For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో క‌స్ట‌మ‌ర్లు 13 కోట్లు, అయినా మార్కెట్ వాటాలో ఎయిర్‌టెల్‌యే రారాజు

జియో నెట్వ‌ర్క్‌లో సెప్టెంబ‌రు నెల‌లో కొత్త‌గా 60 లక్ష‌ల మంది వ‌చ్చి చేరారు. అదే స‌మ‌యంలో ఒక్క నెల‌లోనే దేశం మొత్తం మీద 29 ల‌క్ష‌ల మంది టెలికాం యూజ‌ర్లు త‌గ్గారు. ట్రాయ్ వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కా

|

దేశ టెలికాం రంగంలో ఒక క‌న్సాలిడేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. అంటే ఇంత‌కుముందు ఎక్కువ మంది ఏది బాగుంటే ఆ సిమ్ వాడేసి ప‌క్క‌న ప‌డేసే తీరు మారి టెలికాం సిమ్‌ల వాడ‌కంలో స‌ర్దుబాటు జ‌రుగుతోంది. సెప్టెంబ‌రు నెల‌లో జియో స‌బ్‌స్క్రైబ‌ర్లు పెరిగి మొత్తం టెలికాం చందాదారులు త‌గ్గ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. సెప్టెంబ‌రు నెల‌లో ఒక్కో నెట్‌వ‌ర్క్‌లో కొత్త‌గా చేరిన చందాదారుల సంఖ్య‌, దేశ టెలికాం రంగంలో ఏం జ‌రుగుతోందో కింద తెలుసుకుందాం.

జియోలో ఎంత మంది చేరినా ఎయిర్‌టెల్ టాప్

జియోలో ఎంత మంది చేరినా ఎయిర్‌టెల్ టాప్

జియో నెట్వ‌ర్క్‌లో సెప్టెంబ‌రు నెల‌లో కొత్త‌గా 60 లక్ష‌ల మంది వ‌చ్చి చేరారు. అదే స‌మ‌యంలో ఒక్క నెల‌లోనే దేశం మొత్తం మీద 29 ల‌క్ష‌ల మంది టెలికాం యూజ‌ర్లు త‌గ్గారు. ట్రాయ్ వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం అన్ని టెలికాం కంపెనీల చందాదారులు క‌లిసి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 2.39 ల‌క్ష‌ల మంది వైర్‌లైస్ క‌నెక్ష‌న్లు త‌గ్గాయి.

గ్రామాల్లో సైతం త‌గ్గుతున్న క‌నెక్ష‌న్లు

గ్రామాల్లో సైతం త‌గ్గుతున్న క‌నెక్ష‌న్లు

గ్రామీణ ప్రాంతాల్లో సైతం చాలా వైర్‌లెస్, వైర్‌లైన్ క‌నెక్ష‌న్లు త‌గ్గుతున్నాయి. సెప్టెంబ‌రు నెల‌లో ఈ ఏడాదిలో మ‌రెన్న‌డూ లేనంత స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య త‌గ్గింది. అయితే జియో, బీఎస్ఎన్ఎల్; ఎయిర్‌టెల్ మూడు నెట్‌వర్క్‌ల విష‌యంలో టెలికాం చందాదారుల సంఖ్య తగ్గ‌కుండా పెరిగింది. అంటే ఈ మూడు నెట్వ‌ర్క్‌ల్లో కొత్త క‌స్ట‌మ‌ర్లు వ‌చ్చి జ‌త చేరారు.

దేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలుదేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలు

 ట్రాయ్ గ‌ణాంకాలు ఇలా...

ట్రాయ్ గ‌ణాంకాలు ఇలా...

ట్రాయ్ స‌మాచారం ప్ర‌కారం ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ క‌నెక్ష‌న్లు 40వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 4,20,000 వైర్ లెస్ క‌నెక్ష‌న్లు, 30 వేల ల్యాండ్ లైన్ క‌నెక్ష‌న్లు త‌గ్గాయి. సెప్టెంబ‌రు 2017 నాటికి దేశ మొత్తం టెలికాం వినియోగ‌దారుల సంఖ్య 102.06 కోట్లుగా ఉంది. ఇందులో 100.18కోట్ల మంది మొబైల్ కనెక్ష‌న్లు వాడుతుండ‌గా, 2.3 కోట్ల మంది ల్యాండ్ లైన్ వినియోగ‌దారులుగా ఉన్నారు.

పోర్ట‌బిలిటీ

పోర్ట‌బిలిటీ

ఒక నెట్వ‌ర్క్ నుంచి మ‌రో నెట్‌వ‌ర్క్ లోకి మారిన వారి సంఖ్య 54.90 ల‌క్ష‌లుగా ఉంది. 2010లో ఈ సౌక‌ర్యం తెచ్చిన‌ప్ప‌టి నుంచి ఒక నెట్వ‌ర్క్ నుంచి మ‌రో నెట్‌వ‌ర్క్లోకి మారిన వారి సంఖ్య 30 కోట్లుగా ఉంది.

వివిధ సంస్థ‌ల క‌స్ట‌మ‌ర్ల సంఖ్య ఇలా...

వివిధ సంస్థ‌ల క‌స్ట‌మ‌ర్ల సంఖ్య ఇలా...

ఎయిర్‌టెల్ మార్కెట్ వాటా-23.84%, క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 28.20 కోట్లు

వోడాఫోన్ మార్కెట్ వాటా -17.53%, క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 20.737 కోట్లు

ఐడియా మార్కెట్ వాటా - 16.07%, కస్ట‌మ‌ర్ల సంఖ్య 19.01 కోట్లు

రిల‌య‌న్స్ జియో మార్కెట్ వాటా-11.72%, క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 13.86 కోట్లు

బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా-8.94%, వినియోగ‌దారుల సంఖ్య‌- 10.576 కోట్లు

ల్యాండ్ లైన్ల విష‌యంలో ఇలా...

ల్యాండ్ లైన్ల విష‌యంలో ఇలా...

ల్యాండ్ లైన్ ఫోన్లు క‌లిగిన వారి సంఖ్య 2.377 కోట్ల నుంచి 2.367 కోట్ల‌కు త‌గ్గారు.

ల్యాండ్ లైన్ల విష‌యంలో ఇప్ప‌టికీ 54 ల‌క్ష‌లకు పైగా క‌నెక్ష‌న్ల‌తో 54.06% మార్కెట్ వాటాను బీఎస్ఎన్ఎల్‌యే క‌లిగి ఉంది.

దాని త‌ర్వాత ఎయిర్టెల్(16.49%), ఎంటీఎన్ఎల్ (14.38%) వాటాలు ఎక్కువ ఉన్నాయి.2017లో 5 ఉత్త‌మ స్మాల్ క్యాప్ ఫండ్స్

పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలుపిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

 ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా చిన్న వ్యాపారుల‌కు రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణంప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా చిన్న వ్యాపారుల‌కు రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలుబంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!

సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!

సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!

Read more about: jio reliance jio airtel telecom
English summary

జియో క‌స్ట‌మ‌ర్లు 13 కోట్లు, అయినా మార్కెట్ వాటాలో ఎయిర్‌టెల్‌యే రారాజు | Jio added 59 lakhs new connections in september to its network

Even as Reliance Jio subscriber base increased by nearly 6 million in September 2017, the country’s overall telecom user base dipped by 2.9 million. According to data released by Telecom Regulatory Authority of India (TRAI), the churn can be attributed to the 2.38 million wireless connections in urban areas going off the grid.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X