For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ తో పోల్చి చూస్తే మంగళవారం రూపాయి పుంజుకుంది.

డిసెంబరు 19 న అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్య విధాన నిర్ణయం నేపథ్యంలో అమెరికా డాలర్ బలహీనపడటంతో మంగళవారం నాడు రూపాయి పుంజుకుంది.

By bharath
|

ముంబయి: డిసెంబరు 19 న అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్య విధాన నిర్ణయం నేపథ్యంలో అమెరికా డాలర్ బలహీనపడటంతో మంగళవారం నాడు రూపాయి పుంజుకుంది.ఉదయం 9.08 గంటలకు డాలర్తో పోల్చుకుంటే రూపాయి 71.34 వద్ద ట్రేడ్ అయింది. తన మునపటి ముగింపు (సోమవారం) స్థాయి 71.55తో పోలిస్తే 0.30 శాతం లాభపడింది. ఇకపోతే రూపాయి మంగళవారం 71.33 వద్ద ప్రారంభమైంది. ఆర్థిక వృద్ధిపై తదుపరి ఫెడరల్ రేట్ పెంపుపై ప్రభావం పడటంతో రెండో రోజు డాలర్ బలహీనపడింది. అలాగే ఫెడరల్‌ రిజర్వు ఏం చెబుతుంది? అమెరికా వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు వంటి అంశాలపై ట్రేడర్లు దృష్టి కేంద్రీకరించారు.

డాలర్ తో పోల్చి చూస్తే మంగళవారం రూపాయి పుంజుకుంది.

10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ దిగుబడి 7.461 శాతంగా ఉంది. బాండ్ దిగుబడి మరియు ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి.

బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 0.16 శాతం లేదా 59.59 పాయింట్లు పెరిగి 36,329.66 పాయింట్లకు చేరింది. ఇప్పటి వరకు ఇది 6.5 శాతం పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి విలువ 10.74 శాతం క్షీణించింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 4.44 బిలియన్ డాలర్లు, 7.34 బిలియన్ డాలర్లు ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విక్రయించారు.

ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇండోనేషియా రూపాయి 0.46%, జపనీస్ యెన్ 0.23%, ఫిలిప్పీన్స్ పెసో 0.20%, థాయ్ భాట్ 0.14%, చైనా ఆఫ్షోర్ 0.13%, దక్షిణ కొరియా 0.1%, చైనా రాంమిబి 0.1%, సింగపూర్ డాలర్లు 0.09% పెరిగాయి.

ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 97.10తో పోలిస్తే 0.02 శాతం క్షీణతతో 97.08 వద్ద ట్రేడవుతోంది.

Read more about: indian rupee dollar
English summary

డాలర్ తో పోల్చి చూస్తే మంగళవారం రూపాయి పుంజుకుంది. | Rupee Inches Higher Against Dollar Ahead Of Fed Decision

Mumbai: The Indian Rupee edged higher on Tuesday as the US dollar weakened ahead of the US Federal Reserve monetary policy decision on 19 December.
Story first published: Tuesday, December 18, 2018, 10:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X