For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రాహ్మణి వర్సెస్ భారతి : ఎవరు ఎక్కువ వేతనం పొందుతున్నారు..?

|

నారా బ్రాహ్మణి, వైఎస్ భారతి... నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తులు. టాప్ మోస్ట్ సెలబ్రిటీస్. వివిఐపి పర్సన్స్. ఒకరు ప్రతిపక్ష నేత భార్య, మాజీ సిఎం కోడలు అయితే.. మరొకరు ప్రస్తుత సీఎం కోడలు, ఓ మంత్రి భార్య. వారే భారతి, బ్రాహ్మణి. వీళ్ల ఆస్తుల సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ల నెల జీతాలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఏడాదికి కోట్లకు కోట్లు వీళ్లు వార్షిక వేతనంగా అందుకోవడం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ భారతి అధిక వేతనం తీసుకోవడం కూడా అక్రమమని అప్పట్లో కొన్ని పేపర్లు, ఛానళ్లు ఊదరగొట్టాయి.

వైఎస్ భారతి జీతభత్యాలెంత ?

వైఎస్ భారతి జీతభత్యాలెంత ?

భార‌తి సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఛైర్ ప‌ర్సన్ కాకముందే వైఎస్ భార‌తికి క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వేత‌నం వ‌చ్చేది. 2006-07లో రూ.17.5ల‌క్ష‌లు.. 2007-08లో రూ.42ల‌క్ష‌లు.. 2008-09లో రూ.43.5ల‌క్ష‌లు.. రూ.2009-10లో రూ.42ల‌క్ష‌ల వార్షిక వేతాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో సండూర్ ప‌వ‌ర్ నుంచి 2005-06లో 11 లక్షలు, 2006-07లో 6 లక్షలు తీసుకున్న‌ట్లు ప‌లువురి వాద‌న‌. ఇక‌ 2010 డిసెంబ‌రు 12న భార‌తి సిమెంట్స్ కు ఛైర్ ప‌ర్స‌న్ గా ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్పటి నుంచి ఆమె ఏడాదికి రూ..3.90కోట్ల వార్షిక వేత‌నం అందుతోంది. అంటే ఏడాదికి వివిధ కంపెనీల నుంచి వచ్చే మొత్తం సుమారు రూ.6 కోట్ల వరకూ ఉండొచ్చు. ఒక కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నందుకు సదరు సంస్థ వీళ్లకు ఏడాదికి ఇంత చొప్పున ఇవ్వడం సహజం. ఆ లెక్కన చూసుకున్నా భారతికి నెలకు రూ.50 లక్షల వరకూ అందుతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. ఇందులో ఉద్యోగాల జీత భత్యాల యాజమాన్యం ఇష్టం. ఎందుకంటే ఇవి వాళ్లు నడుపుకునే సంస్థలు కాబట్టి.

బ్రహ్మణికి ఎంత ముడ్తోంది ?

బ్రహ్మణికి ఎంత ముడ్తోంది ?

అదే సమయంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా హైపెయిడ్ ఎంప్లాయీ లిస్ట్‌లోనే ఉన్నారు. ఆమె ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలో డైరెక్టర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రాహ్మణి ఏడాదికి తీసుకునే రెమ్యునరేషన్ సుమారు రూ.4.2 కోట్లు. గతేడాది ఇది 3.9 కోట్లు మాత్రమే ఉండగా.. ఈ మధ్యే పది శాతం శాలరీ హైక్ కూడా ఇఛ్చింది సంస్థ. వాస్తవానికి ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే షేర్ హోల్డర్ల సొమ్ముతో నడిచే సంస్థ. వాళ్లు డబ్బు పెట్టి షేర్లు కొంటారు కాబట్టి యాజమాన్యం మరింత బాధ్యతాయుతంగా ఉండాలి.

కార్పొరేట్ ఫీల్డ్‌తో ఎవరికెంత ?

కార్పొరేట్ ఫీల్డ్‌తో ఎవరికెంత ?

ఇవన్నీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కాబట్టి ఎవరి వేతనాలనూ మనం ఆక్షేపించలేం. మరీ ఓవర్ అవుతోంది అనుకుంటే ఏడాదికో మారు జరిగే వార్షిక సర్వసభ్య సమావేశాల్లో షేర్ హోల్డర్లు దుమ్ముదులిపి పారేస్తారు. ఇక వీళ్లే కాదు... అమరరాజా బ్యాటరీస్ ఎండిగా ఉన్న గల్లా జయదేవ్ వేతనం.. ఏడాదికి రూ. 39 కోట్లు. అదే సమయంలో మరో హైదరాబాదీ కంపెనీ దివస్ సంస్థ.. ఛైర్మన్ మురళి వేతనం రూ. 45 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద కంపెనీలు నడిపే ఓనర్ల శాలరీలు ఇదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి నారా బ్రాహ్మణి ఎక్కువ వేతనం తీసుకుంటోందా.. భారతి తక్కువ తీసుకుంటోందా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరెవరి క్యాపబిలిటీస్‌కు తగ్గట్టు వాళ్లు శాలరీలు తీసుకుంటున్నారు.

English summary

బ్రాహ్మణి వర్సెస్ భారతి : ఎవరు ఎక్కువ వేతనం పొందుతున్నారు..? | What is the salary earned by these VVIP women Entrepreneurs?

Everybody wants to Know about the celebreti's earnings what they earn and how they spend. In telugu states, two Women personalities are catching up everybody's attention. Bharathi reddy wife of YCP Chief Y.S. Jagan and another lady Nara Brahmini wife of AP IT Minister Nara Lokesh.
Story first published: Saturday, February 9, 2019, 15:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X