For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు స్టేట్ బ్యాంక్ కస్టమరా? డెబిట్ కార్డ్‌పై అతిముఖ్యమైన మెయిల్స్ పంపిన బ్యాంక్

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. కోట్లాది మంది కస్టమర్లను కలిగిన బ్యాంక్‌ అయినా ఇప్పటికీ అనేక కంప్లైంట్లు ఎస్బీఐపై వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత అమాయకంగా ఉంటే.. అంత తెలివిగా ఫ్రాడ్స్ చేస్తున్నారు దొంగలు. దీనికి ఎస్బీఐ ఒక్కటే కాదు.. అన్ని బ్యాంకుల ఖాతాదారులూ మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కొన్ని అతి ముఖ్యమైన విషయాలను, సూచనలను తెలుపుతూ అధికారులు అందరికీ మెయిల్ పంపించారు. ప్రధానంగా
స్కిమ్మింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ వివరాలను వాళ్ళ ఖాతాదార్లందరికీ
పంపింది.

If you have this SBI ATM card, You got mail from Bank

స్కిమ్మింగ్ అంటే?

స్కిమ్మింగ్. ఇదో అనైతికమైన చర్య. మన డేటాను మనకు తెలియకుండా
కాపీ కొట్టడమే స్కిమ్మింగ్ అంటే. మన క్రెడిట్, డెబిట్ కార్డు వెనుక ఉండే నల్లటి గీత (మ్యాగ్నిటక్ స్ట్రైప్)పై ఉంటే సెక్యూరిటీ సమాచారాన్ని దుండగులు దొంగిలిస్తారు. దాన్ని వాడుకుని మరో కార్డ్ తయారు
చేసుకుని వాళ్లు వాడుకుంటారు. అందుకే ఈ మధ్య చిప్ బేస్డ్ కార్డ్స్‌ను
బ్యాంకులన్నీ ఇచ్చాయి. అయినా సరే ఇలాంటి కంప్లైంట్లు వస్తూ ఉండడం
వల్ల మనమే మరింత జాగ్రత్త పడాలి. డబ్బుు మనవే కాబట్టి బాధ్యత కూడా మనదే.

ఎస్బీఐ తన ఖాతాదారులకు ఏం మెయిల్ పంపింది 1. మీ డెబిట్ కార్డును లేదా క్రెడిట్ కార్డును ఎవ్వరికీ ఇవ్వొద్దు. బ్యాంక్ రిప్రెంజేటివ్‌లు అడిగినా
ఇవ్వొద్దు(అవసరమని అనిపిస్తే తప్ప) 2. ఏటీఎంలో పిన్ ఎంటర్ చేసేటప్పుడు మీ చేతిని అడ్డుపెట్టి పాస్ వర్డ్ టైప్ చేయండి. 3. మీ సమక్షంలోనే మీ కార్డును స్వైప్ చేసేలా చూడండి. అతి ఎంతటి పెద్ద
రెస్టారెంట్, ఎస్టాబ్లిష్మెంట్ అయినా మీ దగ్గరికి మెషీన్ తెప్పించి స్వైప్ చేసి,
పిన్ ఎంటర్ చేయండి. 4. మీ లావాదేవీ తర్వాత మీ కార్డును తిరిగి
తీసేసుకోండి. 5. ఎస్బీఐ కార్డ్ రెప్రెంజెటేటివ్ లేదా ఉద్యోగి అడిగినా సరే ఏటీఎం మాత్రం చెప్పొద్దు. 6. మీ ఎస్బీఐ కార్డును స్వైప్ చేసే బదులు,
కార్డును చిప్ ఉన్న వైపు డిప్ చేయమని చెప్పండి.

ఇవి ఎప్పుడూ, ఎవరితోనో షేర్ చేయొద్దు ఎస్బీఐ కార్డ్ 4 డిజిట్ పిన్, ఓటీపీ ఎవ్వరితోనూ చెప్పొద్దు. సివివి సహా ఇతర సమాచారం షేర్ చేసుకోవద్దు
ఎస్బీఐ ఆన్ లైన్ అకౌంట్ యూసర్ ఐడీ, పాస్ వర్డ్ షేర్ చేసుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుంటే మన కార్డ్ స్కిమ్మింగ్
బారిన పడకుండా సేవ్ అవుతాం.

English summary

మీరు స్టేట్ బ్యాంక్ కస్టమరా? డెబిట్ కార్డ్‌పై అతిముఖ్యమైన మెయిల్స్ పంపిన బ్యాంక్ | If you have this SBI ATM card, You got mail from Bank

If you have this SBI ATM card, You got mail from Bank.
Story first published: Tuesday, February 12, 2019, 18:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X