For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఉచితంగానే క్రెడిట్‌ కార్డును ఇస్తోంది.

By Sabari
|

మంచి పరపతి చరిత్ర (క్రెడిట్‌ హిస్టరీ) లేని వారికి బ్యాంకులు క్రెడిట్‌ కార్డు ఇచ్చేందుకు ఇష్టపడవన్న విషయం తెలిసిందే. ఉద్యోగం లేకుండా స్వయంగా ఉపాధి పొందుతున్న వారికి, రెగ్యులర్‌గా ఆదాయం లేని వారికి క్రెడిట్‌ కార్డు లభించడం కష్టమే. ఇలాంటి వారి కోసమే ఎస్‌బిఐ 'ఉన్నతి' పేరుతో క్రెడిట్‌ కార్డును తెచ్చింది. ఇది ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంది

కార్డు పొందండి ఇలా:

కార్డు పొందండి ఇలా:

ఎస్‌బిఐ శాఖల ద్వారా ఉన్నతి క్రెడిట్‌ కార్డును పొందవచ్చు. దరఖాస్తుదారుని వయసు, చేస్తున్న ఉద్యోగం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అర్హతను నిర్ణయిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్‌బిఐ శాఖను సంప్రదించి తెలుసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు పొందాలనుకునే వారు ఎస్‌బిఐ వద్ద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. 25,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తాన్ని బట్టి క్రెడిట్‌ పరిమితిని నిర్ణయిస్తారు.

క్యాష్‌ బ్యాక్‌

క్యాష్‌ బ్యాక్‌

ఉన్నతి కార్డును వినియోగించే కస్టమర్లు 500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఇంధనాన్ని కొనుగోలు చేస్తే ఒక శాతం ఇంధన సర్‌చార్జీని మినహాయిస్తారు. ఇది అన్ని పెట్రోల్‌ పంపుల్లోనూ వర్తిస్తుంది. ఒక నెలలో గరిష్ఠంగా 100 రూపాయల మినహాయింపు లభిస్తుంది. క్రెడిట్‌ కార్డు ద్వారా వార్షికంగా 50,000 రూపాయలు అంతకు మించి కొనుగోళ్లు చేస్తే 500 రూపాయల క్యాష్‌ బ్యాక్‌ను పొందవచ్చు

వార్షిక ఫీజు

వార్షిక ఫీజు

మొదటి నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు ఉండదు. ఐదో సంవత్సరం నుంచి 499 రూపాయల వార్షిక ఫీజు ఉంటుంది. కార్డు ద్వారా చేసే ప్రతి 100 రూపాయల ఖర్చుపై ఒక రివార్డు పాయింట్‌ను పొందవచ్చు. వివిధ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ రివార్డు పాయింట్లను వినియోగించుకోవచ్చు.

కొనుగోలు చేసే వస్తుసేవలకు

కొనుగోలు చేసే వస్తుసేవలకు

క్రెడిట్‌ కార్డు ఉంటే.. తాము కొనుగోలు చేసే వస్తుసేవలకు వెంటనే చెల్లింపులు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లును దాదాపు 50 రోజుల తర్వాత చెల్లించాల్సి ఉంటుంది.

చాలా మంది

చాలా మంది

ఈ కాలంలో క్రెడిట్‌ కార్డు సంస్థకు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు ఖాతాలో నిల్వ లేనప్పుడు, అత్యవసర సమయాల్లో క్రెడిట్‌ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే క్రెడిట్‌ కార్డును చాలా మంది తీసుకుంటారుకంటెంట్ ఫ్రొమ్ ఏబిన్.

Read more about: sbi credit card sbi
English summary

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఉచితంగానే క్రెడిట్‌ కార్డును ఇస్తోంది. | State Bank of India (SBI) Provides a Free Credit Card

It is known that banks are willing to give credit cards to those who do not have good credit history
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X