For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇచ్చిన నిధులు ఎంతో తెలుసా.

నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని పలుమార్లు ఎన్నికల ముందు సభలలో మోడీ ప్రభుత్వం ఊదరకొట్టింది.The Modi government had promised Special status to AP before 2014 elections.

By bharath
|

నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని పలుమార్లు ఎన్నికల ముందు సభలలో మోడీ ప్రభుత్వం ఊదరకొట్టింది.తిరుపతి సభలో సాక్షాత్తు వెంకన్న సాక్షిగా మోడీ మాట ఇచ్చారు.ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తాం అని పలికారు.రాష్ట్రము విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉంది ఆర్థిక రాబడులు అంతంతమాత్రమే రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అని కేంద్రం గత ఎన్నికల ముందు వాగ్దానం చేసింది.

ప్రత్యేక సహాయం:

ప్రత్యేక సహాయం:

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక సహాయం కింద కేంద్రం లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని పదే పదే చెప్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తీవ్రంగా మండిపడింది,కేంద్రం చెపుతున్న లెక్కలు అన్ని అవాస్తవమని ఇంతవరకు రాష్ట్రానికి ఇచ్చిన సహాయం గురించి మొత్తం లెక్కలు తేల్చి కేంద్రానికి పంపారు.

కేంద్ర ప్రభుత్వం:

కేంద్ర ప్రభుత్వం:

తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత నాలుగున్నర ఏళ్లలో ఎంత నిధులు ఇచ్చింది ప్రకటించింది.రాష్ట్రానికి ఇప్పటిదాకా కేంద్రం రూ.14,310 కోట్లు మాత్రమేనని కేంద్రం తేల్చేసింది.ఇంక ఇంతకు మించి తాము ఎటువంటి సహాయం చేయలేమని చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వం:

రాష్ట్ర ప్రభుత్వం:

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంపై కేంద్రానికి మొరపెట్టుకుంది,రాష్ట్రము అప్పుల్లో ఉందని అభివృద్ధిలో చాలా వెనకపడి ఉన్నాం అని

మౌలికవసతులు కల్పించాలి పొరుగు రాష్ట్రాలతో పాటు అభివృద్ధి చెందేవరకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరింది.

కేంద్రం వైఖరి:

కేంద్రం వైఖరి:

విభజన హామీలు సరిగా అమలు చేయట్లేదని ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం మొండి చెయ్యి చూపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.దీనిపై రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చేసి ఆరు పేజీలతో కూడిన లేఖను కేంద్రానికి పంపింది కానీ కేంద్రం ఓకే ఒక పేజీలో సమాధానం పంపిన తీరు చాల అవమానకరంగా ఉందన్నారు పథ లెక్కలతో ఒక స్టేటస్ నోట్ తయారుచేసి పంపింది.

ఏమి ఇవ్వం:

ఏమి ఇవ్వం:

ఇదివరకు కేంద్రం అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని కాలయాపన చేసి ఉన్నటుండి తాము రాష్ట్రానికి చేయాల్సినవన్నీ చేసాం ఇంక ఏమి చేయం అని మీరడిగే వాటికి మాకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.కేంద్రం ఇచ్చిన లేఖలో ఇప్పటివరకు ఇచ్చిన అరకో నిధుల వివరాలు తప్పా అంశాలవారీగా వివరణ ఇవ్వలేదు.

ఆర్థిక లోటు:

ఆర్థిక లోటు:

విభజన తరువాత రాష్ట్రానికి ఆర్ధిక లోటు రూ.16,000 కోట్ల రూపాయలు ఉంటుందని గవర్నర్ ,ఎజి,కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.ఈ రూ.16,000 కోట్లకు గాను ఈ నాలుగున్నర ఏళ్లలో కేవలం రూ.3,979 కోట్లు మాత్రమే ఇచ్చింది.

తాజాగా పంపిన నోట్:

తాజాగా పంపిన నోట్:

తాజాగా పంపిన నోట్ లో మిగతా నిధులు ఎప్పుడు ఇస్తాం అనే ప్రస్తావన లేదు,అసెంబ్లీ తీర్మానంలో ఆర్థిక లోటు విషయం చాల ప్రధాన అంశం కానీ కేంద్రం దీన్ని గాలికి వదిలేసిందన్నారు.

నిధులు వెనక్కు:

నిధులు వెనక్కు:

రాష్ట్రము లో వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి ఈ ఏడాది ఫిబ్రవరి లో రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుంది.దీనిగురించి స్టేటస్ నోట్ ఎటువంటి సమాధానం లేదు రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చామని వెనకబడిన జిల్లాలకు రూ.1050 కోట్లు అలాగే విజయవాడ,గుంటూరు జిల్లాల్లో డ్రైనేజీ నిర్మాణానికి రూ.1000 కోట్లు ఇచ్చామని మరియు పోలవరానికి రూ.6,764.7 కోట్లు ఇచ్చామని పాత లెక్కలు చెప్పింది.

Read more about: andhra pradesh central govt
English summary

ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇచ్చిన నిధులు ఎంతో తెలుసా. | So Far How Much Funds That Central Given To Andhra Pradesh

The Modi government had promised many times about Special status to AP before 2014 elections.
Story first published: Wednesday, November 7, 2018, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X