For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ పాండా ఇండియా, ఓలా చేతికి

ఫుడ్‌పాండాకు చెందిన భారతీయ వ్యాపారాలను కొనుగోలు చేస్తున్నట్టు క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా ప్రకటించింది. ఈ మేర‌కు ఫుడ్‌ పాండాలో 20 కోట్ల డాలర్లు (రూ.1300 కోట్లు) పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ఓలా తెలిపింది.ఈ

|

ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని కోరుకున్న చోట‌కు ఫుడ్ సరఫరా చేసే ఫుడ్‌పాండాకు చెందిన భారతీయ వ్యాపారాలను కొనుగోలు చేస్తున్నట్టు క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా ప్రకటించింది. ఈ మేర‌కు ఫుడ్‌ పాండాలో 20 కోట్ల డాలర్లు (రూ.1300 కోట్లు) పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ఓలా తెలిపింది.ఈ ప‌రిణామానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు మీ కోసం...

ఫుడ్ డెలివ‌రీ కంపెనీల్లో ఇదే భారీ పెట్టుబ‌డి

ఫుడ్ డెలివ‌రీ కంపెనీల్లో ఇదే భారీ పెట్టుబ‌డి

భారత్‌లో ఆన్‌లైన్‌లో ఆహార వస్తువులు సరఫరా చేసే ఒక కంపెనీలో ఇంత భారీ పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం. పూర్తిగా షేర్ల మార్పిడి విధానంలో ఈ డీల్‌ అమలు జరుగుతుంది. ఉభయ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం డీల్‌ విలువకు దీటుగా ఓలా షేర్లు బదిలీ చేస్తే ఫుడ్‌పాండా యజమానులు తమ భారత వ్యాపారాలను ఓలాకు బదిలీ చేస్తారు. ఈ విధంగా ఎన్ని షేర్లు చేతులు మారేది ఓలా ప్రకటించలేదు. అయితే ఇది వాస్త‌వ రూపం దాల్చిన త‌ర్వాత మొత్తం ఫుడ్ పాండా ఆహార ప‌దార్థాల వ్యాపారం ఓలా చేతికి బ‌దిలీ అవుతుంది.

ఒప్పందం ఎందుకు?

ఒప్పందం ఎందుకు?

ఓలా కంపెనీ 2014 సంవత్సరంలోన ఓలా కెఫె పేరుతో ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించి తదుపరి దాన్నుంచి త‌ప్పుకొంది. ఈ విభాగంలో జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల నుంచి మిగ‌తా వాటికి గట్టి పోటీ ఉంది. ఇటీవలే పోటీ సంస్థ ఉబర్‌ కూడా ఉబర్‌ ఈట్స్‌ పేరుతో ఫుడ్‌ డెలివరీలో ప్రవేశించింది. ఈ పోటీదారులను ఎదుర్కొనగలిగేలా సరికొత్త వ్యూహంతో ఫుడ్‌ బిజినెస్ లో ప్రవేశించేందుకు తమకు ఫుడ్‌ పాండా కొనుగోలు ఉపయోగపడుతుందని ఓలా తెలిపింది.

ఫుడ్ పాండా గురించి

ఫుడ్ పాండా గురించి

ప్రస్తుతం ఫుడ్‌పాండా 100 నగరాల్లో 15 వేలకు పైగా రెస్టారెంట్లు భాగస్వాములుగా కలిగి ఉంది. 2016-17లో 62.16 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించింది. 2016-17లో నష్టాలు కూడా 69 శాతం తగ్గాయి. 2019 నాటికి లాభాల్లో ప్రవేశించాలన్న లక్ష్యం నిర్దేశించుకుంది.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో వార్షిక ఆదాయం ప్రాతిప‌దిక‌న కంపెనీ ఆదాయం రూ.37.81 కోట్ల నుంచి రూ.62.16 కోట్ల‌కు పెరిగింది.

 ఓలా గురించి

ఓలా గురించి

ఏఎన్ఐ టెక్నాల‌జీ పేరిట రిజిస్ట‌ర్ అయిన ఓలా 2010లో బెంగుళూరులో ప్రారంభమైంది. అయితే దీన్ని మొద‌ట ముంబ‌యిలో స్థాపించారు. ట్యాక్సీ క్యాబ్ సేవ‌లు, దూర ప్రాంతాల‌కు బాడుగ‌కు ఓలా త‌న కార్లను తిప్పుతుంది. 2017 నాటికి ఈ సంస్థ‌లో 6000 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. ఓలా ఆటో బెంగుళూరు, ఢిల్లీ, పుణె, చెన్నై,హైద‌రాబాద్‌, కోల్ క‌త వంటి ప్ర‌దాన న‌గ‌రాల్లో సేవ‌ల‌ను ప్రారంభించింది. త‌ర్వాత మైసూర్, చంఢీఘ‌డ్, ఇండోర్, అహ్మ‌దాబాద్, జైపూర్, గౌహ‌తి, విశాఖ వంటి వాటికి సైతం విస్త‌రించింది.

Read more about: ola foodpanda
English summary

ఫుడ్ పాండా ఇండియా, ఓలా చేతికి | ola acquires foodpanda a food delivery company

Ola, operated by ANI Technologies Pvt. Ltd, has acquired online food delivery start-up Foodpanda India from its German parent Delivery Hero AG in an all-stock deal that will see the ride-hailing firm infuse $200 million in Foodpanda India’s operations.
Story first published: Wednesday, December 20, 2017, 10:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X