For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారీ మొత్తం లో నిధులు?

2023 నాటికి 10 లక్షల ఎలెక్ట్రిక్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని భారత్ లో మొదటిగా నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. టయోటా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసింది.

|

2023 నాటికి 10 లక్షల ఎలెక్ట్రిక్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని భారత్ లో మొదటిగా నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. టయోటా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసింది. ప్రెసస్ PHEV మరియు స్మాల్ ఇవీ కమ్యూటర్ ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారీ మొత్తం లో నిధులు?

ఎలక్ట్రిక్ వాహనాలపై పెద్ద ఎత్తున లక్షంగా పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక కొత్త పథకాన్ని లేదా నూతన విధానాన్ని రాష్ట్రంలో పెద్దఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. ఆంధ్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ. 30,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులకు, బ్యాటరీ తయారీదారులకు, చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే కంపెనీలకు, తుది వినియోగదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలున్నాయి. 2023 నాటికి 10 లక్షల ఎలెక్ట్రిక్ వాహనాలను రోడ్లపై ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు మొదటి రెండు కంపెనీలకు తయారీ కేంద్రాల కోసం 10 శాతం మూలధన సబ్సిడీని పొందుతారు,అంతే కాకుండా తయారీ కంపెనీ నెలకొలిపే సమయంలో నీరు.విద్యుత్ బిల్లులలో అదనంగా సబ్సిడీలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) లో సంతకాలు చేసింది. అమరావతి లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు "ప్రియస్ PHEV" మరియు "స్మాల్ ఇవీ కమ్యూటర్" పరిచయం గురించి సాధ్యత అధ్యయనాన్ని ప్రారంభించింది.

టొయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ అకిటో టాచిబనా మాట్లాడుతూ, దేశంలో కాలుష్య సమస్యను వాహనాల విద్యుదీకరణ ద్వారా తగ్గించవచ్చని దీనికి గాను ఆంధ్రప్రదేశ్ ను అభినందిస్తున్నానని అయన అన్నారు. బాధ్యత కలిగిన వాహన తయారీదారుగా,మేము పెద్ద పాత్ర పోషిస్తామని భద్రత మరియు ఇంధన ఆదా విషయంలో మంచి ఫలితాలు సాధిస్తామని విశ్వసిస్తున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత నగర బస్సులను 4 నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి తరువాత మొత్తం రాష్ట్రంలో 2030 నాటికి ప్రవేశపెడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రాష్ట్రాల్లో మొదటగా విద్యుత్ బస్సులు ప్రారంభించాలని నిర్ణఇంచింది. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మద్దతు ఇవ్వడానికి, రాష్ట్ర పవర్ పంపిణీ కంపెనీలు పైన పేర్కొన్న నగరాల్లో 100 అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే పాయింట్లు ఏర్పాటు చేస్తాయి. ఛార్జింగ్ స్టేషన్లు బహిరంగ ప్రదేశాలు, వాణిజ్య మరియు నివాస భవనం మరియు ప్రభుత్వ కార్యాలయాలలో అందుబాటులో ఉంటాయి.

English summary

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారీ మొత్తం లో నిధులు? | Andhra Pradesh Invests Rs 30,000 Crore To Boost Electric Vehicles

Andhra Pradesh is one of the first states in India to set a target of 10 lakh electric vehicles on roads by 2023. Toyota has already signed a MoU with Andhra Pradesh Government and is working towards the introduction of Prius PHEV and Small EV Commuter.
Story first published: Friday, May 18, 2018, 12:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X