For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్వేస్ ఉచితంగా రెండు టిక్కెట్లను ఇస్తుందన్న వార్త నిజమేనా?

జెట్ ఎయిర్వేస్ కు సంబంధించిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చలామణి అవుతున్న సందేశం ప్రకారం, వైమానిక సంస్థ 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి 'రెండు ఉచిత టిక్కెట్లు' అందిస్తోందన్నారు.

|

జెట్ ఎయిర్వేస్ కు సంబంధించిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చలామణి అవుతున్న సందేశం ప్రకారం, వైమానిక సంస్థ 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి 'రెండు ఉచిత టిక్కెట్లు' అందిస్తోందన్నారు. 'జెట్ ఎయిర్వేస్ ఎయిర్లైన్స్ అందరికీ 2 ఉచిత టికెట్లు ఇస్తోంది,వారి 25 వ వార్షికోత్సవం జరుపుకునేందుకు, మీరు కూడా పొందాలంటే వెంటనే ఇక్కడ చేయండి అని లింక్ కొన్ని రోజులుగా బాగా వైరల్ ఇఇంది: jetaırways.com /. ఇప్పుడు, జెట్ ఎయిర్వేస్ ఈ సందేశం గురించి ఒక ప్రకటన జారీ చేసింది మరియు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

జెట్ ఎయిర్వేస్ ఉచితంగా రెండు టిక్కెట్లను ఇస్తుందన్న వార్త నిజమేనా?

ట్విట్టర్ లో ఎయిర్లైన్స్ వివరించారు, "#FakeAlert మా 25 వ వార్షికోత్సవం కోసం టికెట్ పొందండి అనే వార్త నకిలీ లింక్ ఎవరో ఇది ప్రవేశపెట్టారని సంస్థకు సంబంధం లేదని వివరించారు మరియు ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. వస్తావా వివరాలు మరియు సంస్థ కు సంబందించిన అన్ని విషయాలు సంస్థ ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాలపై మాత్రమే హోస్ట్ చేయబడతాయి, ఇవి నీలం రంగులతో సూచించబడతాయని సంస్థ పేర్కొంది.

ఫిబ్రవరిలో ఇదే విధమైన సందేశం సోషల్ మీడియాలో దుమారం లేపింది. ఇది థాయ్ ఎయిర్వేస్ పేరుతో సర్వే చేయండి మరియు అది పూర్తి చేసిన తర్వాత, వార్షికోత్సవం ప్రచారంలో భాగంగా ఉచిత టిక్కెలు వినియోగదారులు పొందగలరని వార్త చలామణి అయినది.

గత ఏడాది లోనే, రెండు ఉచిత డెల్టా ఎయిర్లైన్స్ టిక్కెట్లు ఇస్తోందని ఒక Facebook పోస్ట్ బాగా వైరల్ ఐపోయింది.దీనికి సర్వే పేరు ఎయిర్లైన్స్ అనికూడా పెట్టారు. డెల్టా వెంటనే మోసపూరితమైన చర్య అని స్పష్టం చేసింది మరియు స్పామర్లు కు సమాచారం అందించినవారిని, వారి స్కైమైల్స్ ఖాతాను వెంటనే మార్చడానికి మరియు ఏదైనా దుర్వినియోగం కాకుండా వారి ఖాతాను పర్యవేక్షించమని కోరింది.

ఇంతలో, జెట్ ఎయిర్వేస్ లిమిటెడ్ మార్చిలో ముగిసిన త్రైమాసికంలో ఊహించని నష్టాన్ని చవిచూసింది. అధిక ఇంధన వ్యయం మరియు కరెన్సీ హెచ్చుతగ్గులు కారణంగా మరియు గతేడాది ఇదే త్రైమాసికంలో రూ .602.4 కోట్ల లాభంతో పోల్చుకుంటే ప్రస్తుత నష్టంరూ. 1,036 కోట్లకు చేరింది. బ్లూమ్బెర్గ్ పరిశీలించిన విశ్లేషకులచే రూ .20.57 కోట్ల లాభాల అంచనాతో పోల్చి చూసింది. ఇంధన వ్యయం 30.5 శాతం పెరిగి రూ .2,063 కోట్లకు చేరింది మరియు అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి.

English summary

జెట్ ఎయిర్వేస్ ఉచితంగా రెండు టిక్కెట్లను ఇస్తుందన్న వార్త నిజమేనా? | WhatsApp Viral Message: Is Jet Airways Giving 2 Free Tickets? Here Is Truth

A tweet related to Jet Airways has gone viral. According to the message that is being circulated on the social media, the airline is offering ‘two free tickets’ to celebrate the airline’s 25th anniversary.
Story first published: Thursday, May 24, 2018, 13:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X