For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ కార్డు నెంబర్ చెబితే మీకు అప్పు వస్తుంది అంటా? మీరే చూడండి

By girish
|

ప్రస్తుతం ఇ-కామర్స్ సైట్లు ఫెస్టివల్‌ సేల్‌తో సందడి చేస్తున్నాయి. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ రెండు సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆధార్ నెంబర్‌పై అప్పు ఇవ్వడం యూజర్లను ఆకట్టుకుంటోంది.

ఫ్లిప్‌కార్ట్ - అమెజాన్‌

ఫ్లిప్‌కార్ట్ - అమెజాన్‌

ఇ-కామర్స్ సైట్‌లో ఏదైనా కొనడానికి డబ్బులు లేకపోతే రూ.60,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ ఇస్తున్నాయి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌. ఇందుకోసం యూజర్లు పాన్‌, ఆధార్ నెంబర్లను వెల్లడించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా యూజర్లకు ఎంతవరకు క్రెడిట్ వస్తుందో తెలుస్తుంది.

సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు

ఆధార్ నెంబర్ విషయంలో ఇటీవల రచ్చరచ్చైంది. ప్రైవేట్ కంపెనీలు ఆధార్ నెంబర్ తీసుకోకూడదని ఏకంగా సుప్రీం కోర్టే చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మామూలుగానే ఉంది. తమ యూజర్లకు అప్పు ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు వెరిఫికేషన్ కోసం ఆధార్ నెంబర్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆధార్ నెంబర్‌పై ఏకంగా అప్పులే ఇస్తుండటం, యూజర్లు కూడా ఆధార్ నెంబర్ వెల్లడిస్తుండటం చూస్తుంటే ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సీరియస్‌గా తీసుకోలేదా అన్న వాదన తెరపైకి వస్తోంది.

ఆధార్ కార్డు ఎలా డీలింక్ చేసుకోవాలో మీకు తెలుసా?ఒకసారి లుక్ వేయండి.

ఆధార్ కార్డు ఎలా డీలింక్ చేసుకోవాలో మీకు తెలుసా?ఒకసారి లుక్ వేయండి.

ఆధార్ గురించి నిన్న సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అందరూ ఆధార్ జపం చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ వ్యాలెట్లకు ఆధార్ అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడంతో ఇప్పటివరకు తాము ఎక్కడెక్కడ ఆధార్ కార్డు ఇచ్చామా అని అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు గతంలోనే ఆధార్ లింక్ చేసినట్టైతే డీలింక్ ఎలా చేయాలన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

వెబ్‌సైట్‌లో

వెబ్‌సైట్‌లో

అలాంటివారికోసమే ఈ మా చిన్న ప్రయత్నం తెలుసుకోండి. మీరు ఆధార్ కార్డును ఎక్కడ ఇచ్చినా సరే ఇప్పుడు డీలింక్ చేసుకోవచ్చు. మీరు సర్వీస్ ప్రొవైడర్లకు, ఆథరైజ్డ్ ఏజెన్సీలకు ఇచ్చిన బయోమెట్రిక్ వివరాలను డీలింక్ చేసుకోవచ్చని యూఐఓడీఐ కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. ఇదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. కాకపోతే ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డు ఎలా డీలింక్ చేయాలో చూడండి

ఆధార్ కార్డు ఎలా డీలింక్ చేయాలో చూడండి

  • అంతకుముందు ఇచ్చిన ఆధార్ వివరాలను ఉపసంహరించాలని కోరుతూ దరఖాస్తు ఇవ్వాలి. మరిన్ని వివరాల కోసం బ్యాంకు కస్టమర్ కేర్‌ నెంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది
  • . బ్యాంకులో దరఖాస్తు చేసిన 48 గంటల్లో ఆధార్ డీలింక్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్‌ నుంచి ఆధార్ డీలింక్ అయిందో లేదో కాల్ చేసి తెలుసుకోవచ్చు.
  • టెలికామ్ ఆపరేటర్లకు కూడా ఆధార్ డీలింక్ చేయమని ఇలాగే దరఖాస్తు ఇవ్వాలి. ఓలా, పేటీఎం లాంటి ప్రైవేట్ వ్యాలెట్ సంస్థలకు కూడా కాల్ చేసి డీలింక్ చేయమని అడగొచ్చు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పినట్టుగా ఆధార్ డీలింక్ కోరుతూ ఇ-మెయిల్ పంపాల్సి ఉంటుంది.
  • మీరు పంపిన రిక్వెస్ట్ ఇ-మెయిల్‌కు కంపెనీ నుంచి రిప్లై వస్తుంది. ఇందుకోసం మీ ఆధార్ సాఫ్ట్ కాపీని ఇ-మెయిల్‌లో అటాచ్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత 72 గంటల్లో మీ ఆధార్ డీలింక్ చేసినట్టు కంపెనీ కన్ఫర్మేషన్ ఇ-మెయిల్ పంపిస్తుంది. ఆ తర్వాత మీ పేటీఎం అకౌంట్ ఓపెన్ చేసి ఆధార్ డీలింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి.
  • ఇకపై పేటీఎం, అమెజాన్ పే లాంటి వ్యాలెట్లు ఆధార్ అడిగితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. టెలికామ్ సంస్థలు కూడా మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింక్ చేయమని కోరవు

Read more about: aadhar card
English summary

ఆధార్ కార్డు నెంబర్ చెబితే మీకు అప్పు వస్తుంది అంటా? మీరే చూడండి | Flipkart and Amzon Giving Loans Through Aadhar Number

Currently e-commerce sites are celebrating Festival Sale. Big Billion Days Sale is on the Great Indian Festival Sale in Amazon, Flipcard
Story first published: Thursday, October 11, 2018, 14:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X