For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతదేశంలో అత్యంత ఆదాయం కలిగిన దేవాలయాలు ఏవో తెలుసా?

మన భారతదేశం ప్రసిద్ధ దేవాలయాలకు సంప్రదాయాలకు నిలయం,దేశం లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఒకొక్క దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కుకుంటారు అలాగే వారి కోరికలు తీరాక

|

మన భారతదేశం ప్రసిద్ధ దేవాలయాలకు సంప్రదాయాలకు నిలయం,దేశం లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఒకొక్క దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కుకుంటారు అలాగే వారి కోరికలు తీరాక స్వామి వారికీ మొక్కులు చెల్లించుకుంటారు.కొంతమంది తాము సంపాదించినా ఆదాయంలో కొంత దేవునికి సమర్పిస్తారు ఇంకొంతమంది ఇతర మార్గాల్లో అనేక కానుకలు హుండీలో వేయడం జరుగుతుంది ఆలా సంపద వస్తున్న దేవాలయాల్లో అత్యంత సంపద కలిగిన దేవాలయాలు ఏవో తెలుసుకుందాం...

10.సోమనాథ్ దేవాలయం:

10.సోమనాథ్ దేవాలయం:

సోమీనాథ్ దేవాలయం గుజరాత్ రాష్ట్రం లో ఉంది,ఈ దేవాలయాన్ని మొహమ్మద్ గజినీ 17 సార్లు దోచుకున్నాడు అలాగే ఈ దేవాలయం 8 సార్లు కూల్చారు మరి అన్నే సార్లు నిర్మించారు.చివరిసారిగా 1951 లో అప్పటి డిప్యూటీ ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అద్వర్యం లో ఈ దేవాలయం తిరిగి నిర్మించారు,ఈ గుడిని సుమారు 10 లక్షల నుండి 20 మంది దర్శించుకుంటారు.శివుడికి సంబంధించి 12 జోతిర్ లింగాలలో మొదటి లింగం ఎక్కడ స్థాపించారని పురాణాలూ చెప్తున్నాయి.

ఈ దేవాలయం సంవత్సరపు ఆదాయం దాదాపు 5 కోట్ల నుండి 10 దాక ఉంటుందని అంచనా.

9.కాశి విశ్వనాధుని దేవాలయం:

9.కాశి విశ్వనాధుని దేవాలయం:

కాశి విశ్వనాధుని ఆలయం వారణాసిలో ఉంది.ఈ గుడికి ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల మంది సందర్శకులు వస్తుంటారని అంచనా ఇందులో సుమారు 20 లక్షల మంది దాక విదేశీయులు ఉంటారని ఒక సెర్వ్య్ అంచనా వేసి చెప్పింది.

ఈ దేవాలయం సంవత్సరపు ఆదాయం సుమారు 5 కోట్ల నుండి 10 దాక ఉంటుంది.

8.జగన్నాథ్ ఆలయం:

8.జగన్నాథ్ ఆలయం:

జగన్నాథ్ ఆలయం పూరి లో ఉంది.ఈ దేవాలయానికి రోజు 30 వేళా మంది దర్శించుకుంటారని అంచనా.అలాగే పరవ దినాల్లో ఈ సంఖ్య 70 వేలకు చేరుతుందని అంచనా.

ఈ ఆలయం సంవత్సరపు ఆదాయం సుమారు 10 కోట్ల నుండి 15 కోట్ల దాక ఉంటుంది.

7.మీనాక్షి దేవాలయం:

7.మీనాక్షి దేవాలయం:

మీనాక్షి దేవాలయం ముదురై లో ఉంది.ఈ దేవాలయాన్ని రోజుకు 35 వేళా మంది భక్తులు దర్శిస్తారని అంచనా.ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది సుమారు 33 వేళా శీలా విగ్రహాలతో గుడిని నిర్మించారు మరియు 14 గోపురాలు ఉన్నాయి.

ఈ దేవాలయం సంవత్సరపు ఆదాయం సుమారు 20 కోట్ల నుండి 30 కోట్ల దాక ఉంటుందని అంచనా.

6.గోల్డెన్ టెంపుల్ :

6.గోల్డెన్ టెంపుల్ :

గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ లో ఉంది.హిందూ,ముస్లిం,సిక్కులు అని తేడా లేకుండా అన్ని మతాల వారు ఈ దేవాలయం సందర్శించడం విశేషం.ఈ గుడిలోని ఒక పందెర్ని బంగారంతో నిర్మించారు.ఈ దేవాలయం ఆదాయం బహిర్గతం చేయలేదు కానీ కోట్లలో ఉంటుందనే అంచనా.

5.సిద్ధి వినాయక ఆలయం:

5.సిద్ధి వినాయక ఆలయం:

సిద్ధి వినాయక ఆలయం ముంబై లో ఉంది.ఈ గుడిని రోజుకి లక్ష కు పైగా భక్తులు సందర్శిస్తారని అంచనా.ఈ గుడిలో ని గణేశుని విగ్రహాన్ని 200 సంవత్సరాల కింద ప్రతిష్టించారు సుమారు 3 .7 కేజీల బంగారంతో పూత పూయించారు.

ఈ దేవాలయం సంవత్సరపు ఆదాయం సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

4.వైష్ణో దేవి దేవాలయం:

4.వైష్ణో దేవి దేవాలయం:

వైష్ణో దేవి దేవాలయం జమ్మూ లో ఉంది.ఈ దేవాలయం చాల పూరాతనమైనది.సంవత్సరానికి 80 లక్షలకు పైగా దర్శించుకుంటారని అంచనా,తిరుపతి తరువాత అత్యంత భక్తులు దర్శించుకునే దేవాలయం ఇదే కావడం విశేషం.

ఈ దేవాలయం సంవత్సరపు ఆదాయం సుమారు 500 కోట్లకు పైనే ఉంటుంది.

3.షిరిడి సాయి బాబా దేవాలయం:

3.షిరిడి సాయి బాబా దేవాలయం:

షిరిడి సాయి బాబా దేవాలయం షిరిడి లో ఉంది.అన్ని మతాల వారు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆలయం ప్రయేకథ.సుమారు రోజుకు లక్షకు పైగా భక్తులు సందర్శిస్తారని అంచనా.స్వామివారికి 100 కోట్ల కు పైగా బంగారు ఆభరణాలు ఉన్నాయి.

ఈ దేవాలయం సంవత్సర ఆదాయం సుమారు 360 కోట్లు.

2.వెంకటేశ్వర దేవాలయం:

2.వెంకటేశ్వర దేవాలయం:

కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తిరుమలలో నెలకొంది.రోజుకు సుమారు 2 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శిస్తారని అంచనా,అలాగే స్వామివారికి వెయ్యి కేజీల బంగారం ఉంది.

ఈ దేవాలయం సంవత్సరపు ఆదాయం సుమారు 600 కోట్లు పైమాటే.

1.అనంత పద్మనాభ దేవాలయం:

1.అనంత పద్మనాభ దేవాలయం:

అనంత పద్మనాభ దేవాలయం కేరళలో నెలకొంది.ఈ ఆలయం మొదటి స్థానంలో నిలిచింది,దేవాలయంలో ఆరు రహస్య గదులు తెరవగా సుమారు రెండు వేల కోట్ల నిధి ఉంది అందులో ఒక విష్ణు విగ్రహం విలువ సుమారు 500 కోట్లు ఉంటుంది అలాగే ఈ నిధిలో పురాతనమైన నాణేలు,వజ్రాలు,కెంపులు మరెన్నో విలువైనవి చాల ఉన్నాయి.

English summary

భారతదేశంలో అత్యంత ఆదాయం కలిగిన దేవాలయాలు ఏవో తెలుసా? | 10 Richest Temples Around India That Have More Money

Temples are a beacon of hope for devotees who visit them. With each prayer comes an offering that makes the god 'rich', and the temple richer than ever. In this 'give and take', the deities rake in more moolah than even some billionaires do.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X