For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ED గణాంకాల ప్రకారం విజయ్ మాల్యా IPL లో బెంగుళూరు జట్టు పై ఎంత వెచ్చించాడో తెలుసా?

వ్యాపారవేత్త విజయ్ మాల్యా, యుబి(UB ) హోల్డింగ్స్, ప్రస్తుతం అమలులో లేని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్తో పాటు మరి కొన్ని వాటిపై సుమారు రూ. 9,990 కోట్ల అక్రమంగా డబ్బుని వెచ్చించాడనే అభియోగం పై ఎన్ఫోర్స్మెంట్

|

ముంబై: వ్యాపారవేత్త విజయ్ మాల్యా, యుబి(UB ) హోల్డింగ్స్, ప్రస్తుతం అమలులో లేని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్తో పాటు మరి కొన్ని వాటిపై సుమారు రూ. 9,990 కోట్ల అక్రమంగా డబ్బుని వెచ్చించాడనే అభియోగం పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రత్యేక కోర్టులో రెండో చార్జిషీట్ను సమర్పించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియం నుండి మిగతా 17 బ్యాంకుల నుండి రుణాలు పొందినట్టు చెప్పారు.

ED గణాంకాల ప్రకారం విజయ్ మాల్యా IPL లో బెంగుళూరు జట్టు పై ఎంత వెచ్చించాడో తెలుసా?

మాల్యా తన ఫోర్స్ ఇండియా ఫార్ములా 1 టీం (లండన్ లో ఒక ప్రైవేట్ రిజిస్టర్డ్ కంపెనీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఐపిఎల్ టీం)లను నగదు లాండరింగ్ కోసం ఉపయోగించారని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

ఒక ఏడాది క్రితం, ED మాల్యాకి వ్యతిరేకంగా మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసింది
ఐడిబిఐ బ్యాంక్ నుండి రూ .900 కోట్లు రుణాలు ఎగవేతకు గాను మరో ఎనిమిదిమంది పై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

మాల్య నియంత్రణలో ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, రూ .6,027 కోట్ల రుణాలను తీసుకుంది. ఈ మేరకు, 2018 మే 15 వ తేదీ వరకు వడ్డీ కలిపితే మొత్తం రూ. 9,990 కోట్లు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బ్రాండ్ హామీ, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యొక్క నిర్వహణ ఖర్చులకు రుణం తీసుకోబడింది, కాని అది ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది, వీటిలో మాల్య యొక్క వ్యక్తిగత ఉపయోగం కోసం చార్టెడ్ ఎయిర్క్రాఫ్ట్ సేకరణలు కూడా ఉన్నాయి.

మాల్య షెల్ కంపెనీల సహాయంతో తన అధీనంలో పనిచేస్తున్న డమ్మి డైరెక్టర్స్ ఉపయోగించి పెద్ద మొత్తం లో రుణ డబ్బును తీసుకున్నట్లు పేర్కొంది. అతను ఈ కంపెనీల పేర్లతో ఆస్తులు కూడా సేకరించాడు.ఛార్జ్ షీట్ లో పేర్కొంటూ కింగ్ఫిషర్ వివిధ కంపెనీల నుంచి విమానాలను అద్దెకు తీసుకున్నట్లు ఆరోపణలు చేసారు.

మాల్య బ్యాంక్ డబ్బు (రూ 255 కోట్లు) UK లో మళ్లించారని, అక్కడి నుండి ప్రచారం మరియు ప్రచార ఖర్చుల రూపంలో తన ఫార్ములా 1 జట్టుకు బదిలీ చేయబడిందని ఛార్జిషీట్ పేర్కొంది మరియు 2008 లో మాల్య Deutsche Bank కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఖాతా నుంచి రూ .15.9 కోట్ల రుణాల సొమ్ము చెల్లించి, తన ఐపిఎల్ టీం ఆర్సిబి ఖాతాలోకి డబ్బును బదిలీ చేసిందని ఆరోపించారు.

Read more about: vijay malya
English summary

ED గణాంకాల ప్రకారం విజయ్ మాల్యా IPL లో బెంగుళూరు జట్టు పై ఎంత వెచ్చించాడో తెలుసా? | Vijay Mallya Used Force India, RCB For Laundering: ED Chargesheet

(ED) has submitted a second chargesheet in a special court + against businessman Vijay Mallya, UB Holdings and the now-defunct Kingfisher Airlines, along with others, charging them with laundering Rs 9,990 crore which they had fraudulently availed as loan from State Bank of India-led consortium of 17 banks.
Story first published: Tuesday, June 19, 2018, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X