For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదేళ్లలో 97 శాతం హాంఫట్ ! ఓ గాలి కంపెనీ గాధ

ఒకప్పుడు దలాల్ స్ట్రీట్‌కు ఈ స్టాక్ డార్లింగ్. ఇన్వెస్టర్లందరికీ ఓ హాట్ ఫేవరెట్. గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. ఇక భవిష్యత్ అంతా ఈ సంస్థదే అనేట్టు బిల్డప్ ఇచ్చింది.

By bharath
|

ఒకప్పుడు దలాల్ స్ట్రీట్‌కు ఈ స్టాక్ డార్లింగ్. ఇన్వెస్టర్లందరికీ ఓ హాట్ ఫేవరెట్. గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. ఇక భవిష్యత్ అంతా ఈ సంస్థదే అనేట్టు బిల్డప్ ఇచ్చింది. నీరు, బొగ్గు నిల్వలు తగ్గిపోతున్న నేపధ్యంలో పవనవిద్యుత్‌ బంగారమని ఊదరగొట్టింది. అదే సుజ్లాన్ ఎనర్జీ. గాలి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు పుట్టిన పవనవిద్యుత్ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ. జనవరి 9, 2008న రూ.448 ఉన్న స్టాక్ ఇప్పుడు సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. తాజాగా రుణాలు చెల్లించే విషయంలో ప్రమోటర్లు డిఫాల్ట్ అవుతున్నారనే వార్తలు సుజ్లాన్‌ను మరింత కింద పడేశాయి.

పదేళ్లలో 97 శాతం హాంఫట్ ! ఓ గాలి కంపెనీ గాధ

2008లో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.67110 కోట్లుగా ఉండేది. ఇప్పుడది రూ.1931 కోట్లకు దిగొచ్చింది. రూ.450 ఉన్న స్టాక్ కాస్తా.. రూ.4 కంటే కిందికి వచ్చేసింది.

1.పదేళ్లలో పంగనామాలు ఇలా పెట్టారు

లాభాలు ఆవిరి గత పదేళ్లలో సంస్థ ఆరుసార్లు నష్టాలను వెల్లడించింది. 2018 మార్చి
కాలానికి సుజ్లాన్ రూ.389.20 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2015లో రూ. 9133 కోట్లు, 2015లో రూ.3548 కోట్లు, 2014లో రూ.4732 కోట్లు, 2012లో రూ.472 కోట్లు, 2012లో రూ.1316 కోట్లు, 2010లో రూ.989 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. అదే 2016లో రూ.595 కోట్లు, 2017లో రూ.900 కోట్ల లాభాలను మాత్రమే ఇవ్వడం గమనించాల్సిన అంశం.

2. ప్రమోటర్లు బయటపడిపోయారు

సంస్థ భవిష్యత్ ఏంటో ముందుగా ప్రమోటర్లకే బాగా తెలుసు. అందుకే ముందు జాగ్రత్తపడ్డారో.. లేక మరో కారణమో తెలీదు కానీ.. 2008లో 65.80 శాతంగా ఉన్న వాటా ఇప్పుడు 19.80 శాతానికి దిగింది. 2009లో 43 శాతంగా ఉన్న ప్రమోటర్ల తనఖా షేర్లు 2018 ఆఖరు నాటికి 76.70 శాతంగా ఉన్నాయి.

3. ఆదాయమూ అంతంతే

గత పదేళ్లుగా ఏడాదికి 5 శాతం చొప్పున సుజ్లాన్ ఆదాయం పడిపోతూ వచ్చింది. మార్చి 2018 నాటికి సంస్థ ఆదాయం రూ.8292.30 కోట్లుగా ఉంది. అదే పదేళ్ల కిందట ఇది రూ.13679 కోట్లుగా ఉండేది. ఈ లెక్కన నెగిటివ్ గ్రోత్‌ను చూపిస్తూ వచ్చింది సంస్థ.

4. అప్పుల కుప్ప

2008లో రూ.8091 కోట్ల పాజిటివ్ నెట్వర్త్ కాస్తా ఇప్పుడు రూ.7015 కోట్ల నెగిటివ్‌గా మారింది. దీన్ని బట్టి ఇప్పుడు సంస్థకు ఉన్న విలువేంటో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. అప్పు కూడా రూ.9934 కోట్ల నుంచి రూ.11995 కోట్లకు పెరిగింది. ఏస్ ఈక్విడీ చెబ్తున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం సుజ్లాన్ ఎనర్జీనెత్తిన ఉన్న అప్పు విలువ రూ.17811 కోట్లు.

5. వీళ్లు చేసిన వ్యాపారమేంటి

పునరుత్పాదక ఎనర్జీ రంగంలో ప్రధాన వ్యాపారాన్ని నిర్వహిస్తూ వస్తున్న సుజ్లాన్‌కు 6 ఖండాల్లో 18 దేశాల్లో శాఖలున్నాయి. వివిధ స్థాయిల్లో భారీ వింట్ టర్బైన్ జెనరేటర్లను తయారు చేసి సరఫరా చేయడం వీళ్ల వ్యాపారం. డిజైన్ మొదలు అన్ని సేవలనూ ఈ సంస్థ అందిస్తోంది.

Read more about: suzlon shares
English summary

పదేళ్లలో 97 శాతం హాంఫట్ ! ఓ గాలి కంపెనీ గాధ | Suzlon Has Become One Of The Wealth Destroyer Company In The Past 10 Years

Suzlon has become one of the wealth destroyer company in the past 10 years. It has eroded almost 97 percent of its share value in this decade.
Story first published: Wednesday, February 6, 2019, 17:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X