For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ వడ్డీ తగ్గింపుతో మీ హౌసింగ్ లోన్ భారం ఎంత తగ్గుతోందో తెలుసా ?

|

ఎస్బీఐ ఖాతాదారులకు ఓ గుడ్ న్యూస్. వడ్డీ రేట్లను తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ న్యూస్ చెప్పింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను పావు శాతం తగ్గించిన నేపధ్యంలో ఎస్బీఐ మొదటగా స్పందించింది. రూ.30 లక్షల వరకూ తీసుకున్న గృహ రుణాలపై ఇంట్రెస్ట్ రేట్‌ను 8.75 నుంచి 8.7 శాతానికి తగ్గించింది. దీన్ని బట్టి 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్‌ను ఎస్బీఐ తగ్గించింది.

దేశంలోని ప్రముఖ ప్రధాన బ్యాంక్ కావడంతో కస్టమర్ల ఇంట్రెస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని రుణాలపై ఇంట్రస్ట్ రేట్లను వెంటనే తగ్గించినట్టు ఎస్బీఐ వెల్లడించింది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్‌కు ఎక్కువగా క్యాటర్ చేస్తున్న ఎస్బీఐ.. దేశంలో హౌసింగ్ లోన్ విభాగంలో అధిక మార్కెట్ కలిగి ఉంది.

SBI cuts interest rate by 5bpson home loans upto Rs.30 Lakh

శుక్రవారం నుంచే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. దేశంలోని నెంబర్ ఒన్ గవర్నమెంట్ బ్యాంక్ అయిన ఎస్బీఐ నిర్ణయంతో మిగిలిన బ్యాంకులు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య రెపో రేట్‌ను 6.5 నుంచి 6.25 శాతానికి తగ్గించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు బాధ్యత బ్యాంకులపైనే ఉందని, తాము తీసుకున్న నిర్ణయాలకు సహకరించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. ఈ నేపధ్యంలో ఎస్బీఐ మొదటగా స్పందించింది. ఎన్నికల త్వరలో రాబోతుండడంతో అటు బ్యాంకులు, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కేంద్రానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సాధారణమైన విషయమే అనే సంగతి మనందరికీ అవగతమే. ఇక ప్రైవేట్ బ్యాంకులు కూడా కొద్దో గొప్పో వడ్డీ రేట్లను తగ్గిస్తే.. రుణాలు తీసుకున్న వాళ్లకు కొద్దోగొప్పో ఊరట లభిస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ రేట్లను 8.5 నుంచి 9.25 శాతం వరకూ పెంచాయి. దీని వల్ల ఈఎంఐల భారం అనూహ్యంగా పెరిగింది.

హౌసింగ్ లోన్ ఈఎంఐ ఎంత వరకూ తగ్గొచ్చు..
ఓ అంచనా ప్రకారం ఉదాహరణకు మీకు ఇరవైఏళ్ల కాలపరిమితితో రూ.50 లక్షల హౌసింగ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు దాని ఈఎంఐ నెలకు (9.55 శాతం వడ్డీతో లెక్కిస్తే) రూ.47,705 వరకూ ఉండొచ్చు. ఇప్పుడు 9.5 శాతానికి సదరు వడ్డీ రేట్ తగ్గిన తర్వాత మీ ఈఎంఐ భారం రూ.47,355కి తగ్గుతుంది. ఒస్ ఇంతేనా... అయితే రూ.350 మాత్రమే కదా తగ్గింది అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఇరవై ఏళ్లకు సుమారు రూ.80 వేల వరకూ అవుతుంది. సో.. ఇది మీకు గుడ్ న్యూసే కదా..

English summary

ఎస్బీఐ వడ్డీ తగ్గింపుతో మీ హౌసింగ్ లోన్ భారం ఎంత తగ్గుతోందో తెలుసా ? | SBI cuts interest rate by 5bpson home loans upto Rs.30 Lakh

Indias number one public sector bank state bank of India reduced its interest rates by 5bps. Its applicable for people who took housing loan more than rs.30 lac.
Story first published: Saturday, February 9, 2019, 14:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X