For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం సవరించింది.

సుకున్య సమృద్ధి యోజన కింద ఖాతాలకు కనీస వార్షిక డిపాజిట్ అవసరాన్ని రూ .1000 నుంచి రూ. 250 కు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

|

సుకున్య సమృద్ధి యోజన కింద ఖాతాలకు కనీస వార్షిక డిపాజిట్ అవసరాన్ని రూ .1000 నుంచి రూ. 250 కు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల బాలికా పొదుపు పథకం ప్రయోజనం కోసం అధిక సంక్యలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనీ నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం సవరించింది.

ఖాతాను తెరవడానికి కనీస ప్రాథమిక డిపాజిట్ 250 రూపాయలని ప్రభుత్వం సూచిస్తూ సుకున్య సమృద్ధి ఖాతా నిబంధనలను 2016 ను సవరించింది. ప్రతి సంవత్సరం ఖాతాలో కనీస డిపాజిట్ రూ.1,000 నుండి 250 రూపాయలకు తగ్గించింది.

2018-19 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ 2015 జనవరిలో ప్రారంభించిన సుకన్య సమృద్ధి ఖాతా పథకం "గొప్ప విజయాన్ని" సాధించింది అని వెల్లడించారు.

2017 నవంబర్ వరకూ, దేశవ్యాప్తంగా ఆడ పిల్లల సంఖ్యలో 1.26 కోట్ల కంటే ఎక్కువ ఖాతాలు తెరవగా, రూ.19,183 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంతరించుకున్నామని జైట్లీ చెప్పారు.

ఇతర పొదుపు పథకాలు మరియు పిపిఎఫ్ల లాగానే ప్రతి త్రైమాసికానికి సుకన్య సమృద్ధి ఖాతాలో కూడా వడ్డీ రేటు సవరించబడింది.జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో, రేటు 8.1 శాతంగా నిర్ణయించబడింది.

పథకం కింద, ఒక పేరెంట్ లేదా చట్టపరమైన సంరక్షకుడు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆడపిల్లల పేరుతో ఒక ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం గురించి ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఏ పోస్ట్ ఆఫీస్ శాఖలోనూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ ఖాతా తెరవవచ్చు.

ఖాతాకు ఇచ్చిన నిక్షేపాలు మరియు ఆదాయం మరియు మెచ్యూరిటీ మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80 సి కింద పూర్తిగా పన్ను మినహాయించబడతాయి.

ఈ పథకం ప్రకారం,ఖాతా ప్రారంభమైన తేదీ నుండి 21 సంవత్సరాల వరకు చెల్లుతుంది, ఆ తరువాత ఇది పరిపక్వం చెందుతుంది మరియు ఆ ఖాతా తెరవబడిన పేజిలో పేర్కొన్న పేరు పెట్టబడిన అమ్మాయికి చెల్లించబడుతుంది.

English summary

కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం సవరించింది. | Sukanya Samriddhi Yojana Rules Changed! Modi Govt Reduces Minimum Deposits To Rs 250

The government has slashed the minimum annual deposit requirement for accounts under the Sukanya Samriddhi Yojana to Rs 250 from Rs 1,000 earlier.
Story first published: Monday, July 23, 2018, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X