For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.500 ఇస్తే మీ ఆధార్ వివ‌రాలు అమ్మకానికి రెడీ

రూ.500 ఖ‌ర్చు పెడితే దేశంలో ఉండే 100 కోట్ల పౌరుల ఆధార్ వివ‌రాలు ఇంట‌ర్నెట్ సెంట‌ర్ల‌లో లభ్య‌మ‌వుతున్నాయి. దీనికి సంబంధించి ట్రిబ్యూన్ అనే మీడియా సంస్థ చేసిన శూల‌శోధ‌న‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూశా

|

ప్ర‌స్తుతం ప్ర‌తి గుర్తింపుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాల్లో బ్యాంకుల్లో ఆర్థిక సంస్థ‌లో ఆధార్ ప్ర‌త్యేక గుర్తింపుగా చ‌లామ‌ణీ అవుతున్న‌ది. 12 అంకెల ఆధార్ సంఖ్య‌ను చాలా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అనుసంధానిస్తున్నారు. అయితే మీ ఆధార్ వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఎంత భ‌ద్ర‌మో ఆలోచించారా... చాలా మంది ఇదంతా ప్ర‌భుత్వం చూసుకుంటుందిలే అని వ‌దిలేసి ఉంటారు. అది త‌ప్పు. ఎందుకంటే రూ.500 ఖ‌ర్చు పెడితే దేశంలో ఉండే 100 కోట్ల పౌరుల ఆధార్ వివ‌రాలు ఇంట‌ర్నెట్ సెంట‌ర్ల‌లో లభ్య‌మ‌వుతున్నాయి. దీనికి సంబంధించి ట్రిబ్యూన్ అనే మీడియా సంస్థ చేసిన శూల‌శోధ‌న‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూశాయి. ఈ ఆధార్ డేటా లీక్ గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ పాఠ‌కుల కోసం...

 ఏజెంట్ల మాయాజాలం

ఏజెంట్ల మాయాజాలం

కొంత మంది గుర్తు తెలియ‌న వ్య‌క్తులు(అమ్మ‌కందారులు) ఏజెంట్ల యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డల ద్వారా వాట్స‌ప్‌లో దేశ పౌరుల ఆధార్ వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెడుతున్నారు. ఇదివ‌ర‌కే చాలా మంది పౌరులు దీనిపై ఆందోళ‌న వెలిబుచ్చారు. ఆధార్ వివ‌రాల‌ను గోప్యంగా ఉండ‌టం లేద‌ని ప్ర‌భుత్వం పైన చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు. అయితే వీట‌న్నింటిని కొట్టి పారేసిన ప్ర‌భుత్వం ఆధార్ డేటా అత్యంత సుర‌క్షితంగా ఉన్న‌ట్లు న‌మ్మ‌బ‌లికింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మ‌రోలా ఉంది.

ట్రిబ్యూన్ శూల‌శోధ‌న‌

ట్రిబ్యూన్ శూల‌శోధ‌న‌

ట్రిబ్యూన్ అనే మీడియా సంస్థ శూల‌శోధ‌న ప్ర‌కారం అతి త‌క్కువ ధ‌ర‌కే యూజ‌ర్ల ఆధార్ వివ‌రాలు ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి సిద్దంగా ఉన్నాయి. వాట్స‌ప్లో ట్రిబ్యూన్ క‌రెస్పాండెంట్ ఒక గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి వాట్స‌ప్‌లో వివ‌రాల‌ను కొనుగోలు చేశారు. పేటీఎమ్ ద్వారా స‌ద‌రు వ్య‌క్తికి రూ.500 పంపించిన ట్రిబ్యూన్ రిపోర్టర‌కు అజ్ఞాత వ్య‌క్తి కొద్ది సేప‌టి త‌ర్వాత ఆధార్ వివ‌రాలు లీక్ చేశారు. దీని ప్ర‌కారం ఏజెంట్ మీడియా రిపోర్ట‌ర్‌కు ఒక లాగిన్ ఐడీ, పాస్ వ‌ర్డ్ పంపించారు. దీంతో ఆ క‌రెస్పాండెంట్ దేశంలో ఉన్న 100 కోట్ల మంది ఆధార్ కార్డుల వివ‌రాల నుంచి వారి పేరు, చిరునామా, ఫోన్ నంబ‌రు, ఫోటో, మెయిల్ ఐడీ వంటి వివ‌రాల‌ను యాక్సెస్ చేయ‌గ‌లిగారు.

ప్ర‌భుత్వంకు సంబంధించి యూఐడీఏఐ వాద‌న ఇలా...

ప్ర‌భుత్వంకు సంబంధించి యూఐడీఏఐ వాద‌న ఇలా...

అయితే ఇదంతా జ‌రిగిన త‌ర్వాత ట్రిబ్యూన్ క‌రెస్పాండెంట్ యూఐడీఏఐని సంప్ర‌దించారు. అయితే దీనికి సంబంధించి యూఐడీఏఐ ట్రిబ్యూన్ క‌థ‌నాల‌ను కొట్టిపారేసింది. ఆధార్ వివ‌రాల‌ను పూర్తిగా సుర‌క్షితంగా ఉంచామ‌ని, భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఉంటుంద‌ని యూఐడీఏఐ వివ‌ర‌ణ ఇచ్చింది.

రూ. 300కే ఆధార్ వివ‌రాల ప్రింట్ అవుట్

రూ. 300కే ఆధార్ వివ‌రాల ప్రింట్ అవుట్

అంతే కాకుండా ఏజెంట్లు ఇచ్చిన సాఫ్ట్వేర్ సాయంతో ఇష్టానుసారం ఎవ‌రిది కావాలంటే వారి ఆధార్ ప్రింట్ అవుట్ తీసుకోవ‌చ్చు. ట్రిబ్యూన్ మీడియా సంస్థ త‌ర‌పున విలేక‌రులు యూఐడీఏఐని సంప్ర‌దించగా దీనికి సంబంధించి జ‌రిగిన త‌ప్పును ఒప్పుకున్నారు. అయితే యూఐడీఏఐ అధికారులు సైతం సంభ్ర‌మాశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ''యూఐడీఏఐ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్, నేను త‌ప్ప వేరే ఎవ‌రికి ఆధార్ అధికారిక వెబ్సైట్ సంబంధించిన లాగిన్ వివ‌రాలు తెలియ‌వు. ఇది ఎలా జ‌రిగిందో తెలుసుకోవాలి. ఆ లాగిన్ వివ‌రాలు మ‌రెవ‌రి వ‌ద్దున్నా అది చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రిగింది. దేశ భద్రత ప్ర‌మాదంలో ప‌డింది'' అని యూఐడీఏఐ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సంజ‌య్ జిందాల్ వెల్ల‌డించారు.

Read more about: aadhar uidai
English summary

రూ.500 ఇస్తే మీ ఆధార్ వివ‌రాలు అమ్మకానికి రెడీ | aadhar details leaked just for Rs 500 revealed by tribune

An investigation by The Tribune has revealed that sellers on WhatsApp are providing unrestricted access to over a billion Aadhaar details for just Rs 500. The Tribune reports that a correspondent "purchased" a service from an anonymous seller on WhatsApp by paying Rs 500 via Paytm.
Story first published: Thursday, January 4, 2018, 16:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X