For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వ ఉద్యోగం మానేసి కోట్లు సంపాదిస్తున్న నెంబర్ వన్ కుర్రాడు!

By girish
|

మనిషికి చేసే పని మీద తపన చేసే శ్రద్ధ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అది అందరికి మరోసారి నిరూపించాడు ఒక కుర్రాడు ఇక ఈ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం మానేసి మరి ఈ కలబంద వ్యవసాయం చేసాడు కోట్లు సంపాదించాడు.ప్రభుత్వ ఉద్యోగం మానేసి మరి ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడో అందరు తెలుసుకోవలసిన విషయం.

 హరీష్ దండేవ్

హరీష్ దండేవ్

ఇక ఇతని పేరు హరీష్ దండేవ్ రాజస్థాన్ కి చెందిన వాడు తను ఊరిలోనే మునిసిపల్ శాఖలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడే ఆ ఉద్యోగమే చేసుకుంటూ వచ్చాడు అయితే అనుకోకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఉద్యోగం ఎందుకు మానేసావు? ఇంటికి ఎందుకు వచ్చావ్? అదికాక ఇది ప్రభుత్వ ఉద్యోగం ఎంతో కష్టపడితే తప్ప రాదు ఇప్పుడు ఏమి చేయాలి అనుకుంటున్నావు అని హరీష్ తండ్రి ప్రశ్నించాడు.

 వ్యవసాయం

వ్యవసాయం

హరీష్ దానికి సమాధానంగా వ్యవసాయం చేస్తాను అని చెప్పగా మన ప్రాంతంలో వ్యవసాయమ?అసలు ఇక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుంటున్నావా? అని అడిగాడు హరీష్ తండ్రి. అది కాక ఇక్కడ అంత ఇసుక నేలలు వాటిలో నువ్వు ఏ పంట వేసిన పండదు అని తిట్టి మళ్ళీ ఉద్యోగానికి పంపేశాడు హరీష్ తండ్రి.

కలబంద మొక్కలను

కలబంద మొక్కలను

ఈ కలబంద మొక్కలను చాలా వాటిలో వాడుతారు ప్రధానంగా ఆయుర్వేదం లో వాడుతారు ఈ కలబంద మొక్కలకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఇక హరీష్ కొంచెం కూడా ఆలోచించకుండా కలబంద సాగు మొదలుపెట్టాడు.దాదాపు 50 ఎకరాలలో ఈ కలబంద మొక్కలు సాగు చేసాడు.

పతంజలి కంపెనీ

పతంజలి కంపెనీ

అయితే ఇక్కడే హరీష్ నక్క తోక తొక్కాడు అని చెప్పుకోవాలి హరీష్ గురించి తెలుసుకున్న పతంజలి కంపెనీ మరి కొన్ని కంపెనీలు హరీష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.మొత్తం రూ.2 కోట్లు ఇచ్చి మొత్తం సాగును తీసుకున్నారు. ఇక హరీష్ తనకున్న పొలాన్ని కూడా పెంచుకున్నాడు తనకున్న 50 ఎకరాలను 100 ఎకరాలు చేసుకున్నాడు.ఇప్పుడు హరీష్ దగ్గర 200 మంది కూలిలు పని చేస్తున్నారు .

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఇక మన రాష్ట్రంలో ఇప్పుడే రైతులు ఈ కలబంద సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. రంగారెడ్డి , నల్లగొండ, మేడ్చల్ లో మొక్కల సాగు బాగానే పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా మొక్కల పెంపకం ఎక్కువయ్యింది. ఒక ఎకరాకు 800 మొక్కలు పెంచవచ్చు. ఒక మొక్కకు కనీసం 4 ఆకులపైనే ఉంటాయి.

ఆకు బరువు

ఆకు బరువు

ఇక ఒక ఆకు బరువు ఒకటిన్నర కిలో బరువు కూడా ఉంటుంది. ఇక కిలోకి దాదాపుగా రూ.3 నుంచి రూ.4 వరకు అమ్ముతున్నారు. అంటే దాదాపుగా ఎకరాకు రూ.1 .50 లక్షల వరకు సంపాదించవచ్చు.

100 ఎకరాలు

100 ఎకరాలు

మరి హరీష్ దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి అంటే హరీష్ సంపాదన ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి. తనను తిట్టిన తండ్రే ఇప్పుడు గర్వంగా సంబరపడుతున్నాడు. దండగ అన్న వ్యవసాయాన్ని పండగ అనేలా చేసాడు హరీష్.

నచ్చితే

నచ్చితే

ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాధించిన హరీష్ కానీ చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు మా ఉద్దేశం వ్యవసాయం చేయమని కాదు మీకు ఏమి నచ్చితే అది చేయండి.

Read more about: business ideas
English summary

ప్రభుత్వ ఉద్యోగం మానేసి కోట్లు సంపాదిస్తున్న నెంబర్ వన్ కుర్రాడు! | Best Business Ideas for Village Farmers

once again a boy who has stopped the job of the government and made histroy
Story first published: Wednesday, October 17, 2018, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X