For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాల్ మార్ట్ కంపెనీ మరో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటా .. ఇంత పెద్ద స్కెచ్!

By Sabari
|

వాల్‌మార్ట్‌-ఫ్లిప్ కార్ట్‌ ఒప్పందంపై దేశంలోని రిటైల్‌ వ్యాపారులు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కంపెనీ అనుసరించే అడ్డగోలు ధరల విధానం, భారీ డిస్కౌంట్లు తమ వ్యాపారాల్ని చంపేస్తాయని రిటైల్‌ వ్యాపారులుకు ప్రాతినిధ్యం వహించే అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సిఎఐటి) హెచ్చరించింది. వాల్‌మార్ట్‌ అమెరికా తరహా మరో ఈస్టిండియా కంపెనీ అని ఆరోపించింది.

వాల్ మార్ట్ కంపెనీ మరో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటా .. ఇంత పెద్ద స్కెచ్!

దేశీయ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ 77 శాతం వాటా కొనుగోలు చేయడంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభుకు మరో లేఖ రాసింది. 'గతంలో వ్యాపారం పేరుతో వచ్చిన ఈస్టిండియా కంపెనీ చివరికి మన దేశాన్ని కబళించింది. వాల్‌మార్ట్‌ కూడా అలాంటిదే. కాకపోతే ఇది అమెరికా తరహా ఈస్టిండియా కంపెనీ' అని తన లేఖలో పేర్కొంది. కేవలం లాభాల కోసమే ఫ్లిప్‌కార్ట్‌ ప్రమోటర్లలో కొంత మంది తమ మెజారిటీ వాటాను వాల్‌మార్ట్‌కి అమ్మారని సిఎఐటి విమర్శించింది.

Read more about: walmart flipkart
English summary

వాల్ మార్ట్ కంపెనీ మరో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటా .. ఇంత పెద్ద స్కెచ్! | Walmart is Another New Version of East Indian Company

Continuing its protest against the USD 16-billion Flipkart-Walmart deal, the Confederation of All India Traders.
Story first published: Saturday, May 26, 2018, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X