For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రానున్న ఐదేళ్లలో ఇండియన్ ఆయిల్ రూ.16,641 కోట్లు పెట్టుబడి?

వచ్చే ఐదేళ్లలో ఇండియన్ ఆయిల్ తమిళనాడు రాష్ట్రం లో రూ.16,641 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది.

By bharath
|

చెన్నై: వచ్చే ఐదేళ్లలో ఇండియన్ ఆయిల్ తమిళనాడు రాష్ట్రం లో రూ.16,641 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది.దీని ద్వారా రూ.20,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను మార్కెటింగ్ మరియు పైప్లైన్ విభాగాలలో సృష్టించబడతాయని సంస్థ తెలిపింది.

రానున్న ఐదేళ్లలో ఇండియన్ ఆయిల్ రూ.16,641 కోట్లు పెట్టుబడి?

ఇందులో రూ.5100 కోట్ల రూపాయలు రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ విస్తరణలో పెట్టుబడి పెట్టనున్నాయి తద్వారా 9000 మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాశాలను మరియు మరో 9000 మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని భావిస్తున్నారు.

వచ్చే మూడు సంవత్సరాలలో ఇండియన్ ఆయిల్ తన నిల్వ మౌలిక సదుపాయాలను, ఇంధన నిర్వహణ సౌకర్యాలను పెట్రోల్ ఆయిల్, లూబ్రికెంట్ టెర్మినల్స్ కొరకు రూ.1824 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా 1000 మందికి పరోక్ష ఉపాధి కల్పనకి దారి తీస్తుంది. తమిళనాడులో ఎల్పిజి మౌలిక సదుపాయాల పెంపు కోసం రూ. 214 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఇండియన్ ఆయిల్ యోచిస్తోంది.

ఇదిలావుంటే, ఇండియన్ ఆయిల్ దాని ఎన్నోర్ ల్యూబ్ కాంప్లెక్స్ ఆధునికీకరణ మరియు సామర్థ్య మెరుగుదలకు రూ.803 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనుంది.

పైప్లైన్ విభాగం విస్తరణలో భాగంగా, మూడు సంవత్సరాలలో గ్యాస్ పంపిణీ యొక్క రెండు మెగా ప్రాజెక్టులలో రూ. 8700 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.ఎన్నోర్- తిరువల్లూర్ - బెంగళూరు - పుదుచ్చేరి - నాగపట్టిణం - మధురై - త్రిచి కి R-LNG గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ డిసెంబరు 2020 నాటికి పూతిచేయాలని దీనికి గాను రూ.4500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపింది.సేలం మరియు కోయంబత్తూరు భౌగోళిక ప్రాంతాలలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం రూ .4,200 కోట్ల పెట్టుబడులతో చేపట్టనుంది.

ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉత్తమమైన ప్రవేశానికి తమిళనాడు రాష్ట్రంతో కలిసి నడిచేందుకు ఇండియన్ ఆయిల్ ముందుకు వచ్చింది.

ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు తరువాత సంవత్సరానికి రాష్ట్ర ఖజానాకు రూ .6800 కోట్లు విరాళంగా ఇస్తూ ఇండియన్ ఆయిల్ తమిళనాడు రాష్ట్ర అభివృద్ధిలో ఒక మెరుగయిన పాత్రను పోషించనుంది అని ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ I / C (తమిళనాడు మరియు పాండి) అన్నారు.

Read more about: ioc tamil nadu
English summary

రానున్న ఐదేళ్లలో ఇండియన్ ఆయిల్ రూ.16,641 కోట్లు పెట్టుబడి? | Indian Oil To Invest Rs 16,641 Crore In Tamil Nadu In Five Years

Chennai: Indian Oil will be investing Rs 16,641 crore in Tamil Nadu in the next five years. The investment, which will create 20,000 direct and indirect employment opportunities, will be made in the marketing as well as pipeline divisions.
Story first published: Thursday, January 24, 2019, 12:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X