For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు జరగకుంటే... ఆ అకౌంట్ ఏమవుతుందో తెలుసా?

By girish
|

చిట్ ఫండ్ కంపెనీ లేదా ఇన్సూరెన్సు కంపెనీ నుంచి చెక్ వస్తుంది. ఇక మీకు అకౌంట్ ఉంటే తప్ప ఆ చెక్ ని మార్చుకోలేము. ఇంకేముంది అవసరం ఉన్న లేకపోయిన అకౌంట్ ఓపెన్ చేస్తాం.

చెక్:

చెక్:

ఇక చెక్ ను మార్చుకున్నాక ఆ అకౌంట్ తో పని ఐపోతుంది. అసలు అకౌంట్ ఉంది అని చాలామంది మర్చిపోతుంటారు. ఎలాంటి అకౌంట్లు ప్రతి బ్యాంకులో వేల సంఖ్యలో ఉంటాయి అని అంచనా.

RBI:

RBI:

ఇక RBI నిబంధన ప్రకారం ఎలాంటి క్రెడిట్ మరియు డెబిట్ లావాదేవీలు జరగగపోతే అటువంటి అకౌంట్ లను ఇన్ ఆపరేటివ్ అకౌంట్స్ అని అంటారు. ఇలాంటి అకౌంట్స్ విషయంలో RBI బ్యాంకులకు పలు మార్గదర్శకాలని జారీ చేసింది.అవి ఏంటో చూడండి.

ఇన్ ఆపరేటివ్:

ఇన్ ఆపరేటివ్:

లావాదేవీలు జరగని అకౌంట్స్ పై వార్షిక సమీక్షా జరపాలి. అకౌంట్ ఇన్ ఆపరేటివ్ గా ఉంది అని రాతపూర్వకంగా అకౌంట్ వినియోగదారుడు తెలియచేసి అందుకు కారణాలు తెలుసుకోవాలి.

వినియోగదారుడు:

వినియోగదారుడు:

ఏ కారణంతోనైనా వినియోగదారుడు వేరే అకౌంట్ వినియోగిస్తుంటే పాత అకౌంట్ లోని నగదు అందులోకి బదిలీ చేసుకోవచ్చు.

అకౌంట్:

అకౌంట్:

అకౌంట్ వినియోగదారుడికి సమాచారం అందచేసేటప్పుడు ఎలాంటి వివరాలు లభించకపోతే సదరు వ్యక్తి అంటే వినియోగదారుడిని పరిచయం చేసిన వ్యక్తికి సమాచారం ఇవ్వాలి.

గడువు లోపు:

గడువు లోపు:

వినియోగదారుడు అకౌంట్ వాడకపోవడానికి ఏదన్నా కారణాలు చెబితే ఇన్ ఆపరేటివ్ గా ఉన్న అకౌంట్ ని ఏడాది పాటు గడువు విధిస్తు మళ్ళీ అకౌంట్ ని వినియోగించాలి అని సూచించాలి.గడువు లోపు అకౌంట్ ని పట్టించుకోకుండా వదిలేస్తే వాటిని ఇన్ ఆపరేటివ్ అకౌంట్ గా పరిగణలోకి తీసుకోవాలి.

 వడ్డీ :

వడ్డీ :

ఇన్ ఆపరేటివ్ అకౌంట్ గా ప్రకటించే విషయంలో ఖాతాదారుడు చేసి డెబిట్ మరియు క్రెడిట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. బ్యాంకు జమ చేసే వడ్డీ వసూలు చేసే రుసుమును లెక్క లోకి తీసుకోరు.

ఫిక్సడ్ డిపాజిట్:

ఫిక్సడ్ డిపాజిట్:

బ్యాంకు ఫిక్సడ్ డిపాజిట్ వడ్డీ అకౌంట్ లో జమ అవ్వడం భీమా పాలసీ ప్రీమియం కోసం అకౌంట్ లోనుంచి డబ్బు డెబిట్ అవ్వడం వంటి థర్డ్ పార్టీ లావాదేవీలు సైతం అకౌంట్ వినియోగదారుడు జరిపే లావాదేవీలు అవుతాయి.

Read more about: bajaj
English summary

మీ బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు జరగకుంటే... ఆ అకౌంట్ ఏమవుతుందో తెలుసా? | RBI New Rules For Bank Account Holders

The check will come from the company or the insurance company. This check can not be changed unless you have an account. There is no need to open a required account.
Story first published: Tuesday, December 4, 2018, 10:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X