For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దేశాలలో ప్రజలు ఆదాయపు పన్ను కట్టనవసరం లేదంటా ఇంతకీ ఏ దేశంలో చూద్దామా!

By Sabari
|

ఇండియాలో ఇప్పుడందరూ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేసే హడావుడిలో ఉన్నారు. అసలు కొన్ని దేశాల్లో ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ తలనొప్పే ఉండదు. అవును మీరు విన్నది నిజమే. అక్కడి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అందులో 10 దేశాలేంటో చూడండి.

1. బహమాస్:

1. బహమాస్:

కరీబియన్ స్వర్గధామం. వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్ ఆదాయం లాంటి ఆర్జనలపై ఎలాంటి పన్నులు ఉండవు. ఇక్కడి ప్రభుత్వ ఆదాయ వనరు పర్యాటకం. దాంతో పాటు కొన్ని పరోక్ష పన్నులు, ఆస్తిపన్నులు కూడా ఖజానాను నింపుతాయి.

2. బహ్రెయిన్:

2. బహ్రెయిన్:

మధ్యప్రాచ్య దేశమిది. చమురు నిల్వలు ఎక్కువ. ఇక్కడ కూడా వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయంపై ఎలాంటి పన్నులు లేవు. మూలవేతనంలో యజమానులు తొమ్మిది శాతం, ఉద్యోగులు ఆరు శాతం చొప్పున సామాజిక భద్రత కోసం చెల్లిస్తారు.(భారతదేశంలో ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ లాగా.)

3. బ్రూనే:

3. బ్రూనే:

ఇక్కడ రాచరిక వ్యవస్థే ఉన్నా... పన్నుల విషయంలో పౌరులకు అస్సలు భారం ఉండదు. పసిఫిక్ మహాసముద్రతీరంలో ఉన్న ఈ దేశం కార్పొరేట్ లాభాలపై 18.5 శాతం పన్నులు విధిస్తుంది. దాంతో పాటు ఆస్తి, వాహనాల పన్నులు వసూలు చేస్తోంది.

4. కువైట్:

4. కువైట్:

ఈ దేశంలో ఆరు శాతం చమురు నిల్వలున్నాయి. చమురు అమ్మకాలతోనే ప్రభుత్వానికి 90 శాతం ఆదాయం లభిస్తుంది. అందుకే ఇక్కడ పౌరుల నుంచి పన్నుల వసూలు ఉండదు. విదేశీ కంపెనీల కార్పొరేట్ ఆదాయంపై 15 శాతం పన్నులు వసూలు చేస్తారు.

5. ఒమన్:

5. ఒమన్:

చమురు నిల్వలతో సుసంపన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. పౌరుల నుంచి ఆదాయపు పన్నులు వసూలు చేయదు ఈ కంపెనీ. అయితే వ్యాపారుల నుంచి 15 శాతం, చమురు అమ్మే కంపెనీల నుంచి 55 శాతం పన్నులు వసూలు చేస్తారు. 50,000 ఒమన్ రియాల్స్‌ కన్నా తక్కువ పెట్టుబడి ఉన్న వ్యాపారులు నుంచి 3 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

6. ఖతార్:

6. ఖతార్:

ఇది కూడా మధ్య ప్రాచ్య దేశమే. ఇక్కడ కూడా పౌరులు ఆదాయపు పన్ను చెల్లించరు. 10 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్, పెట్రోలియం రంగంలోని కంపెనీలు 35 శాతం పన్ను చెల్లిస్తారు.

7. సౌదీ అరేబియా:

7. సౌదీ అరేబియా:

అరబ్‌లో ఇది రెండో అతిపెద్ద దేశం. ఇక్కడ ఆదాయపు పన్నులుండవు. కార్పొరేట్, నాన్‌సౌదీ షేర్స్‌పై వచ్చిన ఆదాయంపై 20 శాతం పన్ను చెల్లించాలి. సౌదీ షేర్ హోల్డర్లు మాత్రం 2.5 శాతం రిలీజియస్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఇక సహజ వాయువు, చమురు కంపెనీలు 30-85 శాతం మధ్య పన్నులు చెల్లిస్తాయి.

8. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్:

8. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్:

గల్ఫ్‌లో విభిన్న ఆర్థిక వ్యవస్థ గల యూఏఈ 30 శాతం చమురు, సహజవాయువుల నుంచే ఆదాయాన్ని పొందుతుంది. వ్యక్తిగతమైనా, కార్పొరేట్ అయినా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆయిల్, గ్యాస్, ఫైనాన్స్ సెక్టార్ల నుంచి పన్నులు వసూలు చేస్తారు. ఫారిన్ బ్యాంకుల బ్రాంచ్‌ల నుంచి 20 శాతం, పెట్రోలియం కంపెనీల నుంచి 55 శాతం పన్నులు వసూలు చేస్తారు.

9. బెర్ముడా:

9. బెర్ముడా:

ఇది దేశం కాకపోయినా యూనైటెడ్ కింగ్డమ్‌లోని స్వతంత్ర భూభాగం. ఫైనాన్షియల్ సర్వీసెస్ సంపెనీల నుంచి ఆదాయం లభిస్తుంది. ఇక్కడ వ్యక్తిగత, కార్పొరేట్ పన్నులు లేవు. ఉద్యోగికి చెల్లించిన మొత్తంలోంచి 15.5 శాతం పేరోల్ ట్యాక్స్ వసూలు చేసుంది.

10. కేమాన్ దీవులు

10. కేమాన్ దీవులు

ఇక్కడ కూడా పన్నులేమీ ఉండవు. రియల్ ఎస్టేట్‌ లావాదేవీలపై స్టాంప్ డ్యూటీలు వసూలు చేస్తారు.

Read more about: income tax
English summary

ఈ దేశాలలో ప్రజలు ఆదాయపు పన్ను కట్టనవసరం లేదంటా ఇంతకీ ఏ దేశంలో చూద్దామా! | People No Need to Pay Income Tax in These Countries

In India, all are currently in Income Tax Returns file. Income tags will not be the same in some countries. Yes it is true that you heard it. People do not have to pay taxes on the hard earned money. See 10 countries in it.
Story first published: Thursday, July 19, 2018, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X