగుదల ఆగిపోతుంది. అలాంటివాటిని గుర్తించి వాళ్లకు ఆర్థిక చేయూతనిప్పించి, వాళ్ల ప్రోడక్టులను వివిధ దేశాలకు మార్కెటింగ్ చేయడమే ఈ స్టార్టప్ స్పెషాలిటీ. ప్రధానంగా ఫ్యాషన్ వాల్డ్‌కు సంబంధం ఉన్న ప్రోడక్టులపైనే వీళ్లు దృష్టిపెట్టారు. ఈ ఫార్మాట్‌లో మన దేశంలో కొన్ని స్టార్టప్స్ పుట్టుకొచ్చినా పెద్దగా సక్సెస్ సాధించిన దాఖలాలు లేవు.

అయితే వీళ్లు సింగపూర్ బేస్ చేసుకుని అక్కడి నుంచి స్టార్టప్ మొదలుపెట్టడం వల్ల బంగ్లాదేశ్ నుంచి వియత్నాం వరకూ వివిధ దేశాల్లోని సంస్థలకు ఆసరాగా నిలిచారు. సౌత్ ఈస్ట్ ఏషియాలోని వివిధ వ్యాపారులకు అండగా నిలవడం వల్ల ఇద్దరికీ ప్రయోజనం చేకూరింది.

2016 మార్చిలో 4,34,000 డాలర్ల ఆదాయాన్ని సాధించిన సంస్థ.. గతేడాది ఏకంగా 1.3 మిలియన్ డాలర్ల (రూ.10 కోట్లకు పైగానే) స్థాయికి తన వ్యాపారాన్ని పెంచుకుంది. ఆదాయం 12 రెట్లకు పైగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వీళ్ల బాధ్యత ఏంటి

వీళ్ల బాధ్యత ఏంటి

దక్షిణాసియా దేశాల్లో ఉన్న చిన్న తరహా వ్యాపారులను గుర్తించి, వాళ్ల నైపుణ్యం ఆధారంగా ప్రోడక్టులను సూచించడం, క్రాస్ బోర్డర్ షిప్పింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సేవలను అందిస్తోంది. అవసరాన్ని బట్టి సరుకుల కొనుగోలుకు వ్యాపారులకు రుణాలను కూడా ఇప్పిస్తోంది. ఇందుకోసం కొన్ని ఫిన్ టెక్ సంస్థలతో జిలింగో ఒప్పందం కుదుర్చుకుంది.

వీళ్ల సైట్‌లో ఎవరైనా సరే తమ తమ ప్రోడక్టులను ఉచితంగా పోస్ట్(లిస్టింగ్) చేసుకోవచ్చు. ఇందుకోసం వాళ్లు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన పనిలేదు. ఒక వేళ ఆర్డర్స్ వస్తే మాత్రం పది నుంచి 20 శాతం వరకూ కమిషన్‌గా వసూలు చేస్తారు. ఇదే జిలింగో ఆదాయం.

యంగ్ సెన్సేషన్

యంగ్ సెన్సేషన్

స్టార్టప్స్‌లో మహిళలు సక్సెస్ కావడం బాగా అరుదు. గ్లోబల్ స్టార్టప్ వాల్డ్‌లో వీళ్ల శాతం ఇంకా తక్కువ. వెంచర్ క్యాపిటల్ నిధులు వచ్చిన 239 బిలియన్ డాలర్ స్టార్టప్స్‌లో మహిళా ఫౌండర్స్ ఉన్న సంస్థలు కేవలం 23 మాత్రమే ఉన్నాయి. అందులో ఇప్పుడు జిలింగో కూడా చేరబోతోంది.

23 ఏళ్ల వయస్సులో అంకితి బోస్, ధృవ్ కపూర్ ఇద్దరూ కలిసి ఈ స్టార్టప్ మొదలుపెట్టారు. డిసెంబర్ 2014లో వీళ్ల వ్యాపారానికి బీజం పడింది. అప్పట్లో అంకితి సెకోయా క్యాపిటల్‌లో పనిచేస్తుండగా, ధృవ్ ఓ గేమింగ్ సంస్థలో పనిచేసేవాడు. ఇద్దరూ బెంగళూరులోని ఓ పార్టీలో క్యాజువల్‌గా మాట్లాడుతుండగా వచ్చిన ఐడియాతో రంగంలోకి దిగారు. ఉద్యోగాలు వదిలేసి ఒకొక్కరూ రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి జిలింగో అనే ఫ్యాషన్ బేస్డ్ ఆన్‌లైన్ వెబ్ సైట్ ప్రారంభించారు.

భారీగానే ఫండింగ్ కూడా..

భారీగానే ఫండింగ్ కూడా..

ఆదాయం, నికరలాభం పరంగా జిలింగో మంచి ప్రగతి సాధిస్తూ ఉండడంతో వెంచర్ క్యాపిటల్ సంస్థలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపించాయి. తాజాగా సెకోయా క్యాపిటల్, టెమాసెక్ హోల్డింగ్స్ సంస్థలు జిలింగో స్టార్టప్‌లో 226 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1600 కోట్లు) పెట్టుబడి పెట్టాయి. దీంతో ఈ సంస్థ వేల్యుయేషన్ 970 మిలియన్ డాలర్లుకు (సుమారు రూ.6800 కోట్లు) చేరింది.

బిలియన్ డాలర్ల స్థాయి స్టార్టప్‌ను లీడ్ చేస్తున్న మహిళా ఎగ్జిక్యూటివ్స్‌లో అత్యంత పిన్న వయస్కురాలుగా అంకితి ఖ్యాతిగడిస్తోంది. చిన్న వయస్సులోనే ఈ స్థాయిలో స్టార్టప్‌ను సక్సెస్ చేయడాన్ని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఎవరీ అంకితి బోస్

ఎవరీ అంకితి బోస్

ఇండియాలోనే పుట్టిపెరిగిన అంకితి బోస్ వాళ్ల తండ్రి ఓ ప్రభుత్వ ఆయిల్ కంపెనీలో ఉన్నతోద్యోగి. ఎక్కువగా ట్రాన్స్‌ఫర్స్ కావడం వల్ల అంకితి వివిధ ప్రాంతాలు తిరిగేది. అక్కడ అనేక సంస్కృతులు, సంప్రదాయాలపై అవగాహన పెంచుకుంది. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్, ఎకనమిక్స్‌పై పట్టు సాధించిన ఆమె.. మెకెన్సీలో కొద్దికాలం పనిచేశారు. టెక్నాలజీ, టెలికాం సెక్టార్లను ఆమె కవర్ చేసేవారు.

Read more about: business profits small business
English summary

వయస్సు 27, స్టార్టప్ విలువ రూ.7000 కోట్లు | How Bengaluru 27-Year-Old Built A Near-$1 Billion Fashion Start-Up

Zilingo Pte's path to becoming a fashion platform with a valuation approaching $1 billion began in December 2014 when Ankiti Bose, then an analyst at Sequoia India
Story first published: Wednesday, February 13, 2019, 13:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X