For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క‌నీస నిల్వ లేకుంటే విధించే రుసుముల‌ రూపంలో రూ.1771 కోట్లు వ‌సూలు చేసిన ఎస్‌బీఐ

గ‌తేడాది నుంచి ఎస్బీఐ బ్యాంకులో క‌నీస న‌గ‌దు నిల్వ‌(మినిమం బ్యాలెన్స్) నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రి. అలా బ్యాంకు ఖాతాలో క‌నీస నిల్వ లేక‌పోతే బ్యాంకు ఫైన్ వేస్తుంది. ఆ రూపంలో విధించిన అప‌రాధ రుసుము ద్వార

|

దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన ఎస్‌బీఐ అన్ని విధాలుగా వ్యాపారం బాగా చేస్తుంద‌ని వినికిడి. అయితే ఇప్పుడు మ‌రో కొత్త మార్గంలో సైతం బ్యాంకు బాగానే ఆదాయం స‌ముపార్జిస్తోంది. ఎలా అంటారా... అయితే ఇది చ‌ద‌వండి.
గ‌తేడాది నుంచి ఎస్బీఐ బ్యాంకులో క‌నీస న‌గ‌దు నిల్వ‌(మినిమం బ్యాలెన్స్) నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రి. అలా బ్యాంకు ఖాతాలో క‌నీస నిల్వ లేక‌పోతే బ్యాంకు ఫైన్ వేస్తుంది. ఆ రూపంలో విధించిన అప‌రాధ రుసుము ద్వారా స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా రూ.1771 కోట్లు వ‌సూలు చేసింది. 2017 సంవ‌త్స‌రంలో ఏప్రిల్-న‌వంబ‌ర్ మ‌ధ్య క‌నీస నిల్వ నిర్వ‌హించకుండా ఉన్నందుకు వినియోగ‌దారుల నుంచి అప‌రాధ రుసుము రూపంలో వ‌సూలు చేసిన సొమ్ము విలువ ఇది.

 క‌నీస న‌గ‌దు నిల్వ‌

జులై-సెప్టెంబ‌రు మ‌ధ్య 2017లో బ్యాంకు ఆర్జించిన నిక‌ర లాభం రూ.1581 కోట్ల కంటే ఇలా అప‌రాధ రుసుము రూపంలో ఎస్బీఐ సేక‌రించిన సొమ్మే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రో విధంగా చూస్తే ఏప్రిల్-సెప్టెంబ‌రు మ‌ధ్య బ్యాంకు ఆర్జించిన మొత్తం లాభం రూ.3586 కోట్ల‌లో స‌గం కంటే ఎక్కువ‌గా స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియాకు అప‌రాధ రుసుము ద్వారా వ‌చ్చింది.

ఎస్బీఐ బ్యాంకులో మొత్తం 42 కోట్ల పొదుపు ఖాతాలు ఉన్నాయి. అందులో సాధార‌ణ పొదుపు ఖాతాలు,జన్ ధ‌న్ ఖాతాలు క‌లిసి 13 కోట్ల మేర ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ త‌ర‌హా ఖాతాల‌కు క‌నీస నిల్వ నిర్వ‌హించక‌పోతే అప‌రాధ చార్జీలు ఉండ‌వు.

Read more about: sbi minimum balance
English summary

క‌నీస నిల్వ లేకుంటే విధించే రుసుముల‌ రూపంలో రూ.1771 కోట్లు వ‌సూలు చేసిన ఎస్‌బీఐ | SBI collected Rs 1771 crore as charges for not maintaining MAB

The country’s largest lender State Bank of India collected Rs 1,771 crore during April-November 2017 as charges from customers who did not maintain their minimum monthly average balance (MAB) in their accounts, according to Finance Ministry data
Story first published: Tuesday, January 2, 2018, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X