For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలు అమ్ముతూ నెలకి లక్షలు సంపాదిస్తున్న గ్రామస్థులు! ఇంతకీ ఏ గ్రామంలో తెలుసా?

By Sabari
|

అదో చిన్న పల్లెటూరు అక్కడ ఒక వంద కుటుంబాలు ఉంటాయి అందరు చిన్న రైతులే కానీ ఇక్కడ రైతులు పేదరికంతో మగ్గిపోలేదు.అప్పుల ఊబిలో కురుకుపోలేదు చదువుకోకపోయినా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లాగా సంపాదించుకుంటున్నాము అని గర్వాంగా చెబుతున్నారు. ఇంతకీ ఈ ఊరి ఆదాయం తెలుసా అక్షరాలా అరకోటి.

రాయలసీమ ప్రాంతంలో

రాయలసీమ ప్రాంతంలో

ఈ విషయం ఎలా సాధ్యం అయ్యింది అంటే పెట్టుబడి పెట్టి , కూలీలను పెట్టుకొని, పంట వేస్తే సరైన సమయంలో వర్షాలు పడకపోతే ఒక బాధ, పంట చేతికి వచ్చేసరికి పడితే మరో బాధ ఇక చీడ పీడలతో తంటాలు ఇక సరైన దిగుబడి వస్తుందో లేదో అని దిగులు అలాగే ఇక అన్ని బాగున్నా గిట్టుబాటు ధర లేకపోతే కష్టమంతా బూడిద పాలే రైతుకు మిగిలేది కన్నీరే వర్షాలు ఎక్కువ పడని రాయలసీమ ప్రాంతంలో ఈ సమస్యలు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి.

చిత్తూర్ జిల్లా

చిత్తూర్ జిల్లా

రాయలసీమలోని చిత్తూర్ జిల్లా మోటుకు గ్రామం కూడా అందుకు మినహాయింపు కాదు.ఇలాంటి కరువు పరిస్థిలలో గ్రామం లోని కొంత మంది రైతులు వ్యవసాయం వదిలేసి జెర్సీ ఆవులను కొని పాడి పరిశ్రమలవైపు మొగ్గు చూపారు. ఇక ఈ పాడి పరిశ్రమలలో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు కూలీలా అవసరం ఉండదు నెలానెలా ఆదాయం కచ్చితంగా వస్తుంది. దాంతో ఈ జెర్సీ ఆవులను కొన్న రైతులు ఆర్ధికంగా బాగా స్థిరపడ్డారు. అది చూసి మిగతా గ్రామస్థులు అంతా వీళ్ళ బాటలోనే వెళ్లారు

1975

1975

ఆలా 1975 ప్రాంతంలో ఒకరితో ప్రారంభమైన ఈ పాడి పరిశ్రమ తర్వాత తర్వాత ఆ ఊరు అంతా పాకింది . ఇప్పుడు అక్కడ ఒక్కో కుటుంబం 5 నుంచి 6 జెర్సీ ఆవులను పెంచుకుంటున్నారు. ఉదయం మరియు సాయంత్రం వాటి నుంచి రోజుకి 40 నుండి 70 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక ఆ ఊరు మొత్తం కలుపుకుంటే రోజుకి 4 నుంచి 5 వేల లీటర్లు డైరీలకు పోస్తారు.

ఊరు మొత్తానికి

ఊరు మొత్తానికి

మాములుగా ఒక పల్లె అయితే 15 రోజులకి వచ్చే పాల బిల్లు ఊరి మొత్తానికి కలిపి లక్ష లేదా 2 లక్షల రూపాయిలు ఉంటాయి. కానీ ఇక్కడ వింత ఏమిటి అంటే కేవలం మోటుకులో మాత్రమే ఒక కుటుంబం రూ.30 వేలు నుంచి రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నారు. ఇక ఊరు మొత్తానికి వచ్చే పాల బిల్లు అయితే రూ.50 లక్షలు దాటుతోంది.

పాడి పరిశ్రమ

పాడి పరిశ్రమ

ఆగష్టు మరియు సెప్టెంబర్ మధ్య జెర్సీ ఆవులు పాలు ఎక్కువగా ఇస్తాయి.కాబ్బటి ఆ సమయంలో పాలు దిగుబడి ఒక 1000 లీటర్లకి పెరిగి ఆదాయం ఇంకా పెరుగుతుంది . ఇక కొత్త వాళ్ళు ఎవరన్నా మోటుకుకి వస్తే ఆ ఊరికి పాడి పరిశ్రమ చూసి ఆశ్చర్య పోతారు .వంద ఇల్లు ఉన్న ఆ ఊరులో 1000 కి పైగా ఆవులు, దూడలు ఉన్నాయి అంటే ఇక ఆ ఊరి పాడి పరిశ్రమ ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకోండి.

 రైతులు

రైతులు

జెర్సీ ఆవుల ధర ఎక్కువే అయిన పూటకి 5 నుంచి 15 లీటర్ల వరకు పాలను ఇస్తుంది. కాబ్బటి లాభం ఎక్కువ ఉంటుంది అని ఈ గ్రామంలో వారందరూ జెర్సీ అవునే పెంచుతున్నారు అంతే కాదు ఇక్కడ రైతులు జెర్సీ ఆవులకు కావలసిన గడ్డిని తమ పొలంలోనే పెంచుతున్నారు. దీనివల్ల గడ్డి కొనే ఖర్చు కూడా తగ్గుతోంది.

పొలం

పొలం

రూ.80000 పెట్టుబడి పెట్టి రెండు ఎకరాలలో వంకాయ పంటను సాగు చేస్తే ధరలు లేక పొలం మీదే వదిలేయాలిసి వస్తోంది. చివరికి మెత్తగా అయిన ఉపయోగపడుతుంది అని పశువుల్ని పంటలోకి వదులుతాం. అదే పాడి పరిశ్రమలో అయితే మనం పడిన కష్టానికి కచ్చితంగా ఫలితం వస్తుంది.

 ఒక రైతు

ఒక రైతు

ఆ గ్రామానికి చెందిన ఒక రైతు ఏమన్నాడు అంటే తనకు ఉన్న రెండు ఎకరాలు చాలా ఏళ్ల నుంచి పంట పండిస్తున్న అయనకు నష్టాలు తప్పలేదు అంటా అందుకే తనకు ఉన్న రెండు ఎకరాలలో ఆవులకి మేతగా గడ్డి పండిస్తూ పాడి పరిశ్రమనే నమ్ముకున్న నెలనెలా మంచి లాభాలతో డబ్బు సంపాదించుకుంటున్న అని అన్నాడు.

 చెన్నైలో సాఫ్ట్ వేర్

చెన్నైలో సాఫ్ట్ వేర్

తన ఇంటర్మీడియట్ అయిపోయాక తన తండ్రి మరణించాడు దంతో తన చదువు నిలిపేయాల్సి వచ్చింది. ఇక మొదటిలో వ్యవసాయం చేసా లాభాలు రాలేదు. ఇక ఏమి చేయాలో తేలిక తన స్నేహితుడు మాట విని 5 జెర్సీ ఆవులను కొన్నాడు. ఇక ఇప్పుడు రోజుకి 40 లీటర్ల పాలు అమ్ముతూ చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తన తమ్ముడి సంపందనతో పోటీ పడుతున్న అని చెప్పాడు.

పాడి పరిశ్రమని

పాడి పరిశ్రమని

పాడి పరిశ్రమని నమ్ముకున్న కనుకే ఉద్యోగం లేదు అని బాధ కూడా లేదు పైగా ఉదయం రెండు గంటలు మరియు సాయంత్రం రెండు గంటలు ఎక్కువ పని ఉంటుంది అంతే ఇక మిగిలిన సమయంలో వేరే పని చేసుకోవచ్చు.

ఎందరికో స్ఫూర్తి

ఎందరికో స్ఫూర్తి

ఇది రాయలసీమ ప్రాంతంలో చిత్తూర్ జిల్లా మోటుకు గ్రామానికి సంబంధించిన పాడి పరిశ్రమ వ్యాపారం ఇలా పాడి పరిశ్రమని నమ్ముకొని ఈ ఊరిలో తమ పిల్లలని బాగా ఉన్నతమైన చదువులు చదివించి మంచి స్థాయిలో చూసుకుంటుంటున్నారు. అందుకే పాడి పరిశ్రమతో వారు సంపాధించిన విజయం ఎందరికో స్ఫూర్తి మంత్రం అవుతోంది.

Read more about: business ideas
English summary

పాలు అమ్ముతూ నెలకి లక్షలు సంపాదిస్తున్న గ్రామస్థులు! ఇంతకీ ఏ గ్రామంలో తెలుసా? | Village People Earning More Money with Milk Business

There is a small village where a hundred families are all small farmers but farmers are not poverty. And you know this town income is literally a half.
Story first published: Thursday, September 6, 2018, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X