For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రబాబు మరో కొత్త పథకం మరియు చంద్రబాబు నాయుడు పెట్టుబడులు

|

రాష్ట్రంలో పేదలకు అండగా ఉండేందుకే ఆదరణ పథకాన్ని తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఆదరణ-2 కార్యక్రమానికి హాజరైన సీఎం.. పేదరికంపై గెలుపు బ్రోచర్, లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆదరణ లబ్దిదారులకు రుణాలు, పరికరాలు పంపిణీ చేశారు. లబ్దిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు

పథకంలో

పథకంలో

ప్రభుత్వానికి కులం, మతం లేదని ‌పేదలే తమ కులమని చంద్రబాబు అన్నారు. ప్రపంచీకరణ కారణంగా చేతి వృత్తులవారు వెనుకబడ్డారని. అలాంటి వారిని ప్రొత్సహించేందుకే ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. చేతి వృత్తుల వారికి పరికరాలు, రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. అలాగే కాపుల్లో పేదవారిని గుర్తించి సబ్సిడీపై రుణాలు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఈ పథకంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఐవీఆర్ఎస్‌తో లబ్ధిదారుల్ని ఎంపిక చేశామన్నారు.

గత రెండేళ్లలో

గత రెండేళ్లలో

ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు సీఎం. ప్రతి రోజు నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత రెండేళ్లలో వర్షపాతం లోటు ఉన్నా వ్యవసాయం, అనుబంధ రంగాల రాబడి తగ్గకుండా చూశామన్నారు.

మూడు ప్రధాన శాఖలు

మూడు ప్రధాన శాఖలు

గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సలైట్లు అన్యాయంగా చంపారని విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు. కిడారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అలాగే మైనారిటీలకు మూడు ప్రధాన శాఖలు ఇచ్చి గౌరవించామన్నారు.

చంద్రబాబు నాయుడు పెట్టుబడి

చంద్రబాబు నాయుడు పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. 27, 1978 ఫిబ్రవరి 27 న ఆయన చిత్తూరు జిల్లాలోని తన స్థానిక చంద్రగిరి నుండి గెలిచిన తరువాత (అసెంబ్లీ) అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ కు చెందిన అంజాయా క్యాబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు.చంద్రబాబు నాయుడు, ఎన్.టి.రామారావు (ఎన్టీఆర్) కుమార్తెని వివాహం చేసుకుని, తరువాత తెలుగుదేశం పార్టీలో ఒక కీలక పాత్ర పోషించారు.

సర్పంచ్‌ ఎన్నికల

సర్పంచ్‌ ఎన్నికల

ఇప్పుడు సర్పంచ్‌ ఎన్నికలకే ఖర్చు లక్షలు దాటుతోంది! ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలంటే కోట్లే! మరి. 40 ఏళ్ల క్రితం చంద్రగిరి నియోజకవర్గంలో తొలిసారి బరిలోకి దిగిన చంద్రబాబు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? సుమారు రూ.89 వేలు. ఇందులో అధికభాగం ఆయన తండ్రి ఖర్జూర నాయుడు చెరకు పండించి, బెల్లం విక్రయించి ఇచ్చిన డబ్బు. మిగిలినది బాబు మిత్రులు, సన్నిహితులు తలో కొంత పెట్టుకున్నారు

ప్రచారంలో

ప్రచారంలో

ప్రచారంలో పాల్గొనేవారికి చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ కూడా వంటచేసి పెట్టేవారు. ఆ రోజుల్లో హోటళ్లు అందుబాటులో ఉండేవి కావు. ఇంటిదగ్గరే తినేసి బయలుదేరడం, తర్వాత తెలిసిన వారి ఇంట్లో భోజనం చేసేవారు. ఇప్పుడు... ప్రచారానికి వెళ్లాలంటే కార్లూ, జీపులూ ఉండాల్సిందే. అప్పుడు చంద్రబాబు తరఫున ప్రచారంలో రెండు మూడు కార్లు మాత్రమే వాడేవారు. అద్దెకు తీసుకుందామన్నా అందుబాటులో ఉండేవికావు. ఎక్కువగా బైకులు వాడేవారు.

బుల్లెట్‌

బుల్లెట్‌

చంద్రబాబు బుల్లెట్‌, ఎజ్డీ బైక్‌ ఉపయోగించేవారు. బైకులపై ముగ్గురేసి ప్రయాణించేవారు. పోస్టర్లు ముద్రించిన దాఖలాలు లేవు. ఇందిరా కాంగ్రెస్‌ గుర్తు ‘హస్తం'. అరచేతిని ఇంకులో ముంచి గోడలపై అచ్చు కొట్టేవారు.

కొంత మొత్తం

కొంత మొత్తం

అప్పట్లో కొంత మొత్తం పత్రికల్లో ప్రకటనలకు ఖర్చు చేశారు. అప్పట్లో ఓటర్లకు నేరుగా డబ్బులు ఇచ్చే సంస్కృతి లేదు. అయితే, ఎన్నికల సందర్భంగా హడావుడి చేయడం, భోజనాలు పెట్టడం, ప్రయాణాలకు ఖర్చు అయ్యేది. అయినప్పటికీ... చంద్రబాబు తరఫున రూ.89వేలు ఖర్చు చేసినట్లు ఒక అంచనా! నలభై ఏళ్ల క్రితం ఇదేమంత తక్కువ ఖర్చు కాదు!

Read more about: chandrababu naidu
English summary

చంద్రబాబు మరో కొత్త పథకం మరియు చంద్రబాబు నాయుడు పెట్టుబడులు | Chandrababu Naidu New Scheme Adharana

They have come up with the support of the poor in the state, said AP CM Chandrababu. The Chief Minister attended the reception-2 at the Indira Gandhi Municipal Stadium in Vijayawada.
Story first published: Monday, November 12, 2018, 17:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X