For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎట్టకేలకు మళ్లీ లాభాల్లోకి పంజాబ్ నేషనల్ బ్యాంక్.

దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఒక్కటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించి ఆశ్చర్యపరిచింది.

By bharath
|

దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఒక్కటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించి ఆశ్చర్యపరిచింది. డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో ప్రొవిజన్స్ తగ్గడం ఊరటనిచ్చింది. పీఎన్‌బి రిజల్ట్స్‌లో 5 ప్రధానాంశాలు నికర లాభం - నిరుటితో పోలిస్తే పీఎన్‌బి నికర లాభంలో 7.12 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. గతంలో రూ.230.11 కోట్ల లాభాలను నమోదు చేసిన బ్యాంక్ ఈ సారి రూ.246.51 కోట్లను ఆర్జించింది.అయితే రెండో క్వార్టర్‌లో మాత్రం రూ.4532.35 కోట్ల నికర నష్టాన్ని బ్యాంక్ వెల్లడించింది.

ఎట్టకేలకు మళ్లీ లాభాల్లోకి పంజాబ్ నేషనల్ బ్యాంక్.

రీసెర్చ్ ఏజెన్సీల అంచనాలను తారుమారు చేస్తూ బ్యాంక్ లాభాల్లోకి వచ్చింది. ప్రొవిజన్స్ - మొండి బకాయిల కోసం ఏర్పాటు చేసుకునే ప్రొవిజన్స్, కంటింజెన్సీలు ఈ క్వార్టర్‌లో 38.35 శాతం క్షీణించాయి. నిరుటితో పోలిస్తే ప్రొవిజన్స్‌లో 72 శాతం క్షీణత నమోదు కావడం ఆశ్చర్యకరం. డిసెంబర్ క్వార్టర్‌కు ప్రొవిజన్స్ రూ.2014.04 కోట్లుగా ఉన్నాయి. నిర్వాహణ లాభం - ఇది 27 శాతం క్షీణించడం కొద్దిగా ఇబ్బందికర పరిణామం. ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.3099.86 కోట్లుగా నమోదైంది. అంతకుముందు క్వార్టర్‌లో ఇది రూ.45245.19 కోట్లుగా ఉండేది.

మొండిబకాయిలు - బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెల్లిగా గాడినపడ్తోంది.సెప్టెంబర్ క్వార్టర్‌లో 17.16 శాతంగా ఉన్న ఎన్పీఏ భారం ఇప్పుడు 16.33 శాతానికి దిగొచ్చింది. నెట్ ఎన్‌పిఏలు 8.9 నుంచి 8.22 శాతానికి దిగి రావడం పాజిటివ్ పాయింట్.

ఎన్ఐఐ (స్థూల వడ్డీ ఆదాయం)- ఏ బ్యాంక్‌ కైనా నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కం, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లే కీలకం. ఇవే బ్యాంక్ పనితనాన్ని చూపుతాయి. పీఎన్‌బి ఎన్ఐఐలు 7.56 శాతం వృద్ధి చెంది రూ.4290.05 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు రూ.3988.70గా ఉంది.

ఇలా వివిధ అంశాల్లో మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన బ్యాంక్ ఈ రోజు పాజిటివ్‌గా ట్రేడైంది. ఇంట్రాడేలో రూ.76.50 గరిష్ట స్థాయి వరకూ వెళ్లిన స్టాక్ చివరకు 0.34 శాతం లాభంతో రూ.73.40 దగ్గర క్లోజైంది. మెల్లిగా మొండిబకాయిల భారం తగ్గడం కూడా కలిసొస్తోంది.

Read more about: pnb results earning
English summary

ఎట్టకేలకు మళ్లీ లాభాల్లోకి పంజాబ్ నేషనల్ బ్యాంక్. | At Last Punjab National Bank Has Earned Profit For Q3 2019

Punjab national bank has posted decent set of quarterly financial numbers with stellar decrease in NPAs. Bank has posted profits when compared with huge losses in second quarter.
Story first published: Tuesday, February 5, 2019, 18:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X