For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వల్ల కలిగే 10 లాభాలు మీకోసమే చూడండి.

By Sabari
|

మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రారా? అయినా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయండి. దీని వల్ల చాలా లాభాలున్నాయి. అందులో 10 లభాలేంటో తెలుసుకోండి.

 ఆదాయపు పన్ను

ఆదాయపు పన్ను

తమ వేతనాలు ఆదాయపు పన్ను పరిధిలోకి రావని చాలామంది ఉద్యోగులు అనుకుంటారు. తాము ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటారు. కానీ అది నిజం కాదు.

ఐటీఆర్ ఫైల్

ఐటీఆర్ ఫైల్

ఉద్యోగంలో చేరినప్పటి నుంచి లేదా మరే ఆదాయం వస్తున్నా ఐటీఆర్ ఫైల్ చేయాలి. వచ్చిన ఆదాయమెంత? కట్టిన పన్నులెంత? అన్న లెక్కలు ఐటీఆర్‌లో చూపించడం మంచి పౌరుడి లక్షణమని అంటుంటారు నిపుణులు

లాభాలేంటంటే

లాభాలేంటంటే

అందుకే ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాలని చెబుతుంటారు. దాని వల్ల లాభాలేంటంటే

1.ఐటీఆర్

1.ఐటీఆర్

ఐటీఆర్ రసీదు ఉండటం ఫామ్ 16 కన్నా ఎక్కువ ఉపయోగకరం. మీకు ఆదాయం వచ్చే మార్గాలు, పన్నుల వివరాలన్నీ అందులో ఉంటాయి

2. రిజిస్టర్డ్ అడ్రస్‌

2. రిజిస్టర్డ్ అడ్రస్‌

ఐటీఆర్ రసీదు మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు పంపిస్తారు. ఆ రసీదును నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చు.

 3.బ్యాంకులో

3.బ్యాంకులో

మీరు బ్యాంకులో హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్‌లాంటి రుణాలకు దరఖాస్తు చేసినప్పుడు మీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వివరాల ఆధారంగా మీకు ఆదాయం వచ్చే మార్గాలను బ్యాంకు అధికారులు సులువుగా లెక్కించగలరు.

4. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే

4. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే

మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, మీ గత ఆర్థిక సంవత్సరంలోని ఖర్చులు/నష్టాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి మార్చుకోలేరు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, నష్టాల వివరాలను భవిష్యత్తు సంవత్సరాలకు మార్చుకోలేరు. అందుకే అలాంటి నష్టాలు భవిష్యత్తులో అడ్జస్ట్ చేసుకోవాలంటే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది

 5 ఫిక్స్‌డిపాజిట్లపై

5 ఫిక్స్‌డిపాజిట్లపై

ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆ ఆలస్యానికి పన్నుపై నెలకు 1% చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు నిర్దిష్ట స్థాయిని మించిన ఫిక్స్‌డిపాజిట్లపై వచ్చిన వడ్డీ నుంచి పన్నును తీసివేస్తాయి. ఆ పన్ను రీఫండ్ పొందాలనుకుంటే ఐటీఆర్ అవసరం.

 జరిమానా

జరిమానా

2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూ.10,000 జరిమానా విధిస్తారు. తర్వాతి సంవత్సరాల్లో కూడా ఆ రిమార్క్ అలాగే ఉంటుంది.

7. క్రెడిట్ కార్డ్

7. క్రెడిట్ కార్డ్

మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే బ్యాంకులు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తిరస్కరించే అవకాశముంది.

8.ట్యాక్స్ రిటర్న్స్

8.ట్యాక్స్ రిటర్న్స్

గతంలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన కాపీలను వీసా అధికారులు అడిగే అవకాశముంది. యూఎస్, యూకె, కెనెడా లాంటి దౌత్య కార్యాలయాలు ఫారిన్ వీసా అప్లికేషన్‌ ప్రాసెస్‌లో భాగంగా మీ ఐటీఆర్ గురించి పరిశీలించి చూస్తారు.

9.ఇన్సూరెన్స్ పాలసీ

9.ఇన్సూరెన్స్ పాలసీ

ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఇబ్బందులొస్తాయి. మీరు పన్ను ఎగ్గొట్టేవారి జాబితాలో ఉన్నారన్న అనుమానం వస్తే మీకు ఎక్కువ మొత్తంలో జీవిత బీమా ఇవ్వరు.

10.ఫామ్16

10.ఫామ్16

ఫ్రీ లాన్సర్, స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఫామ్16 ఉండదు. అలాంటివారికి ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. వారి దగ్గర ఉండే ఒకే డాక్యుమెంట్ ఇది. లేకపోతే లోన్లు, ఇతర లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది

Read more about: income tax
English summary

ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వల్ల కలిగే 10 లాభాలు మీకోసమే చూడండి. | Ten Benefits with Income Tax Filing

Do you have an income tax? Fill Income Tax Returns. This has a lot of benefits. Find out about 10 of them.
Story first published: Wednesday, July 11, 2018, 10:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X