For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్స్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు

బిట్ కాయిన్స్ ఇంత విపరీతంగా పెరిగిపోతున్న దీని యొక్క విలువ గాలి బుడగలాగ పేలిపోయి విలువ పాతాళానికి పడిపోతుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచంలోని వివిధ ఎక్స్చేంజి ల్లో ధరల మధ్య తేడా చాలా

|

ఈ మ‌ధ్య వార్త‌ల్లో ఎక్కువ‌గా బిట్ కాయిన్స్ గురించి వ‌స్తుండ‌టం మీరు విని, చూసే ఉంటారు. లక్సంబ‌ర్గ్ కేంద్రంగా ఉన్న బిట్ స్టాంప్ ఎక్స్చేంజి కేంద్రంగా గ‌త గురువారం రోజు బిట్ కాయిన్ విలువ దాదాపు 48 గంటల్లోనే 4 వేల డాలర్లు పెరిగి ఒక కాయిన్ ధ‌ర‌ 16000 డాలర్ల కు చేరుకున్నది. ఇది ఒక రికార్డు స్థాయిలో చేరుకున్న విలువ అని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ఏమిటంటే, ఇంత విపరీతంగా పెరిగిపోతున్న దీని యొక్క విలువ గాలి బుడగలాగ పేలిపోయి విలువ పాతాళానికి పడిపోతుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోని వివిధ ఎక్స్చేంజి ల్లో ధరల మధ్య తేడా చాలా అధికంగా ఉంది. అతిపెద్ద ఎక్స్చేంజి అయిన జిడాక్స్లో దీని యొక్క ధర 19500 డాలర్లకు చేరుకుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్స్ గురించి మీకు తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.బిట్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే :

1.బిట్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే :

బిట్ కాయిన్స్ సంఖ్య గరిష్టంగా కేవలం 21 మిలియన్లు మాత్రమే ఉండాలని నిబంధనను విధించారు. 2140 సంవత్సరంలో ఈ సంఖ్యను ప్రపంచం చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 16.7 మిలియన్ల బిట్ కాయిన్లను వ్యవస్థలోకి పంపడం జరిగింది. ఒక అంచనా ప్రకారం ప్రతి పది నిమిషాలకు 12.5 కొత్త బిట్ కాయిన్లు " మైనింగ్ " ప్రక్రియ ద్వారా విడుదలవుతున్నాయట. ప్రపంచంలో ఉన్న అత్యాధునిక కంప్యూటర్ల సాయంతో కొన్ని సంక్లిష్టమైన అల్గోరిథంలను చేధించడం ద్వారా కొత్త బిట్ కాయిన్స్ అనేవి పుడుతుంటాయి.

2. శక్తి హరించుకుపోవుట :

2. శక్తి హరించుకుపోవుట :

ఈ మైనింగ్ అనే ప్రక్రియను చేసే కంప్యూటర్లు పని చేయాలంటే విపరీతమైన శక్తి కావలి. ఎప్పుడైతే బిట్ కాయిన్ యొక్క విలువ పెరుగుతుందో అటువంటి సమయంలో మార్కెట్ లో మైనర్లు కూడా పెరుగుతుంటారు. ఇందువల్ల మరింత శక్తి వాడటం జరుగుతుంది. ఈమధ్యనే ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ అయిన మదర్ బోర్డు చేసిన అధ్యయనం ప్రకారం ఒక్కో బిట్ కాయిన్ లావాదేవికి గాను గంటకు 215 కిలో వాట్ ల శక్తి ఖర్చు అవుతుందని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 300000 బిట్ కోయిన్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తుంటే, ఈ లెక్కన ఎంత శక్తి అవసరమవుతుందో మనం అంచనా వేయవచ్చు. అమెరికాలో సరాసరి ఒక్కొక్క గృహం ఒక వారం మొత్తం ఎంత శక్తిని వాడుతారో దానికి సమానంగా ఒక్కో బిట్ కాయిన్ లావాదేవికి ఖర్చవుతుందట.

3. బిట్ కాయిన్లలో బిట్స్ అంటే ఏమిటి ?

3. బిట్ కాయిన్లలో బిట్స్ అంటే ఏమిటి ?

మీరు గనుక బిట్ కాయిన్ కొనాలని భావిస్తే బిట్ కాయిన్ మొత్తాన్ని కొనాల్సిన అవసరం లేదు. బిట్ కాయిన్ లో అత్యంత చిన్న యూనిట్ ని సతోషి అంటారు. ఈ క్రిప్టో కరెన్సీకి సతోషి నక మోటో ఒక అంతుచిక్కని సృష్టికర్త అని చాలామంది నమ్ముతారు. అతనికి గుర్తుగానే ఆ యూనిట్ కి సతోషి అని నామకరణం చేసారు. ఒక్కో బిట్ కాయిన్ లో మిలియన్ లో వందో వంతుని సతోషి గా పిలుస్తారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎక్స్చేంజి రేట్ల ప్రకారం ఒక్కో సతోషి విలువ 0.0002 డాలర్.

4. బిట్ కాయిన్ కోటీశ్వరులు :

4. బిట్ కాయిన్ కోటీశ్వరులు :

2011 వ సంవత్సరం నుండి గమనిస్తే ఒక్క 2014 సంవత్సరంలో తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంకులు విడుదల చేసిన కరెన్సీ కంటే ఈ బిట్ కాయిన్ కరెన్సీ నే అత్యద్భుతంగా రెట్టింపు అయ్యిందంట. కానీ, 2014 లో మాత్రం సాధారణ కరెన్సీ కంటే కూడా దారుణంగా విఫలం అయ్యిందట. 2017 సంవత్సరంలో ఎప్పుడు లేనంతగా 1400 శాతం పెరిగింది. 2013 లో మీరు ఒక్కో బిట్ కాయిన్ ని 1000 డాలర్లకు కొనుగోలు చేసి ఉంటే వాటిని అమ్మకుండా అలానే మీ దగ్గర పెట్టుకొని ఉంటే ఇప్పుడు మీ దగ్గర దాదాపు 120 మిలియన్ డాలర్ల డబ్బు ఉండేది. బిట్ కాయిన్ అనే ఈ కరెన్సీ ఒక నిరాధారమైన సాధనంగా చాలా మంది ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దాని యొక్క అస్థిరత, లావాదేవీలు యొక్క అధిక చార్జీలు మరియు అసలు నిజం ఏమిటంటే ఇందుకు సంబంధించిన వర్తకులు చాలా కొద్ది మంది మాత్రమే ఉండటం.

5. ఎక్స్చేంజి లు దోపిడీకి గురికావడం :

5. ఎక్స్చేంజి లు దోపిడీకి గురికావడం :

ఇప్పటి వరకు 980000 బిట్ కాయిన్ లు ఎక్స్చేంజి లలో దోపిడీకి గురైయ్యాయని అంచనా వేస్తున్నారు. వీటిని హ్యాకర్ లు లేదా లోపల పనిచేస్తున్న వారే దొంగలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం వీటి యొక్క మొత్తం విలువ 15 బిలియన్ డాలర్లు ఉంటుంది. దొంగలించిన వాటిలో కొన్నింటిని కనుక్కొని మళ్ళీ వ్యవస్థలోకి తేవడం జరిగింది.

6. అంతు చిక్కని సృష్టికర్త :

6. అంతు చిక్కని సృష్టికర్త :

బిట్ కాయిన్ ని ఎవరు సృష్టించారు అనే విషయమై చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఇంకొంతమంది అయితే మేమె కనిపెట్టాము అని ముందుకు వచ్చారు. కానీ, ఇప్పటికి ఎవ్వరికి తెలియని విషయం ఏమిటంటే, అసలు ఈ బిట్ కాయిన్ ని కనిపెట్టారు అని చెబుతున్న సతోషి నకమోటో అనే వ్యక్తి ఎవరు అనే విషయం ఈ ప్రపంచానికి తెలీదు లేదా ఆస్ట్రేలియా కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు పారిశ్రామికవేత్త అయిన క్రైగ్ రైట్ బిట్ కాయిన్ సంఘంలో ఉన్న ప్రముఖ సభ్యులను మే 2016 లో తానే నకమోటో అని ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, ఆ సంఘంలో వారు ఖచ్చితంగా చూపించాలి అని అడిగిన ఆధారాలను చూపించడంలో ఈయన వెనుకాడరు. ఈ సతోషి నకమోటో అనే పేరు ఎవరైనా ఒక వ్యక్తి పేరా లేక వీటిని వృద్ధి చేస్తున్న వారు లేదా వృద్ధి చేసిన వ్యక్తి వారి సౌకర్యార్ధం వాటికి పెట్టుకున్న పేరా అనే విషయం తెలియ రాలేదు లేక అసలు నకమోటో ఇంకా బ్రతికే ఉన్నాడా అనే విషయం కూడా ఎవ్వరికి తెలీదు. అప్పుడప్పుడు కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన హల్ ఫింనే పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. తాను నకమోటో అని వస్తున్న వార్తలను ప్రముఖ డెవలపర్ నిక్ సజాబో ఖండించారు. ఎయిన్ మస్క్ అనే టెక్నాలజీ పారిశ్రామికవేత్త కూడా అని కూడా అంటుంటారు.

7. చైనా లో వ్యాపారం బాగా పెరిగిపోయింది :

7. చైనా లో వ్యాపారం బాగా పెరిగిపోయింది :

ఈ సంవత్సరం మొదటి వరకు చైనా ఎక్స్చేంజి లలో 90 శాతం వరకు ట్రేడింగ్ లావాదేవీలు జరుగుతున్నాయని అని చాలా మంది భావించారు. కానీ, వాటి వెనుక ఉన్న అసలు నిజం ఏమిటంటే, వాష్ ట్రేడ్స్ అనే ప్రక్రియ ద్వారా కొన్ని ఎక్స్చేంజి లు వాటి యొక్క లావాదేవీలను బాగా పెంచి చూపించాయట. వివిధ అకౌంట్ ల మధ్య లావాదేవీలను కావాలనే జరిపారు అనే విషయం బయటపడింది. వీటిని గమనించిన చైనా అధికారులు వాటి యొక్క లావాదేవీల పై చార్జీలు విధించారు. దీని వల్ల లావాదేవీల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు అది 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఈ సమాచారం అంతా బిట్ కాయునిటీ అనే వెబ్ సైట్ లో ప్రచురించింది.

8. మార్కెట్ క్యాప్ :

8. మార్కెట్ క్యాప్ :

ఇప్పటి వరకు వ్యవస్థలోకి విడుదల చేసిన బిట్ కాయిన్ల విలువ దాదాపు 283 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీని యొక్క మొత్తం విలువను విశ్లేషించి దానిని మార్కెట్ క్యాప్ లాగా పరిగణిస్తే వీసా సంస్థ కంటే ఎక్కువగా మరియు బ్లాక్ రాక్ మరియు సిటీ గ్రూప్ కలిసినా కూడా వాటి మార్కెట్ కంటే కూడా బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ పెద్దది అని చెబుతున్నారు.

9. శత్రువులు ఎవరంటే :

9. శత్రువులు ఎవరంటే :

ఈ క్రిప్టో కరెన్సీ లో బిట్ కాయిన్ అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రాముఖ్య వెబ్ సైట్ కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1000 కి పైగా వివిధరకాల క్రిప్టో కరెన్సీ లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ బిట్ కాయిన్ కి పోటీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాయి.

10. కుదించడం :

10. కుదించడం :

వివిధ రకాల ఎక్స్చేంజి లు మరియు ఎన్నో రిటైల్ ప్లాట్ ఫార్మ్స్ వద్ద బిట్ కాయిన్స్ ని కుదించడం జరుగుతుంది. బిట్ కాయిన్స్ ని కుదించవచ్చు. కొద్దిగా అధిక మొత్తం చెల్లించడం ద్వారా, అధిక విలువను ఇవ్వడం ద్వారా లేదా ఎక్స్చేంజిల వద్ద అధిక డబ్బు ఏది చెల్లించకుండానే ఎక్స్చేంజి ల ద్వారా రుణాలు తీసుకోవచ్చు. కానీ, అతిపెద్ద ఆర్ధిక సంస్థలైన సి ఎం ఈ గ్రూప్, సి బి ఓ ఈ మరియు నాస్డాక్ బిట్ కాయిన్ ఫ్యూచర్ లను ఇష్టున్నట్లు ప్రకటించాయి. ఇలా చేయడం ద్వారా విశ్వ వ్యాప్తంగా అందరూ ఆమోదించబడే విధంగా ఈ యొక్క క్రిప్టో కరెన్సీ ని కుదించుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో ఇలా ప్రకటించారు.

11. పోగొట్టుకున్న బిట్ కాయిన్లు :

11. పోగొట్టుకున్న బిట్ కాయిన్లు :

మైనింగ్ ద్వారా వెలికి తీయబడిన దాదాపు 16.7 మిలియన్ బిట్ కాయిన్లు ఇప్పుడు చలామణిలో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పాస్ వర్డ్ లు మరచిపోవడం ద్వారా , ప్రమాదాలు జరగడం వల్ల, దొంగ నిల్వలు చేయడం ద్వారా, బిట్ కాయిన్ లు ఉన్నాయనే విషయాన్ని యజమానులు మరచిపోవడం వల్ల లేదా వారు మరణించడం వల్ల కొన్ని బిట్ కాయిన్లు అనేటివి వ్యవస్థలో లేవు. అసలు ఎన్ని బిట్ కాయిన్లు శాశ్వతంగా పోయాయి అనే విషయం తెలుసుకోవడం అసాధ్యం. ఎందుచేతనంటే, అవి వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా అవి ఎక్కడో తెలియని అచేతన స్థితిలో ఉంటూ అంతు చిక్కని చిరునామాలో ఉన్నాయి. కానీ, 2013 లో ఒక ప్రముఖ విశ్వ విద్యాలయం ప్రచురించిన ఒక వార్త ప్రకారం ఇప్పటి వరకు మైనింగ్ ద్వారా వెలికి తీయబడిన 64 శాతం అంటే 12 మిలియన్ బిట్ కాయిన్లు అసలు ఇప్పటి వరకు ఖర్చు చేయలేదంట. బిట్ కాయిన్ లను వృద్ధి చేసే వ్యక్తుల్లో ప్రముఖుడైన సెర్గియో లెర్నర్ అంచనా ప్రకారం ఒక మిలియన్ బిట్ కాయిన్లు ఇప్పటి వరకు ఖర్చు చేయలేదని, వీటన్నింటిని ఎవరో అంతు చిక్కనివ్యక్తి తయారు చేసారని చెబుతున్నారు.

12. ధనవంతుల పట్టిక :

12. ధనవంతుల పట్టిక :

ప్రపంచంలోని వెయ్యి అతి పెద్ద వాల్లెట్స్ లో 56,38,155 బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఈ బిట్ కాయిన్లు చలామణిలో ఉన్న మూడో వంతుకు సమానం. ప్రపంచంలోని వెయ్యి అతిపెద్ద బిట్ కాయిన్లు కలిగిన ఖాతాదారుల దగ్గర ఉన్న అన్నిటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 87 బిలియన్ డాలర్లు.

13. అత్యధిక చార్జీలు :

13. అత్యధిక చార్జీలు :

గత సంవత్సర కాలంగా సగటున బిట్ కాయిన్ లావాదేవీలకు చెల్లించే చార్జీలు ఘననీయంగా పెరిగాయి. దీనికి తోడు క్రిప్టో కరెన్సీ యొక్క విలువ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఒక్కో బిట్ కాయిన్ లావాదేవీలకు గాను ఇప్పుడు 7 డాలర్ల 30 సెంట్లు ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం మొదట్లో ఈ యొక్క ఛార్జ్ 30 సెంట్లు ఉండేది. ఈ సమాచారం అంతా ప్రముఖ వెబ్ సైట్ బిట్ఇన్ఫోఛార్ట్స్ ప్రచురించింది.

14. రెండురకాలుగా విభజించబడింది :

14. రెండురకాలుగా విభజించబడింది :

ఆగస్టు 1, 2017 కంటే ముందు మీ దగ్గర బిట్ కాయిన్ ఉంటే, మీ దగ్గర బిట్ కాయిన్ క్యాష్ కూడా ఉంది ఉండేది. ఈ క్యాష్ అనేది కాయిన్ కి సమరూపంగా ఉండే విధంగా సృష్టించబడింది. ఆ తేదీన బిట్ కాయిన్ ని రెండు రకాలుగా విభజించబడింది. ఈ ప్రక్రియను ఆంగ్లంలో " ఫోర్క్ " అని అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆ సాఫ్ట్ వేర్ కోడ్ ని రెండుగా విభజించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ప్రకారం ఒక యూనిట్ బిట్ కాష్ విలువ 1300 డాలర్లకు పైగానే ఉంది. ఈ సంవత్సరం మొదట్లో గనుక ఎవరైనా బిట్ కాయిన్ లలో పెట్టుబడి పెట్టి ఉంటే అటువంటి వారికి 135 శాతం రాబడి వచ్చి ఉండేది.

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలుబంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో స‌బ్సిడీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు ఎలా?

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో స‌బ్సిడీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు ఎలా?

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో స‌బ్సిడీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు ఎలా?ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో స‌బ్సిడీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు ఎలా?

 పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విష‌యాలు

పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విష‌యాలు

ఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన‌ 10 విష‌యాలుఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన‌ 10 విష‌యాలు

క్రెడిట్ కార్డుల‌పై విధించే వివిధ రుసుములు, చార్జీలు

క్రెడిట్ కార్డుల‌పై విధించే వివిధ రుసుములు, చార్జీలు

క్రెడిట్ కార్డుల‌పై విధించే వివిధ రుసుములు, చార్జీలుక్రెడిట్ కార్డుల‌పై విధించే వివిధ రుసుములు, చార్జీలు

 క్రెడిట్ స్కోర్ 5 ముఖ్య విష‌యాలు

క్రెడిట్ స్కోర్ 5 ముఖ్య విష‌యాలు

సిబిల్ క్రెడిట్ స్కోర్ గురించిన ఐదు ముఖ్య‌ విష‌యాలు సిబిల్ క్రెడిట్ స్కోర్ గురించిన ఐదు ముఖ్య‌ విష‌యాలు

English summary

బిట్ కాయిన్స్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు | 10 Things You Might Now Know About Bitcoin worlds largest crypto currency

Bitcoin rocketed to another record high close of $16,000 on the Luxembourg-based Bitstamp exchange on Thursday after gaining more than $4,000 in just 48 hours, stoking concerns that a rapidly swelling bubble could be set to burst.There were huge disparities between prices across different exchanges. On GDAX, one of the biggest, the price reached $19,500.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X