For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3000 వస్త్రాలతో పతంజలి దూసుకొస్తోంది చూడండి.

By Sabari
|

ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేసిన అనంతరం పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ వస్త్ర మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

పరిధాన్‌

పరిధాన్‌

ఈ ఏడాది చివరి వరకు ‘పరిధాన్‌' పేరుతో క్లాతింగ్‌(వస్త్ర) బ్రాండ్‌ను లాంచ్‌ చేయనున్నట్టు పతంజలి ఎండీ, సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ వెల్ల‌డించారు.

 థర్డ్‌ పార్టీ

థర్డ్‌ పార్టీ

వస్త్రాలను త‌మ కంపెనీలోనే థర్డ్‌ పార్టీ ద్వారా తయారు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యాపారాల నిర్వహణ కోసం నోయిడాలో ఓ బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వీటి అమ్మ‌కాల కోసం మెట్రో, నాన్‌-మెట్రో నగరాల్లో 100 ప్ర‌త్యేక స్టోర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు

 3000 రకాల

3000 రకాల

పతంజలి పరిధాన్‌ బ్రాండ్ కింద పిల్లల దుస్తులు, యోగా దుస్తులు, స్పోర్ట్స్‌వేర్‌, టోపీలు, బూట్లు, టవల్స్‌, దుప్పట్లు, యాక్ససరీస్‌ వంటి 3000 రకాల వస్తువులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అంతకముందే యోగా గురువు బాబా రాందేవ్‌ వెల్లడించారు.

స్వదేశీ జీన్స్‌ను

స్వదేశీ జీన్స్‌ను

వీటిలో ముఖ్యంగా స్వదేశీ జీన్స్‌ ఉండనున్నట్టు, భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా స్వదేశీ జీన్స్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

విదేశీవ‌ని

విదేశీవ‌ని

‘జీన్స్‌ అనేది పాశ్చాత్య ఆలోచ‌న‌. ఈ ఆలోచ‌న‌, సంప్ర‌దాయంతో మనం రెండు మార్గాల‌ను అనుసరించవచ్చు. ఒకటి విదేశీవ‌ని చెప్పి బహిష్క‌ర‌ణ‌ చేయడం లేదా వాటిని స్వీకరించడం. కానీ దేశీయ సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించలేం ఎందుకంటే జీన్స్‌ చాలా ప్ర‌సిద్ధి చెందాయి.

 బాలకృష్ణ

బాలకృష్ణ

దీంతో పాశ్చాత్య దుస్తుల మాదిరిగా కాకుండా.. పూర్తిగా స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ జీన్స్‌ను తయారుచేస్తున్నాం' అని బాలకృష్ణ కూడా ఓ సందర్భంలో చెప్పారు. దీంతో ఈ జీన్స్‌ ఎలా ఉండబోతుందోనని వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. మొత్తానికి ఏడాది చివర్లోనే ఈ జీన్స్‌ మార్కెట్లోకి రానున్నట్లు బాలకృష్ణ తాజాగా వెల్లడించారు.

Read more about: patanjali
English summary

3000 వస్త్రాలతో పతంజలి దూసుకొస్తోంది చూడండి. | Get Ready to Slip into 'Shuddh Swadeshi Jeans

Patanjali Ayurvedic is getting ready to enter the textile market after breaking up the FMCG market.
Story first published: Friday, June 15, 2018, 11:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X