For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్ష మంది భారతీయ ఉద్యోగులకు భయం ! బ్రెగ్జిట్‌ ఎఫెక్ట్ మామూలుగా లేదు

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఈ మార్చి 29న వైదొలగబోతోంది. మరో రెండు నెలల సమయం మిగిలే ఉన్నా..

By bharath
|

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఈ మార్చి 29న వైదొలగబోతోంది. మరో రెండు నెలల సమయం మిగిలే ఉన్నా.. బ్రిటిష్ పార్లమెంటులో రెండు పార్టీల మధ్ సయోధ్యకు దరకపోతే మాత్రం సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం పొంచి ఉంది. ఒక వేళ ఎలాంటి డీల్ లేకుండా బ్రిటన్ నుం ఎగ్జిట్ అయితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదురుకావొచ్చని బ్రిటన్ వ్యాపారవేత్తలంతా గగ్గోలు పెడ్తున్నారు. ఇది అటు యూరోపియన్ యూనియన్‌పై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించనుంది.

ఎందుకంటే యూరోపియన్ యూనియన్‌లో ఉన్న జర్మనీకి బ్రిటన్ మేజర్ మార్కెట్. మనకేంటి...యూరోప్ దేశాల్లో సంక్షభంz> వస్తే మనకేంటి అని మనం అనుకోవడానికి లేదు.ఎందుకంటే ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఖచ్చితంగా ఒకదానిపై మరొక ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక బ్రిటన్ విషయానికి వస్తే మన దేశ కంపెనీలు అక్కడ భారీగా పెట్టుబడులను కుమ్మరించాయి. ఈయూలో వ్యాపారం చేసుకునేందుకు బ్రిటన్‌ను గేట్ వే లా చేసుకుని మన సంస్థలు పాగా వేశాయి.

లక్ష మంది భారతీయ ఉద్యోగులకు భయం ! బ్రెగ్జిట్‌ ఎఫెక్ట్ మామూలుగా లేదు

ప్రస్తుతం యూకెలో సుమారు 800 భారతీయ కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. ఇవన్నీ కలిసి 1,10,000 మందికి ఉద్యోగాలను కల్పించాయి. అయితే వీటిల్లో అధిక శాతం 5 కంపెనీలదే ఆధిపత్యం.బ్రిటన్‌లో టాటా గ్రూపు సంస్థలకే గట్టి పట్టు ఉంది. అయితే ఎలాంటి డీల్ కుదుర్చుకోకుండా బ్రిటన్ బయటకు వస్తే నెగ్గుకురావడం కష్టం. అలాంటప్పుడు అక్కడ భారీ స్థాయిలో ఉద్యోగాలకు ఎసరు వస్తుంది.

మన ఐటీ కంపెనీలకు మరో షాక్ ఈ మధ్యకాలంలో అనేక భారతీయ సంస్థలైన రోల్టా,
ఎయిర్టెల్, ఎయిగిస్ వంటివి అక్కడ తమ వ్యాపారాలను విస్తరించాయి. వీటన్నింటికీ తమ ఆదాయంలో బ్రిటన్ నుంచి 13 శాతం ఎక్స్‌పోజర్ (వ్యాపారం జారిపోయే భయం) ఉంది. మొత్తం ఈయూ నుంచి సుమారు 30 శాతం మన దేశీయ కంపెనీలకు వస్తోంది.
ఐటీతో పాటు ఫార్మా కంపెనీలకు కూడా బ్రిటన్‌లో మంచివ్యాపారం ఉంది. ఒక వేళ బ్రిటన్ వీడితే పౌండ్ స్టెర్లింగ్ కరెన్సీ నీరసించి ఈ సంస్థల ఆదాయాలకు గండికొడ్తుంది.
మనం అంత భయపడాలా మరికొంత మంది మాత్రం బ్రెగ్జిట్‌ను ఓ మంచి ఆపర్చునిటీగా
చూస్తున్నారు.

యూరోపియన్ యూనియన్ సహా బ్రిటన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడింగ్
అగ్రిమెంట్‌ను తాజాగా కుదుర్చుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ఆరేళ్ల క్రితం వివిధ దేశాల మధ్య చర్చలు జరిపినప్పటికీ అవేవీ సఫలీకృతం కాలేదు. ఇప్పుడు ఈయూ నుంచి బ్రిటన్ వెళ్లిపోతుంది కాబట్టి తాజాగా చర్చలకు దారులు
తెరుస్తుంది.

అయితే బ్రిటన్ వీడకుండా యూరోపియన్ యూనియన్ లోనే ఉండాలని భారత ప్రధాని
నరేంద్ర మోడీ కూడా కోరారు. కానీ అది ఇప్పుడు కుదిరేలా లేదు కాబట్టి మనకు మరో
కొత్త కష్టం వచ్చిపడింది. విదేశాల్లో ఉన్న మన వాళ్ల ఉద్యోగాలు కొంత వరకూ పోయే
ప్రమాదం ఉంది.

Read more about: jobs
English summary

లక్ష మంది భారతీయ ఉద్యోగులకు భయం ! బ్రెగ్జిట్‌ ఎఫెక్ట్ మామూలుగా లేదు | Hundreds of Indian Employees Fear Breastfeed Effect is not Normal

Britain will leave the European Union on March 29. There is a two-month time remaining. If the two parties in the British Parliament are in a mood to reinforce the crisis.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X