For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక పై సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కష్టాలు తప్పవ మీరే చూడండి.

By Sabari
|

ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ (ఐటి) రంగపు కంపెనీల్లో కొత్త కొలువుల కోసం ఎదురు చూస్తున్న వారికి చేదు వార్త.

ఐటీ రంగంలో

ఐటీ రంగంలో

ఐటీ రంగంలో ఈ ఏడాది కూడా ఆశించిన గరిష్ట స్థాయిలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రాకపోచ్చని ఐటి పరిశ్రమల సమాఖ్య నాస్కామ్‌ అభిప్రాయపడింది. 2018 తొలి త్రైమాసికంలో టాప్‌ ఐటి కంపెనీలు మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికీ.. పరిశ్రమ నియామకాలు ఆశించిన గరిష్ట స్థాయిలో ఉండవని నాస్కామ్‌ జరిపిన అధ్యయనంతో తేలింది.

ముఖ్యంగా

ముఖ్యంగా

ముఖ్యంగా టిసిఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి దేశీయ టాప్‌ ఐటి కంపెనీల తొలి త్రైమాసికానికి ఆశాజనకమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.. ఆ సంస్థలు కొత్తవారిని కొలువుల్లోకి తీసుకునే విషయంలో అనాసక్తతతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

కేవలం లక్ష

కేవలం లక్ష

బదులుగా ఉన్న వాళ్లతోనే గరిష్టంగా పనులు చేయించుకోవాలని యోచిస్తున్నట్టుగా ఆధ్యయనంలో తేలింది. నాస్కామ్‌ విశ్లేషణ ప్రకారం ఐటి పరిశ్రమ 2018-19లో కొత్తగా కేవలం లక్ష కొత్త ఉద్యోగాలను మాత్రమే అందుబాటులోకి రానున్నట్టుగా సమాచారం

గత ఏడాది

గత ఏడాది

గత ఏడాది జూన్‌లో ఐటి, బిపిఎం పరిశ్రమలలో 1.3-1.5 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని నాస్కామ్‌ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఈ అంచనాలకు తల కిందులై కేవలం లక్షకు లోపే నియామకాలే నమోదు అయ్యాయి.

ఈ లెక్కల ప్రకారం

ఈ లెక్కల ప్రకారం

ఈ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు ఫ్లాట్‌గా ఉండనున్నాని అంచనా. అయితే 2016-17లో పరిశ్రమ నికర నియామకాలు 1.7 లక్షలుగా ఉండటం గమనార్హం.

అంతా ఇప్పుడు ఈ టెక్నాలజీ కావాలి అంటున్నారు.

అంతా ఇప్పుడు ఈ టెక్నాలజీ కావాలి అంటున్నారు.

సంప్రదాయక కొలువుల్లోకి కొత్తవారిని తీసుకొనే బదులుగా వారి పనిని ఇతరులతో చేయిస్తూ కృత్తిమ మేథస్సు విభాగంలో ఎక్కువగా కొత్తస్టాఫ్‌ను తీసుకోవాలని ఐటీ సంస్థలు భావిస్తున్నట్టుగా సమాచారం

కొత్త ఉద్యోగాలు

కొత్త ఉద్యోగాలు

ఐటి రంగంలో కొత్త ఉద్యోగాలు ఎక్కువగా కృత్రిమ మేథస్సు (ఎఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఒటి), బిగ్‌ బేటా ఎనలటిక్స్‌ (బిడిఎ) వైపు మళ్లనున్నాయని నాస్కామ్‌ మాజీ అధ్యక్షులు డెబ్జానీ ఘోష్‌ వ్యాఖ్యానించారు. ఈ విభాగాల్లో 2018లో మొత్తం కొలువులు డిమాండ్‌ 5.11 లక్షల ఉద్యోగాల వరకు ఉందని తెలిపారు. ఇది 2021నాటికి 7.86 లక్షలకు చేరుకుంటుం దని వివరించారు

 సైబర్‌ సెక్యూరిటీ

సైబర్‌ సెక్యూరిటీ

సైబర్‌ సెక్యూరిటీ రంగం కూడా మెరు గైన ఉపాధి అవకాశాలు రానున్నట్టుగా తమ అధ్యయనం ద్వారా తెలుస్తోందని ఆమె వివరించారు. చెన్నైలో జరిగిన నాస్కామ్‌ హెచ్‌ఆర్‌ సదస్సులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ పరిశ్రమలో ఏడాది చివరి నాటికి దాదాపు 40 లక్షల మంది ఉద్యోగులుంటారని తాము భావిస్తున్నామ న్నారు.

 నిపుణుల అభిప్రాయం

నిపుణుల అభిప్రాయం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న ఆటోమేషన్‌ ప్రక్రియ, వ్యయాలను తగ్గించుకునే కంపెనీ ప్రయత్నాలు దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి

Read more about: jobs
English summary

ఇక పై సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కష్టాలు తప్పవ మీరే చూడండి. | Touch Time to Who Are Trying for Software Job

Bitter news for those who look forward to new companies in the Information Technology (IT) sector
Story first published: Wednesday, August 1, 2018, 13:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X